amp pages | Sakshi

రైతు ఆత్మహత్యల నివారణకు కృషి

Published on Mon, 12/05/2016 - 22:43

–మెగా రక్త, నేత్రదాన శిబిరంలో కలెక్టర్‌
కర్నూలు(అగ్రికల్చర్‌): రైతు ఆత్మహత్యల నివారణకు వ్యవసాయ శాఖ కృషి చేయాల్సి ఉందని కలెక్టర్‌ విజయమోహన్‌ తెలిపారు. రాష్ట్ర వ్యవసాయాధికారుల సంఘం ఆధ్వర్యంతో సోమవారం కలెక్టరేట్‌ ప్రాంగణంలో మెగా రక్త, నేత్ర దాన శిబిరాన్ని వ్యవసాయశాఖ డైరెక్టర్‌  ధనంజయరెడ్డితో కలసి కలెక్టర్‌ ప్రారంభించారు. మండల వ్యవసాయాధికారులు, ఏడీఏలు, ఏఇఓ, ఏంపీఇఓలు, వ్యవసాయశాఖ సిబ్బంది 150 మంది.. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీకీ రక్తదానం చేశారు. వ్యవసాయశాఖ డైరెక్టర్‌ ధనుంజయరెడ్డి, అదనపు డైరెక్టర్‌ సుశీల, వ్యవసాయాధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కమలాకరశర్మ, ప్రవీణ్‌ కర్నూలు జిల్లా వ్యవసాయాధికారుల సంఘం ప్రతినిధులు, వివిధ జిల్లాల నాయకులు దాదాపు 500 మంది మరణానంతరం కళ్లు దానం చేస్తామని అంగీకార పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ మాట్లాడుతూ...వ్యవసాయాధికారుల్లోను మానవత్వం ఉందని రక్త, నేత్రదాన కార్యక్రమం ద్వారా నిరూపించుకున్నారన్నారు. అదే రీతిలో రైతుల అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు. వ్యవసాయశాఖ డైరెక్టర్‌ ధనంజయరెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయశాఖలో విస్తరణ కార్యక్రమాలు లేవనే విమర్శ ఉందని ఈ లోపాన్ని సవరించుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ...వ్యవసాయాధికారులు రాష్ట్ర వ్యాప్తంగా రక్త, నేత్ర దానానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు.జేడీఏ ఉమామహేశ్వరమ్మ, జిల్లా వ్యవసాయాధికారుల సంఘం అ«ధ్యక్ష, కార్యదర్శులు సుబ్బారెడ్డి, రవిప్రకాష్, జిల్లా నాయకులు అక్బరుబాష, అశోక్‌కుమార్‌రెడ్డి, సురేష్‌బాబు, విశ్వనాథ్, తేజస్వరీ, ఏడీఏలు రమణారెడ్డి, సాలురెడ్డి, వీరారెడ్డి, సుధాకర్, చెంగల్రాయుడు, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు  తదితరులు పాల్గొన్నారు.
 

Videos

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు

దొంగలు దొరికారు

రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్

హిందూపురానికి బాలకృష్ణ చేసిందేమీ లేదు.. అందుకే ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు

జగనన్న సంక్షేమమే నన్ను గెలిపిస్తుంది..175/175 పక్కా

సీఎం రమేష్ ను కలవడంపై కొమ్మినేని విశ్లేషణ

అప్పుడు కరెక్ట్.. ఇప్పుడు రాంగ్ ఎలా..బయటపడ్డ టీడీపీ కుట్ర

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌