amp pages | Sakshi

సీటు ఎక్కడో తెలియక ఉద్యోగుల అవస్థలు

Published on Mon, 10/03/2016 - 10:12

అమరావతి:  
వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ఏర్పాట్లు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. కంప్యూటర్లు, కుర్చీలను ఇంకా ఏర్పాటు చేయలేదు. ఎవరి సీటు ఎక్కడో తెలియక ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. లగేజీలతో హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులు సోమవారం విధులకు హాజరయ్యారు. భవనాల్లో పనులు ఇంకాకొనసాగుతూనే ఉన్నాయి. అధికారుల హడావుడి కనిపిస్తుందే గానీ పాలనకు సంబంధించి పనులేవీ పూర్తి కాలేదు.

ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఛాంబర్‌ మినహా తాత్కాలిక సచివాలయంలో ఏ ఒక్క ఛాంబర్‌ కూడా పూర్తి కాలేదు. మొదటి భవన నిర్మాణ పనులను ఇటీవల ప్రారంభించారు. మిగిలిన ఐదు భవనాల్లో లోపల, బయట పనులు చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చిన ఫైళ్లు, కంప్యూటర్లు ఎక్కడివి అక్కడే కనిపిస్తున్నాయి.  లోపల అద్దాలు, వైరింగ్‌ పనులు నడుస్తున్నాయి. బ్లాక్‌ల ముందు రోడ్లు, డివైడర్‌ పనులు పూర్తి కాలేదు. అండర్‌ డ్రెయినేజీ పనులు అసంపూర్తిగా కనిపిస్తున్నాయి. మంచినీటి సరఫరా పనులు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం తాత్కాలిక సచివాలయం వద్ద పరిస్థితి గందరగోళంగా కనిపిస్తోంది. ప్రహరీ నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి.
 

Videos

పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్

నాగబాబు నీతులు..!

బస్సులో అయిదుగురు సజీవదహనం...

పచ్చమూక దౌర్జన్యం

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఐదు అంచెల భద్రత

టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్ఆర్ సీపీదే: ద్వారంపూడి

రౌడీయిజం సాగదు..టీడీపీ నేతలపై ఫైర్

లోక్ సభ స్థానాలపై లెక్కలు ప్రకటించుకున్న పార్టీలు

లోక్ సభ స్థానాలపై లెక్కలు ప్రకటించుకున్న పార్టీలు

పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)