amp pages | Sakshi

అధికారులకు మోదం.. భక్తులకు ఖేదం!

Published on Fri, 09/09/2016 - 23:58

సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపైన భక్తులు ఏ క్యూలైన్లో వచ్చినప్పటికీ అమ్మవారి ములవిగ్రహాన్ని దర్శనం చేసుకునే సమయంలో అర్చకులు శఠగోపం పెట్టి కుంకుమ ప్యాకెట్లు ఇచ్చేవారు. దీంతో భక్తులు ఎంతో సంతృప్తి చెందేవారు. చివరకు ఉచిత దర్శనం లైన్లో కూడా ఇదే పద్ధతి ఉండేది. అయితే ఇప్పుడు తిరుపతి తరహాలో అంటూ.. శఠగోపం పెట్టే విధానాన్ని పూర్తిగా మార్చివేశారు. రూ.300 టికెట్‌ కొనుక్కుని వచ్చే భక్తులు, వీవీఐపీలకు మాత్రమే అమ్మవారి సన్నిధిలో శఠగోపం (పాదుకలు) అర్చకులు పెట్టేందుకు ఈవో సూర్యకుమారి అనుమతిచ్చారు. రూ.20 టికెట్‌ కొనుగోలు చేసి ముఖమండపం ద్వారా వచ్చే భక్తులకు అమ్మవారి సన్నిధిలో శఠారీ లభించదు. వస్త్రంతో తయారు చేసిన హుండీలు పెట్టిన చోటకు వచ్చిన తరువాత అక్కడ పాదుకలతో ఆశీర్వాదం లభిస్తుంది. ఇక సాధారణ భక్తుల పరిస్థితి మరీ దారుణం. దర్శనం చేసుకుని రావి చెట్టు వద్దకు వచ్చిన తరువాత అక్కడ అర్చకుడు ఎక్కడ ఉన్నాడో గుర్తించి శఠగోపం పెట్టించుకోవాల్సి ఉంది. అర్చకులు ఉండేందుకు కనీసం స్పష్టమైన ప్రదేశం కూడా లేదు. దీంతో భక్తులు  నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని పలువురు భక్తులు ఈవో దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోని విషయం స్పష్టమవుతోంది.  
సంప్రదాయాలకు తిలోదకాలు.. 
ఏదైనా దేవాలయానికి వెళ్లినప్పుడు అక్కడ శఠారీని పళ్లెంపై పెట్టి ఉంచడం చూస్తుంటాం. ఇక్కడ ఈ పద్ధతులకు దేవస్థానం అధికారులు తిలోదకాలు ఇచ్చారు. అర్చకులు దక్షణ వసూలు చేస్తున్నారంటూ బల్ల, శఠారీ, పళ్లాన్ని ఈవో తీయించి వేశారు. వాస్తవంగా గతంలో ఈవోలు ఇదే తరహాలో తీయించేందుకు ప్రయత్నించగా, శఠారీ కింద ప్లేటు తీయించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు వేదపండితులు చెబుతున్నారు. చట్టాలు, సంప్రదాయాలకు దేవస్థానంలో తిలోదకాలు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 
 
 
  
 

Videos

ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్

అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Photos

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)