amp pages | Sakshi

భయంతోనే చంద్రబాబు ఈ కోర్టుకొచ్చారు

Published on Thu, 11/10/2016 - 02:50

హైకోర్టులో పిటిషన్ వేసే హక్కు ఆయనకే లేదు
ఆర్కే తరఫు న్యాయవాది పొన్నవోలు వాదనలు
చంద్రబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని కోర్టుకు నివేదన
‘ఓటుకు కోట్లు’ కేసు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా  

సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో తనను ఎక్కడ నిందితునిగా చేరుస్తారోననే ఊహాజనితమైన భయంతోనే ఏపీ సీఎం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి దర్యా ప్తుపై స్టే ఉత్తర్వులు పొందారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్న వోలు సుధాకర్‌రెడ్డి న్యాయస్థానానికి నివేదిం చారు. ఊహాజనితంగా  ఏదో జరగబోతుందని ఊహించి వచ్చేవారిని కాపా డేందుకు ఈ కోర్టు లేదన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబు పాత్రకు సంబం దించి ఏసీబీ నుంచి ప్రత్యేక కోర్టు నివేదిక కోరిందని, ఈ దశలో ఆయనకు హైకోర్టును ఆశ్రరుుంచే అధికారం(లోకోస్టాండీ) లేదని స్పష్టం చేశారు.

ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు తమకు లోకోస్టాండీ లేదని చంద్రబాబు తరఫు న్యాయవాది చేసిన వాదన సరికాదని, ఊహాజనితంగా హైకోర్టు ను ఆశ్రయించేందుకు చంద్రబాబుకే లోకో స్టాండీ లేదని పొన్నవోలు తెలిపారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబును నిందితునిగా చేరుస్తూ మరో ఎఫ్‌ఐఆర్ జారీచేస్తే అప్పుడా యన ఈ కోర్టును ఆశ్రయించవచ్చన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబు పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నా ఆ దిశగా ఏసీబీ దర్యాప్తు చేయట్లేదంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మె ల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించగా...ఆ దిశగా దర్యాప్తు చేయాలని ఆ కోర్టు ఆదేశించింది.

ఈ ఆదేశాల్ని సవాల్ చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించగా.. దర్యాప్తును నిలిపివేస్తూ కోర్టు మధ్యం తర ఉత్తర్వులు(స్టే) జారీచేసింది. వీటిని సవాల్ చేస్తూ రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా...ఈ వ్యవహారంపై 4వారాల్లో విచారణను పూర్తిచేయాలని హైకోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ సునీల్‌చౌద రి బుధవారం మరోసారి విచారణ జరిపారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలి..
‘‘ఓటుకు కోట్లు ఇచ్చి కొనేందుకు ప్రయత్నించడం అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని పీవీ నరసింహారావు కేసులో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఎంపీల కొనుగోలుకు ప్రయత్నించినందుకు పీవీసహా ఇతరులకు ప్రత్యేక కోర్టు జైలుశిక్ష కూడా విధించింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 12 ప్రకారం అవినీతిని ప్రోత్సహించిన వారిని నిందితునిగా చేరుస్తారు. తీసుకున్న వారిని వదిలేస్తారు. ఇక్కడా చంద్రబాబుపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలి’’ అని పొన్నవోలు కోర్టుకు నివేదించారు. దర్యాప్తు చేస్తున్న కేసుల్లోనూ ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేయవచ్చన్నారు. ఓటుకు కోట్లు కేసులో అన్ని ఆధారాలున్నా ఏడాదిన్నర గడిచినా చంద్రబా బును నిందితునిగా చేర్చకపోవడం తోనే తాము ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశామని తెలిపారు.

నేర విచారణ చట్టంలోని సెక్షన్లు 156(3), 210 కింద దర్యాప్తు సంస్థ నుంచి నివేదిక కోరే అధికారం ప్రత్యేక కోర్టుకుంద న్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకకోర్టు 156(3) సెక్షన్ కింద ఏసీబీ నుంచి నివేదిక కోరిందన్నారు. అయితే సెక్షన్ 210 కింద ఆదేశాలివ్వాలని మీరు కోరినా న్యాయమూర్తి అనాలోచితంగా 156(3) కింద ఆదేశాలిచ్చా రని, దీన్నెలా సమర్థించుకుంటారని న్యాయ మూర్తి ప్రశ్నించారు. అయితే సెక్షన్‌ను తప్పుగా కోట్‌చేస్తూ ఆదేశాలిచ్చినంత మాత్రా న అవి చెల్లకుండా పోవని పొన్నవోలు తెలిపారు. అవసరమనుకుంటే హైకోర్టు తమ పిటిషన్‌ను కింద కోర్టుకు తిప్పిపంపి సరైన సెక్షన్ కింద ఉత్తర్వులివ్వాలని ఆదేశించవచ్చ న్నారు. ఈ మేరకు రోజా కేసులో జస్టిస్ దిలీప్ బొసాలేతోపాటు పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని ప్రస్తావించా రు.

అవినీతి కేసుల్లో దర్యాప్తును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వరాదం టూ సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను కోర్టు ముందుంచారు. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు ఏసీబీ తరఫు న్యాయవాది రవికిరణ్ గడువుకోరడంతో విచారణను సోమవారానికి వాయిదా వేశారు. కాగా, ఈ కేసులో తనను ఇంప్లీడ్ చేసి తన వాదనలూ వినాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వేసిన పిటిషన్‌ను ప్రధాన పిటిషన్‌కు జతచేస్తానని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ పిటిషన్ విచారణార్హతపై మంగళవారం వాదనలు వినిపించాలని ఉండవల్లికి సూచించారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)