amp pages | Sakshi

బ్రహ్మరథం

Published on Tue, 01/10/2017 - 22:11

ముగిసిన మొదటి విడత రైతు భరోసా యాత్ర
- హారతులు, బాణసంచాతో స్వాగతం
- ఊరూరా బారులు తీరి
  ఆప్యాయత పంచిన ప్రజలు
- వృద్ధులు, వికలాంగుల కష్టాలు
  పంచుకున్న జగన్‌
- పొలాల్లోకి వెళ్లి రైతులతో
   మాట కలిపిన జననేత
- గాజులపల్లె బహిరంగ
  సభకు పోటెత్తిన జనం
 
ఆత్మకూరు: పంటలు పండక.. చేసిన అప్పులు తీర్చే దారి లేక ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మొదటి విడత రైతు భరోసా యాత్ర మంగళవారంతో ముగిసింది. శ్రీశైలం నియోజకవర్గంలో ఆరు రోజుల పాటు పర్యటించిన ఆయన ప్రజలతో మమేకమయ్యారు. గ్రామ గ్రామాన అనూహ్య స్పందన లభించింది. కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఆదరించిన తీరు.. వృద్ధులు, వికలాంగులు, రైతులు, కూలీలకు జీవితంపై భరోసా కల్పించగా.. అక్కాచెల్లెమ్మలను ఆశీర్వదిస్తూ.. యువతకు దిశేనిర్దేశం చేశారు. చివరి రోజు పల్లెల్లో పెద్ద ఎత్తున బాణసంచా పేలుస్తూ స్వాగతం పలకడం ఆయనకున్న జనాదరణకు అద్దం పట్టింది. మొత్తం పర్యటనలో మండుటెండలో.. రాత్రి పొద్దుపోయాక కూడా ప్రజలు బారులు తీరి స్వాగతించడం విశేషం.
 
పంటల దుస్థితికి చలించిన ప్రతిపక్ష నేత
శ్రీశైలం నియోజకవర్గంలో పర్యటించిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఆయా మండలాల్లో పంటల దుస్థితిని చూసి చలించిపోయారు. శ్రీనగరం సమీపంలో పసుపు పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చెమ్మగిల్లిన కళ్లతో రైతులు మాట్లాడుతూ పంట సరిగా రాలేదని, తెగుళ్లతో పాటు గిట్టుబాటు ధర లేకపోవడంతో కనీసం కౌలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు. ఆ తర్వాత వరి, మిరప, పెసర పంటలను పరిశీలించి రైతుల స్థితిగతులపై ఆరా తీశారు. రైతుల బాధలు తెలుసుకున్న జగన్‌ వారిని ఓదారుస్తూ మన ప్రభుత్వంలో రైతుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భరోసానిచ్చారు.
 
30 కిలోమీటర్లు.. 6 గంటల రోడ్‌షో
మహానంది మండలంలో ఆరో రోజు చేపట్టిన భరోసాయాత్ర బుక్కాపురం నుంచి ప్రారంభమైంది. అడుగడుగునా ప్రజలు బారులు తీరి స్వాగతం పలుకుతుండటంతో మూడు గ్రామాల రోడ్‌షో 6 గంటల పాటు సాగింది. నడిచేందుకు వీలు కాని వృద్ధులు కూడా అతి కష్టం మీద కర్రల సహాయంతో ఎదురొచ్చి పలుకరించారు. వికలాంగులు కూడా ఆయనను కలిసి తమ కష్టాలను చెప్పుకున్నారు. గాజులపల్లె గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్‌ వద్ద జగన్‌ రోడ్‌షోను చూసి విద్యార్థులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. విద్యార్థులు భారతి, నాగమణి, ఆయిషాలను బాగా చదువుకోవాలని జగన్‌ కోరడంతో మంచి మార్కులతో పాసవుతామంటూ బాలికలు చెప్పారు. ఈ సందర్భంగా జననేతతో కరచాలనానికి విద్యార్థులు పోటీపడ్డారు.
 
గాజులపల్లెలో ఘన స్వాగతం..
మొదటి విడత భరోసా యాత్రలో భాగంగా చివరి రోజు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గాజులపల్లెలో యాత్ర ముగించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆయనకు ఘనస్వాగతం పలికారు. బస్సాపురం, గుండంపాడు, మాదాపురం, ఆంజనేయస్వామి కొట్టాల, పచ్చర్ల గ్రామాల్లోనూ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గత మాలలు వేస్తూ స్వాగతించారు. దారి పొడవునా యువత పెద్ద ఎత్తున బారులు తీరి ఈలలు, కేకలతో మద్దతు తెలిపారు.
 
మల్లన్న, మహానందీశ్వర స్వాముల దర్శనం
రైతు భరోసా యాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండవ రోజు శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఐదవ రోజు ఓంకారేశ్వరుడి సేవలో తరించగా.. చివరి రోజు మహానందిలో కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. మొత్తంగా నల్లమల అటవీ పరిధిలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఆయన ప్రత్యేక పూజలు చేపట్టారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ న్‌చార్జి బుడ్డా శేషారెడ్డి, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, ఎమ్మెల్యే ఐజయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, నియోజకవర్గ ఇన్‌చార్జీలు రాజగోపాల్‌ రెడ్డి, చెరుకులపాడు నారాయణ రెడ్డి, మురళీకృష్ణ, పార్టీ నేతలు కుందూరు శివారెడ్డి, ముంతల విజయభాస్కరరెడ్డి, మద్దయ్య, రాజా విష్ణవర్దన్‌రెడ్డి, కేవీ ప్రసాదరెడ్డి, రఘురెడ్డి, విశ్వనాథరెడ్డి, ద్వారం మాధవరెడ్డి, వెంకటేశ్వర యాదవ్, సత్యం యాదవ్, శరభారెడ్డి, లాయర్‌ వివేకానందరెడ్డి, మధుసూదన్‌, దేవ, మురళీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Videos

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)