amp pages | Sakshi

టిప్పర్‌ ఢీకొని మహిళ దుర్మరణం

Published on Sat, 07/28/2018 - 09:42

విజయపురం : నగరి మండపం వద్ద శుక్రవారం బైక్‌ను టిప్పర్‌ లారీ ఢీకొనడంతో మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రోజా అక్కడికి చేరుకుని పోలీసు అధికా రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. బాధితుల కథనం మేరకు.. నిండ్ర మండలానికి చెందిన శేఖర్, సుమతి (40) దంపతులు నగరి కోర్టుకు వచ్చారు. తిరిగి స్వగ్రామం వెళుతుండగా నగరి మండపం వద్ద అడవికొత్తూరు నుంచి పుత్తూరు వైపు కంకర తీసుకెళుతున్న టిప్పర్‌ లారీ ఢీకొంది.

కింద పడిన సుమతి తలపై లారీ చక్రాలు ఎక్కాయి. దీంతో ఆమె అక్కడిక్కడే దుర్మరణం చెందింది. ఆమె భర్త శేఖర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రోజా అక్కడికి చేరుకున్నారు. బాధితుల ఆర్తనాదాలు చూసి కంటతడి పెట్టారు. ఆమె మాట్లాడుతూ అడవికొత్తూరు వద్ద ఉన్న వేల్‌మురుగన్‌ క్రషర్‌ నుంచి టిప్పర్‌ లారీలు నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో ప్రధాన రహదారిపై తిరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని మండిపడ్డారు. క్వారీల నిర్వాహుకులపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు కలెక్టర్‌కు విన్నవించా మని తెలిపారు. పరిశీలనకు వచ్చిన ఆర్డీవో స్థాయి అధికారి క్వారీ నిర్వాహకులతో కుమ్మక్కై నిందితులను రక్షిస్తున్నారని ఆరోపించారు.

సీఐని సస్పెండ్‌ చేయాలి
ఎమ్మెల్యే రోజా మూడు గంటల సేపు జాతీయ రహదారిపై ఎండలో ధర్నాకు దిగడంతో నీరసించి పోయారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. కల్తీ మద్యం స్మగ్లర్‌ మైకేల్‌ రాజ్, అక్రమ క్వారీ నిర్వహిస్తున్న వేల్‌మురగన్‌కు నగరి సీఐ మల్లికార్జునగుప్తా కొమ్ముకాస్తున్నారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. టిప్పర్లు, లారీలు పట్టణం వెలు పలి నుంచి వెళ్లేలా చూడాలని విన్నవించినా పట్టించుకోలేదని తెలిపారు. నిరుపేద మహిళ ప్రమాదంలో మృతిచెందినా సీఐ నిర్లక్ష్యంగా శవాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారని ఆరోపించారు.

మున్సిపాలిటీ అనుమతి లేకపో యినా మైకేల్‌రాజ్‌ రోడ్డు పక్కన బార్‌ ఏర్పాటు చేశారని, పోలీసులు అడ్డుకోవడం లేదన్నారు. మూడు గంటల పాటు ధర్నా చేయడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పుత్తూరు డీఎస్పీ భవాని శ్రీహర్ష, ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ సూర్యనారాయణ అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేతో చర్చించారు. సీఐని తక్షణం సస్పెండ్‌ చేయాలని ఎమ్యెల్యే తేల్చి చెప్పడం తో డీఎస్పీ ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ ఎమ్మె ల్యేకు ఫోన్‌లో హామీ ఇవ్వడంతో ధర్నా విరమించా రు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌