amp pages | Sakshi

బడ్జెట్‌లో గీత కార్మికులకు అన్యాయం

Published on Sun, 03/19/2017 - 01:20

   భీమవరం : కల్లుగీత కార్మికులకు రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేశారని రాష్ట్ర కల్లు గీత కార్మిక సంఘం కార్యదర్శి జుత్తిగ నర్సింహమూర్తి తీవ్రంగా విమర్శించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడం కోసం విచ్చలవిడిగా మద్యం, బెల్టు దుకాణాలను ప్రోత్సహించడంతో గీత కార్మికులకు ఉపాధి కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్టుషాపులపై ఎక్సైజ్‌ అధికారులు, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఒకప్పుడు గీత కార్మికులు వచ్చిన ఆదాయంతో ఇళ్లు నిర్మించుకుంటే చంద్రబాబు పాలనలో ఉన్న ఇళ్లు అమ్ముకుని జీవించాల్సి వస్తోం దన్నారు. నిధులు కేటాయించకపోవడంతో కల్లుగీత కార్పొరేషన్‌ ఉత్సవ విగ్రహంగా మిగిలిందన్నారు. కల్లుగీత కార్పొరేషన్‌కు తక్షణం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో నిడదవోలులో ఉన్న ఏౖMðక తాటిబెల్లం పరిశ్రమకు నిధులు కేటాయించకపోవడంతో నిరుపయోగంగా మారిందన్నారు. తాటి పరిశ్రమకు తక్షణం రూ.100 కోట్లు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో గీత వృత్తిపై నాలుగు లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని వీరి ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.14 కోట్లు కిస్తీల రూపం ఆదాయం సమకూరుతుందని చెప్పారు. గీత కార్మి కుల సంక్షేమాన్ని పట్టించుకోకపోతే సెప్టెంబర్‌లో రాష్ట్రవ్యాప్త ఆం దోళనలకు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌ మంత్రి నివాసాలు, కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. సంఘం భీమవరం డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కడలి పాండు, చింతపల్లి చినవీరాస్వామి, ఉపాధ్యక్షుడు చెల్లబోయిన వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)