amp pages | Sakshi

ఫసల్‌బీమా వర్తింపజేయాలి

Published on Thu, 06/09/2016 - 03:15

వేరుశనగ రైతులను ఆదుకోవాలి
రైతుసంఘం నాయకుల డిమాండ్
సీపీఐ ఆధ్వర్యంలో కేంద్రం దిష్టిబొమ్మ దహనం

 
అనంతపురం అగ్రికల్చర్/ అర్బన్ : ఫసల్ బీమా యోజనను వేరుశనగ పంటకు వర్తింపజేయకపోవడంపై వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ అనుబంధ రైతుసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా వేరుశనగ సాగు చేసే జిల్లా అనంతపురమని, ఇక్కడ తరచూ కరువు పరిస్థితుల వల్ల రైతులు పంట నష్టపోతూనే ఉన్నారని పేర్కొన్నాయి. ప్రస్తుతమున్న వాతావరణ ఆధారిత పంటల బీమా వల్ల రైతులకు ఎటువంటి ఉపయోగమూ లేకుండా ఉందని తెలిపాయి.

ఈ పరిస్థితుల్లో అంతోఇంతో ప్రయోజనం ఒనగూరే ఫసల్‌బీమాను వేరుశనగ పంటకు వర్తింపజేయాల్సిందేనని ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. జిల్లాలో భారీస్థాయిలో పరిహారం అందించాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే వేరుశనగ పంటను బీమా జాబితా నుంచి తప్పించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకులేడు రామచంద్రారెడ్డి విమర్శించారు. ఫసల్‌బీమా వర్తింపజేయకపోతే జిల్లా రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. అంతేకాకుండా  వాతావరణ బీమా పథకాన్నే కొనసాగిస్తూ ప్రీమియం మొత్తాన్ని రూ.530 నుంచి రూ.750కు పెంచేశారని, ఇది రైతులపై మరింత భారం మోపడమేనని ధ్వజమెత్తారు.


కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
ఫసల్‌బీమా యోజనలో వేరుశనగ పంటను చేర్చకపోవడాన్ని నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని టవర్‌క్లాక్ వద్ద కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పథకంలో వేరుశనగని చేర్చేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ డిమాండ్ చేశారు. జిల్లాలో ఏ పంట ప్రధానంగా పండిస్తున్నారో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకోకుండా వేరుశనగ  పంటని బీమా నుంచి మినహాయించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో సహాయ కార్యదర్శి పి.నారాయణస్వామి, నగర కార్యదర్శి లింగమయ్య తదితరులు పాల్గొన్నారు.


 ఫసల్‌తో భరోసా కల్పించాలి
వరుస కరువులతో కుదేలవుతున్న వేరుశనగ రైతులకు ఫసల్ బీమా యోజన వర్తింపజేసి భరోసా కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. జిల్లాలో అత్యధికంగా పండించే వేరుశనగని ఫసల్ బీమాలో చేర్చకుండా పత్తిపంటను చేర్చడం వెనుక ఉద్దేశం ఏమిటో స్పష్టమవుతోందన్నారు. దీనిపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్పందించాలన్నారు.
 
 ఫసల్ బీమాలో వేరుశనగను చేర్చాలి
ఫసల్ బీమా యోజనలో వేరుశనగ పంటని చేర్చాలని సీపీఎం అనుబంధ ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. బుధవారం స్థానిక గణేనాయక్ భవన్‌లో సంఘం నాయకులతో కలిసి జిల్లా కార్యదర్శి పి.పెద్దిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. వేరుశనగని ఫసల్ బీమా యోజనలో చేర్చితే రైతుకు న్యాయం జరుగుతుందన్నారు. పథకంలో వేరుశనగ పంట చేర్చే విషయంపై జిల్లా మంత్రులు స్పందించాలన్నారు. సమావేశంలో సహాయ కార్యద ర్శులు జంగాలపల్లి పెద్దన్న, చంద్రశేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు తలారి రామాంజినేయులు, నాగేశ్, కదిరప్ప, తదితరులు పాల్గొన్నారు.

Videos

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)