amp pages | Sakshi

ట్రాక్టర్లతో సరిపెట్టేశారు!

Published on Sat, 07/01/2017 - 23:24

  •  13 నియోజకవర్గాలకు 40 చొప్పున మంజూరు
  • ఎస్‌డీపీ కింద రూ.12.85 కోట్లు కేటాయింపు
  • ఇతర పరికరాలకు రూ.7.36 కోట్లు
  • అనంతపురం అగ్రికల్చర్‌ :  రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు యాంత్రికీకరణ పథకానికి అనుమతులు మంజూరు చేసింది. అయితే ట్రాక్టర్లు, కొన్ని రకాల యంత్ర పరికరాలకు మాత్రమే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కానీ వాటి ధరలు, రాయితీలు, విధి విధానాలు విడుదల చేయకపోవడంతో అమలు చేయడానికి వ్యవసాయశాఖ సిద్ధం కాలేని పరిస్థితి నెలకొంది. 2017–18 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే ఏప్రిల్, మే నెలల్లో యాంత్రికీకరణ పథకానికి అనుమతి ఇచ్చిఉంటే ఉపయోగరకంగా ఉండేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

    ఎస్‌డీపీ కింద రూ.20.21 కోట్లు బడ్జెట్‌ కేటాయింపు :  ప్రస్తుతం స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (ఎస్‌డీపీ) కింద 520 ట్రాక్టర్లకు రూ.12.85 కోట్లు, ఇతర పథకం కింద మరికొన్ని యంత్ర పరికరాలకు రూ.7.36 కోట్లు మంజూరు చేసినట్లు జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ట్రాక్టర్ల విషయానికొస్తే జిల్లాకు 520 మంజూరు కాగా అందులో అనంతపురం అర్బన్‌ నియోజకవర్గానికి ఒక్క ట్రాక్టర్‌ కూడా కేటాయించలేదు. మిగతా 13 నియోజక వర్గాలకు 40 చొప్పున కేటాయించారు. అధికారికంగా ఇన్‌చార్జ్‌ మంత్రి అనుమతులు తప్పనిసరి చేయడంతో అధికార పార్టీకి చెందిన నేతలు తమ అనుచరులకు ఇచ్చుకునే పరిస్థితి నెలకొనడంతో సామాన్య రైతులకు ట్రాక్టర్లు దక్కే పరిస్థితి లేదని తెలుస్తోంది.  ఇకపోతే జిల్లా వ్యవసాయశాఖ రూ.40.93 కోట్లు బడ్జెట్‌తో 14,739 యూనిట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, కమిషనరేట్‌కు ప్రతిపాదనలు పంపింది. రూ.20.21 కోట్ల బడ్జెట్‌తో ట్రాక్టర్లు, కొన్ని యంత్రపరికరాలకు అనుమతివ్వడం గమనార్హం.

     

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌