amp pages | Sakshi

ప్రేమన్నాడు.. పెళ్లన్నాడు.. కులం అడ్డంటున్నాడు

Published on Fri, 09/21/2018 - 07:57

బంజారాహిల్స్‌: ప్రేమించాడు... పెళ్లి చేసు కుంటానని నమ్మించి సహజీవనం చేశాడు.. .పెళ్లి చేసుకోవాలని కోరగా కులం తక్కువని నిరాకరించాడు. తనను మోసం చేసిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జవహర్‌నగర్‌కు చెందిన యువతి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తోంది. 2009లో ఎస్‌ఆర్‌నగర్‌లో ఇంటర్‌ చదువుతున్న సమయంలో ఉదయ్‌శంకర్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.

ఏడాదిగా వారు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో సహజీవనం చేసింది. ఈ నెల 6న పెళ్లి విషయమై ఒత్తిడి చేయగా ఆమె ఇంటికి వచ్చిన అతను తప్పకుండా పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులకు చెప్పి వెళ్లిపోయాడు. ఆ తెల్లవారే తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. బాధితురాలు ఫోన్‌ చేయగా నేను ‘ కులం కారణంగా నేను నిన్ను పెళ్లి చేసుకోలేనని ఓ సారి, అంత కట్నం మీరు ఇచ్చుకోగలరా అంటూ మరో సారి జవాబిస్తూ పెళ్లికి నిరాకరించాడు. తాను మోసపోయినట్లు గుర్తించిన  బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Videos

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ

రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌