amp pages | Sakshi

పుష్కర భక్తులకు ఇబ్బంది రానివ్వకండి

Published on Fri, 07/29/2016 - 22:13

జంగారెడ్డిగూడెం :  అంత్యపుష్కరాల ఏర్పాట్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జాయింట్‌ కలెక్టర్‌(జేసీ) పి.కోటేశ్వరరావు ఆదేశించారు. పట్టిసీమ, గూటాల పుష్కర ఘాట్‌లలో అంత్య పుష్కరాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆయన సమీక్షించారు. పుష్కరాల ఏర్పాట్లు బాగుండాలని, చిన్న చిన్న పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
ప్రత్యేకంగా పారిశుధ్యంపై దృష్టిపెట్టాలన్నారు. రెండు ఘాట్‌లలోను 12 బోట్లు, 30 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచినట్టు జేసీ తెలిపారు. మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. అగ్నిమాపక వాహనం అందుబాటులో ఉంచి, ఒక స్పీడ్‌ బోటును కూడా సిద్ధం చేయాలని సూచించారు. గోదావరిలో ఒకవేళ నీటి మట్టం తగ్గినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రెండు ఘాట్‌లలోను పటిష్టమైన పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. భక్తులకు అవసరమైన ఆర్టీసీ బస్సులను నడపాలన్నారు. అవసరమైతే బస్సులను కూడా పెంచాలని సూచించారు. ఘాట్‌ల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి మద్యం దుకాణం లేకుండా ఎక్సైజ్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోదావరి నదిలో భక్తులు వేసే వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. గోదావరిలో బోట్లలో నిరంతరం పహరా నిర్వహించాలన్నారు. భక్తులు పూజలు నిర్వహించుకునేందుకు అవసరమైన పురోహితులను కూడా నియమించాలని సూచించారు. ఆర్డీవో ఎస్‌.లవన్న, డీఎస్పీ జె.వెంకటరావు, మద్ది ఈవో పి.వివ్వనాథరాజు, అసిస్టెంట్‌ ఎంవీఐ శ్రీనివాస్, పోలవరం తహసీల్దార్‌ ముక్కంటి, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)