amp pages | Sakshi

ఆక్వా పార్క్‌ పనులు ఆపాల్సిందే

Published on Wed, 04/05/2017 - 00:31

మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్‌లో విషవాయువుల్ని వెదజల్లి ఐదుగురి ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఘటనతో అయినా ప్రభుత్వం కళ్లు తెరవాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని డిమాండ్‌ చేశారు. తక్షణమే తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ పనులను నిలుపుదల చేయాలని కోరారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో మీడియాతో కలిసి మొగల్తూరు నల్లంవారి తోటలో ఆనంద ఆక్వా ప్లాంట్‌ను, గొంతేరు డ్రెయిన్‌ను మంగళవారం పరిశీలించారు. 
నరసాపురం : ‘మొగల్తూరులో ఐదుగురు మరణానికి కాలుష్యం కారణం కాదు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం. ఆ ప్లాంట్‌లో అసలు కాలుష్యమే లేదు’ అని అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో అక్కడ కాలుష్యం ఏ మేరకు ఉంది, నిబంధనలకు నీళ్లొదిలి అనంద యాజమాన్యం కాలుష్యాన్ని గొంతేరులో ఏవిధంగా కలుపుతోందన్న విషయాలపై అఖిలపక్షం మొగల్తూరులో పర్యటించింది. అక్కడి పరిస్థితులను ఆళ్ల నాని మీడియాకు చూపించారు. ఆనంద ఆక్వా ప్లాంట్‌ నిర్వహణ నిబంధనల మేరకే జరుగుతోందని, తొలగించారని ప్రభుత్వం అబద్ధపు ప్రకటన చేసింది. వాస్తవానికి ప్లాంట్‌లో ప్రమాదానికి కారణమైన సంప్‌ నుంచి నేరుగా పైపులైన్లను ఆనంద యాజమాన్యం గొంతేరు డ్రెయిన్‌లోకి వేసింది. పడవల్లో గొంతేరు డ్రెయిన్‌లోకి మీడియాను, అఖిలపక్షాన్ని తీసుకువెళ్లిన స్థానిక మత్య్సకారులు అక్రమ పైపులైన్లను చూపిం చారు. ఆ పైపులైన్ల ద్వారా గొంతేరులో కలిసిన వ్యర్థాలను సైతం నీటిలోంచి తీసి చూపించారు. రొయ్యల తలలు, ఇతర భాగాలను గొంతేరు డ్రెయిన్‌లో కలుపుతున్న విషయం దీంతో తేటతెల్లమైంది. ఈ పైప్‌లైన్లనే ఐదు నెలల క్రితం తొలగించినట్టు మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో చెప్పారని, మరి వీటి గురించి ఇప్పుడేం సమాధానం చెబుతారని మీడియా ద్వారా ఆళ్ల నాని ప్రశ్నించారు. ప్రమాదానికి కారణమైన సంప్‌ నుంచి వారం రోజులు గడుస్తున్నా విషవాయువులకు సంబంధించిన దుర్వాసన తగ్గకపోవడాన్ని అక్కడికి వెళ్లిన వారంతా గమనించారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ప్రమాదానికి విద్యుదాఘాతం కారణమంటూ ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసేందుకు ప్రయత్నించడం దుర్మార్గమని ఆళ్ల నాని ధ్వజమెత్తారు. ఆనంద యాజమాన్యం చేస్తున్న తప్పులను, వారిని వెనకేసుకొస్తూ సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చెపుతున్న అబద్ధాలను వివరించారు. ఫ్యాక్టరీ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేస్తున్నారని, ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ద్వారా శుద్ధి చేసిన నీటిని యాజమాన్యం మొక్కల పెంపకానికి వినియోగిస్తున్నారని మంత్రులు అసెంబ్లీలో చెప్పారన్నారు. ఇక్కడ యాజమాన్యం పెంచుతున్న మొక్కలు ఎక్కడ ఉన్నాయని, ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఎక్కడుందని ప్రశ్నించారు. అక్కడున్న రైతులు, మహిళలు, మత్స్యకారులు వైఎస్సార్‌ సీపీ, అఖిలపక్ష నాయకులకు తమ ఇబ్బందులను వివరించారు. ప్లాంట్‌ను ఇక్కడి నుంచి తరలించకపోతే తమకు బతుకులు ఉండవని వేడుకున్నారు. వారితో ఆళ్ల నాని మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ఇదే విషయమై ప్రభుత్వంతో తీవ్రంగా పోరాడుతున్నారని చెప్పారు. అధైర్యపడవద్దని వైఎస్సార్‌ సీపీ అండగా నిలబడుతుందని, న్యాయం జరిగే వరకూ పోరాడుతుందని భరోసా ఇచ్చారు. అసెంబ్లీలో పచ్చి అబద్ధపు ప్రకటన చేసిన మంత్రి అచ్చెన్నాయుడు దమ్ముంటే మీడియాతో కలిసి ఫ్యాక్టరీ వద్దకు చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు. ఆనంద ప్లాంట్‌ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్టు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నివేదిక ఇచ్చిందని, పరిస్థితి మారకపోతే ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఫ్యాక్టరీని సీజ్‌ చేయాలని కూడా ఆదేశించిందని వివరించారు. అప్పుడు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఘోరం జరిగింది, ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఆలోచన చేయండని బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో కోరితే.. తప్పును సరిదిద్దే ప్రయత్నం చేయకపోగా శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అనడం దారుణమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జనం చనిపోతే వారిని ప్రతిపక్ష నేతగా పరామర్శించడం శవ రాజకీయాలు అవుతాయా, మానవత్వం మరిచిపోయి ఎక్కడ శవాలు ఉంటే అక్కడకు వైఎస్‌ జగన్‌ వెళ్లిపోతున్నారంటూ వ్యంగ్యంగా మాట్లాడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా కార్మిక, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పితాని సత్యనారాయణకు జిల్లాలో కాలుష్యకారక పరిశ్రమలపై అవగాహన ఉందన్నారు. ముఖ్యంగా నరసాపురం ప్రాంతంపై పట్టుందన్నారు. ఆయనైనా మొగల్తూరు ఘటనపై న్యాయంగా వ్యవహరించాని సూచించారు. తుందుర్రు ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ఆపాలనే డిమాండ్‌తో మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఈనెల 7, 8 తేదీల్లో నరసాపురంలో నిరాహార దీక్ష చేస్తున్నారని వివరించారు. 
ప్రజలు క్షమించరు
మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ తుందుర్రులో ఆక్వా పార్క్‌ నిర్మిస్తే తమ జీవితాలు నాశనమైపోతాయని మూడేళ్లుగా ప్రజలు పోరాటం చేస్తుంటే ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఐదుగురు యువకులు బలైపోయారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవకుంటే, ప్రజలు క్షమించరని అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్‌ మాట్లాడుతూ తుందుర్రు ఆక్వా పార్క్‌ను జనావాసాలు లేని సముద్ర తీరానికి తరలించే ఏర్పాటు చేయాలని కోరారు. తాము పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకం కాదనే విషయాన్ని మొదటి నుంచీ చెబుతున్నామని, ప్రజల జీవితాలను నాశనం చేసే విధంగా పరిశ్రమలు పెట్టొదని మాత్రమే కోరుతున్నామన్నారు. ఆనంద పరిశ్రమలో లోప మే ఐదుగురి ప్రాణాలు తీసిందన్నారు. వైఎస్సార్‌ సీపీ పాలకొల్లు నియోజకవర్గ కన్వీ నర్‌ గుణ్ణం నాగబాబు, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పీడీ రాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బర్రి శంకరం, నాయకులు బొద్దాని శ్రీనివాస్, నూకపెయ్యి సుధీర్‌బాబు, గుడిదేశి శ్రీనివాస్, ఎం.జయప్రకాష్, పాలంకి ప్రసాద్, వైకేఎస్, మంచెం మైబాబు, సీపీఎం నేత జేఎన్‌వీ గోపాలన్, పోరాట కమిటీ నాయకులు పాల్గొన్నారు.  
 
 
 
 

 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)