amp pages | Sakshi

స్వచ్ఛ ఆసుపత్రి దిశగా... జీజీహెచ్‌

Published on Thu, 06/15/2017 - 00:07

  • పరిసరాల పరిశుభ్రత కోసం డస్ట్‌ బిన్నులు, ఉమ్మి తొట్టెల ఏర్పాటు
  • కాకినాడ వైద్యం:
    పరిసరాల పరిశుభ్రత ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమన్న జాతిపిత మహ్మత్మాగాంధీ ఆశయ సాధన కోసం జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఆసుపత్రికి వచ్చే రోగులు, సహాయకులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆసుపత్రి ఆవరణలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా చర్యలు తీసుకున్నారు. 
    .
    పరిసరాల పరిశుభ్రత కోసం చర్యలు
    కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందేందుకు జిల్లా నలుమూలల నుంచే కాక ఉభయ గోదావరి జిల్లాల నుంచి తరలి వస్తూంటారు. నిత్యం ఇక్కడ వైద్యసేవల కోసం సుమారు 3 వేలు దాకా రోగులు వస్తూంటారు. ఆసుపత్రిలో అధికారికంగా ఉన్న 1065 బెడ్లకు 1,800 మంది ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఉపయోగించే మందులు, మాస్క్‌లు, గ్లౌజులు, క్లాత్, ఐవీలు,టాబ్లెట్ల స్టిప్పులు, ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్న రోగులు వాడి పారేసిన చెత్త, వ్యర్థాలు కలిపి రోజుకి సుమారు 3 టన్నుల వరకూ చేరుతున్నట్టు శానిటేషన్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. వీటి నిల్వ కోసం ఆసుపత్రి డంపింగ్‌ యార్డు ఆవరణలో కాకినాడ నగరపాలక సంస్థ రెండు డంపర్లను ఏర్పాటు చేసింది. ఆసుపత్రి పరిసరాల్లో రోజురోజుకీ పెరిగిపోతుండడంతో రోగులు మరింత అనారోగ్యాలకు గురవుతారనే ఉద్దేశంతో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావు పలు ప్రధానమైన వార్డుల బయట డస్ట్‌ బిన్నులు, ఉమ్మి తొట్టెలను ఏర్పాటు చేయించారు. రోగులతోపాట వస్తున్న రోగుల సహాయకులు చెత్త బుట్టల్లోనే వ్యర్థాలు వేయాలని, ఎక్కడపడితే అక్కడ ఉమ్మి ఉమ్మరాదని, అలా చేయడం వల్ల గాలి ద్వారా వైరస్‌ సోకి మరింత మంది అనారోగ్యాలకు గురవుతారని అవగాహన కల్పిస్తున్నారు. 
    .
    పరిసరాల పరిశుభ్రతకు దోహదం 
    ఆసుపత్రి ప్రాంగణంలో అధికారులు ఏర్పాటు చేసిన తొట్టెలు పరిసరాల పరిశుభ్రంగా ఉంచేందుకు దోహదపడుతుంది. ఆసుపత్రికొచ్చే రోగులు, సహాయకులు చెత్తా, వ్యర్థాలను బయట వేయకూడదు. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ సామాజిక బాధ్యతతో సహకరించాలి. - పలివెల వీరబాబు, సీపీఎం నగర కార్యదర్శి,కాకినాడ 
    .
    అందుబాటులో ఏర్పాటు చేశారు
    చెత్తా, వ్యర్థాలు వేసేందుకు అందుబాటులో డస్ట్‌ బిన్నులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఉమ్మితొట్టెల ఏర్పాటు చేయడం మంచి పరిణామం. - జి.దుర్గాప్రసాద్ ,ప్రతాప్‌నగర్‌
    .
    స్వచ్ఛాసుపత్రిగా తీర్చిదిద్దేందుకు చర్యలు
    కాకినాడ ప్రభుత్వాసుపత్రిని కలెక్టర్‌ సహకారంతో స్వచ్ఛాసుపత్రిగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నా. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు, అపరిశుభ్రత వల్ల కలిగే నష్టాలపై రోగులు, సహాయకులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నా.
    - డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావు, సూపరింటెండెంట్‌
    .
     
     
     

#

Tags

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)