amp pages | Sakshi

రూ.వెయ్యికి వీడ్కోలు

Published on Fri, 11/25/2016 - 02:50

► చెలామణికి ముగిసిన గడువు
►బ్యాంకుల్లో నోట్ల మార్పిడికీ స్వస్తి
► డిపాజిట్ చేయూల్సిందే..
►రూ.500 చెలామణికి పరిమితులు
► బ్యాంకులు, పోస్టాఫీసుల్లో  రూ.కోట్లలో డిపాజిట్లు

 
ఆదిలాబాద్ అర్బన్ : రూ.1000 నోట్లకు కాలం చెల్లింది. గురువారం నాటితో ఆ కరెన్సీ చెలామణి గడువు ముగిసింది. రూ.500 నోట్లు పరిమితులతో కూడిన చెలామణికి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గురువారం వరకు ప్రభుత్వ రంగ సంస్థలు, కరెంటు బిల్లు, పన్నులు, పెట్రోల్ బంకులు, ప్రభుత్వ ఆస్పత్రులు, రైల్వే, బస్ టికెట్ల బుకింగ్ కోసం రూ.500, రూ.1000 నోట్ల చెలామణికి అవకాశం కల్పించారు. ఇక ఆ గడువు ముగిసిపోవడంతో గురువారం ముగియడంతో కేంద్ర ప్రభుత్వం రూ.500 నోట్ల చెలామణిని డిసెంబర్ 15వరకు పొడిగించింది.

 ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు, కరెంటు, నీటి బిల్లులు, రూ.500 లోపు మొబైల్ రీచార్జీకి చెల్లుబాటు అవుతుంది. డిసెంబర్ 2వ తేదీ వరకు టోల్‌ట్యాక్స్‌కు మినహాయింపు ఇచ్చారు. డిసెంబర్ 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రూ.500 నోట్లు టోల్‌ప్లాజాల్లో చెల్లుబాటు అవుతాయి. ఒక్కసారి రూ.5వేల విలువైన వస్తువులను వినియోగదారులు  సహకార స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు. బ్యాంకుల్లో నోట్ల మార్పిడికీ అవకాశం లేదని ఆర్బీఐ ప్రకటించింది. ఇక రూ.వెరుు్య నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేయూల్సిందే. డిసెంబర్ 30 వరకు బ్యాంకుల్లో డిపాజిట్‌కు ఆయూ నోట్లను స్వీకరిస్తారు. పెద్ద నోట్ల రద్దుతో పన్నులు, మొండి బకాయిల వసూలుకు గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలు, విద్యుత్ సంస్థల పంట పండింది. భారీ మొత్తంలో పన్నులు, బకారుులు వసూలయ్యూరుు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రూ.కోట్లలో డిపాజిట్లు వచ్చి చేరాయి.  

మున్సిపాలిటీలు, పంచాయతీలకు నిధుల వరద
మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ పరిధిలో వివిధ రకాల పన్నుల వసూలకు పెద్ద నోట్ల రద్దు వ్యవహారం కలిసొచ్చింది. ఏళ్లు గడిచినా వసూలు కాని చెల్లింపులు కేవలం 15 రోజుల్లో రూ.2.80 కోట్లు వసూలైనట్లు అధికారులు తెలిపారు. రద్దు తర్వాత 30 శాతం మేర పన్ను వసూలైంది. పంచాయతీల్లో పన్ను వసూళ్లు రూ.3.50 కోట్లు ఉండగా, నోట్ల రద్దుకు ముందు రూ.60 లక్షలు వసూలు చేయగా, జిల్లా వ్యాప్తంగా రద్దు నుంచి ఇప్పటి వరకు రూ.35 లక్షలు వసూలు అయ్యాయి. నోట్ల రద్దు వ్యవహారంతో ప్రజలు పన్ను చెల్లించేందుకు ముందుకు రావడంతో అధికారులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దీంతో పంచాయతీలకు నిధుల వరద పారింది.

పెట్రోల్ బంకులకు కాసుల గలగల
పెట్రోల్ బంకుల్లో పాతనోట్ల చెల్లుబాటుతో ఈ నెల 9 నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.11 కోట్ల విలువైన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జరిగినట్లు అంచనా. ఆదిలాబాద్ పరిధిలో మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన పెట్రోల్ బంక్‌లు ఉన్నాయి. ప్రతి రోజు సుమారుగా 5 నుంచి 6 లక్షల లీటర్ల పెట్రోల్, 4 నుంచి 5 లక్షల లీటర్ల డిజిల్ అమ్మకాలు సాగుతుంటాయి. పెద్ద నోట్ల రద్దుతో వాహనదారులు ట్యాంకులు నింపుకోవడంతో ఒకేసారి 30 శాతం మేర అమ్మకాలు పెరిగాయి.  

వీటిపై ప్రభావం..
పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో జనజీవనం అతలాకుతలమైంది. చిల్లర దొరకకా, ఉన్న నోట్లు బ్యాంకుల్లో మార్చుకునేందుకు అప్పగించడంతో చిల్లిగవ్వ లేక వ్యాపారాలు స్తంభించిపోయాయి. గత నెల వరకు కాసులు కురిపించిన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, కార్యాలయాలు ప్రస్తుతం నోట్ల రద్దు ప్రభావంతో కోలుకోలేని స్థితిలో ఉన్నాయి. నోట్ల రద్దు ప్రభావంతో ప్రజలు, రైతులు, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడగా, నిర్మాణ, వ్యాపారం, ఆబ్కారీ, రియల్ ఎస్టేట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. ఇరవై రోజులు గడుస్తున్నా బ్యాంకుల వద్ద నోట్లు మార్చుకునేందుకు, ఏటీఎంల వద్ద డబ్బులు తీసుకునేందుకు క్యూ కట్టక తప్పడం లేదు.
 
చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం
పెద్ద నోట్ల రద్దు వ్యవహారంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బ్యాంకులకు వెళ్తే ఒక రోజు మొత్తం కేటాయించేయాలి. ప్రస్తుతం ఆ ప్రభావం కొద్దిగా తగ్గింది. సరిపడా నోట్లు అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వం రద్దు వ్యవహారానికి ముందు సరిపడా నోట్లు అందుబాటులో ఉంచి రద్దు చేసినట్లైతే ఇంత ఇబ్బందులు ఎదురయ్యేవి కావు. ఎక్కువ డబ్బులు అవసరమున్నా రద్దు ప్రభావంతో బ్యాంకు అధికారులు ఇస్తలేరు. చేతిలో డబ్బులు లేక ఏమి చేయాలన్న తోచడం లేదు.  - షేక్ ఖలీమ్, ఓ బ్యాంక్ ఖాతాదారు, ఆదిలాబాద్
 
ప్రభుత్వం గడువు పెంచాలి

 ప్రజలకు ఇంకా చిల్లర కష్టాలు తీరలేదు. చిల్లర కష్టాలు తీరిన తర్వాత పెద్ద నోట్లను తీసుకోకున్నా ఫర్వాలేదు. చిల్లర దొరకకముందే పెద్ద నోట్లను వాడుకలోంచి తీసేయడం సరికాదు. ఇంకా చాలామంది దగ్గర పాత నోట్లు కన్పిస్తున్నాయి. వీటిని సమర్పించేందుకు ప్రభుత్వం పెద్ద నోట్లు చెలామణికి గడువును పొడిగించాలి. కొత్తగా రూ.500, రూ.100 నోట్లు సరిపడా అందుబాటులోకి వచ్చాక పెద్ద నోట్ల చెలామణికి చెక్ పెట్టిన సరిపోతది.  - కె.విక్కీ, పొన్నారి, తాంసి

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)