amp pages | Sakshi

సుడిగాలులకు చెక్‌

Published on Sun, 03/19/2017 - 21:54

- పండ్ల తోటలను కాపాడుకోవచ్చు
– ఉద్యానశాఖ డీడీ బీఎస్‌ సుబ్బరాయుడు

అనంతపురం అగ్రికల్చర్‌ : ఈదురు, పెనుగాలులు, సుడిగాలుల నుంచి పండ్లతోటలను కాపాడుకునేందుకు రైతులు కొన్ని రక్షణ చర్యలు చేపట్టాలని ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ (డీడీ) బీఎస్‌ సుబ్బరాయుడు తెలిపారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఎక్కువగా ఈదురుగాలుల బీభత్సం, పిడుగులతో కూడిన అకాల వర్షాలు పడుతుంటాయని చెప్పారు. విపరీతమైన గాలుల వల్ల కోతలు, కాపుకు వచ్చిన అరటి, బొప్పాయి పంటలు దెబ్బతింటుండగా మామిడి, చీనీ లాంటి తోటల్లో కాయలు రాలుతున్నాయన్నారు. అలాగే లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసుకున్న షేడ్‌నెట్లు, గ్రీన్‌హౌస్, పాలీహౌస్‌లు, నర్సరీలు లాంటివి కూడా దెబ్బతినే పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నష్ట నివారణకు రైతులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొంత వరకు సమస్య నుంచి గట్టెక్కవచ్చని పేర్కొన్నారు.

రక్షణ చర్యలు
ఉద్యాన తోటల చుట్టూ గాలినిరోధక చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా అరటి, బొప్పాయి తోటలు సాగు చేసే సమయంలో తోట చుట్టూ కనీసం రెండు మూడు వరుసలు ఏపుగా పెరిగే అవిశె లేదా సరుగుడు లాంటి చెట్లు నాటుకుంటే కొంత వరకు గాలితీవ్రతను నివారించవచ్చు. అలాగే నీలగిరి, మలబార్‌ వేప, చెట్టు ఆముదం, చెట్టు తంగేడు లాంటివి వేసుకున్నా మేలు. అరటి రైతులు ప్రతి ఎకరాకు రెండు వరసులు అవిశే నాటుకోవడం వల్ల నష్టాన్ని పూర్తీగా తగ్గించవచ్చు. అలా చేయకపోతే పెరిగిన చెట్లు, గెల వేసిన చెట్లు, కాయలు కాసిన చెట్లు గాలివేగానికి నేలవాలే పరిస్థితి ఉంటుంది. కనీసం పంగలు కలిగిన కట్టెలతో అరటి చెట్లకు పోట్లు పెట్టుకుంటే కొంత వరకు నష్టాన్ని తగ్గించవచ్చు.

కంపకంచె, ముళ్లకంచె వేసుకున్నా నష్టాన్ని తగ్గించుకోవచ్చు. తోటచుట్టూ కలబంద వేసినా, సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసుకుంటే ఇబ్బంది ఉండదు. అలాగే కందికట్టెను తడికెలు మాదిరిగా అల్లుకుని తోట చుట్టూ పెట్టుకున్నా ఫలితం ఉంటుంది. పాలీహౌస్, గ్రీన్‌హౌస్‌ల చుట్టూ కూడా అవిశే, సరుగుడు, నీలగిరి, మలబార్‌ వేప లాంటివి వేసుకోవడంతో పాటు చుట్టూ నీటితడులు ఇస్తే సుడిగాలిని నియంత్రించవచ్చు.  విండ్‌స్ప్రింట్‌ అనే దోమతెరను గ్రీన్‌హౌస్‌ చుట్టూ వేసుకుని గాలి వెళ్లడానికి అవకాశం కల్పిస్తే ఈదురుగాలుల నుంచి కాపాడుకోవచ్చు.

Videos

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)