amp pages | Sakshi

ఈ ట్రేడింగ్

Published on Sat, 02/27/2016 - 01:50

జాతీయ విపణిలో మన ఆహార ఉత్పత్తులు
ఈ-బిడ్డింగ్‌తో విక్రయించుకునే వెసులుబాటు

ప్రయోగాత్మకంగా మూడు మార్కెట్లలో అమలు

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నిన్నటి వరకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు.. ఐదు అంకెల జీతం తీసుకునే వాళ్లు మాత్రమే ఆన్‌లైన్ ట్రేడింగ్ చేసేవాళ్లు. దేశ ఆర్థిక రాజధాని ముంబైతోపాటు పలు నగరాల్లోని షేర్‌మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తూ సంబరపడిపోయేవారు. అలాంటి వ్యాపారమే అన్నదాతలకు అందుబాటులోకి రానుంది. తాండూరు కందుల రైతులతోపాటు వివిధ ఆహార ఉత్పత్తుల రైతులకు ఈ అరుదైన అవకాశం చిక్కనుంది. జిల్లాలోని తాండూరు, వికారాబాద్, శంకర్‌పల్లి మార్కెట్లలో ఆన్‌లైన్ బిడ్డింగ్ కోసం అన్ని హంగులు కల్పించేందుకు జిల్లా మార్కెటింగ్ అధికారులు కసర త్తు సాగిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులను జాతీయ విపణిలో అమ్ముకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నారు. రైతులేమిటి? ఆన్‌లైన్ ట్రేడింగ్ ఏమిటి  అనుకుంటున్నారా? అది ఎలాగో మీరే చదవండి.

బషీరాబాద్‌కు చెందిన వెంకటరె డ్డి 30 బస్తాల కందులు పండించారు. సమీపంలోని తాండూరు మార్కెట్‌లోకి ఆయన లారీ ప్రవేశించగానే కంప్యూటర్‌లో పంట ఉత్పత్తుల వివరాలు, రైతు సమాచారాన్ని నమోదు చేస్తారు. అక్కడే ఏర్పాటుచేసే అధునాతన ల్యాబ్‌లో కంది నాణ్యతను పరిశీలించి గ్రేడింగ్ నిర్ణయిస్తారు. తద్వారా ధరను ప్రకటిస్తారు. ఈ వివరాలను ఈ- బిడ్డింగ్‌లో ఎంట్రీ చేస్తారు. దీంతో దీనికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ (నామ్)తో అనుసంధానం చేయడం ద్వారా ఏకకాలంలో 500 మార్కెట్ కమిటీలో ఈ- ట్రేడింగ్ జరిపేందుకు వీలు కలుగుతుంది.

ఉత్పత్తి, నాణ్యత నచ్చిన వ్యాపారులు ఆ పంటను ఈ -బిడ్డింగ్‌లో కోట్ చేస్తారు. ఆ తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే నిర్దేశిత మొత్తం రైతు ఖాతాలో జమకానుంది. అదే సమయంలో ప్రస్తుతం క మీషన్ ఏజెంటు కేవలం నిర్దేశిత మార్కెట్‌లోనే క్రయవిక్రయాలు జరుపుకునేందుకు అనుమతి ఉంది. కొత్త విధానం అమలు చేయడం ద్వారా ఈ ఏజెంటు దేశవ్యాప్తంగా 500 మార్కెట్‌లలోని ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేసుకునే అవకాశం కలుగనుంది.

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?