amp pages | Sakshi

స్వచ్ఛ విశాఖే లక్ష్యం

Published on Thu, 08/11/2016 - 16:47

సాక్షి, విశాఖపట్నం: స్వచ్ఛభారత్‌ మిషన్‌లో గతేడాది దేశంలోనే 5వ ర్యాంకు సాధించిన విశాఖ నగరాన్ని ఆ ర్యాంకింగ్‌లో ఈ ఏడాది మరింత ముందుకు తీసుకువెళ్లానేది ప్రధాన లక్ష్యమని జీవీఎంసీ కమిషనర్‌ హరినారాయణ్‌ అన్నారు. ఐటీడీఎ పీఓగా పనిచేసి పదిహేను రోజుల క్రితం జీవీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన హరినారాయణ్‌ గురువారం విశాఖ జర్నలిస్ట్‌ ఫోరం నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
జీవీఎంసీ కోర్‌ సర్వీసులను నగరంలోని ప్రతి ఒక్కరికీ అందించడానికి శాయశక్తుల కషి చేస్తామని చెప్పారు. దేశంలోనే ఎల్‌ఈడీ లైట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన తొలి కార్పొరేషన్‌గా జీవీఎంసీ ఖ్యాతి గడించిందని, రెండో దశలో ఎల్‌ఈడీలకు స్మార్ట్‌ కనెక్షన్‌ ఇచ్చి ఏ బల్బు ఎక్కడ వెలుగుతుందో లేదో తెలుసుకునే సౌకర్యం తీసుకువస్తామని తెలిపారు. విద్యుత్‌ ఆదాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  వెలగని వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తామరు. శివారు, మారుమూల ప్రాంతాలకు విద్యుత్, తాగునీరు అందిచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.  ఐఏఎస్‌ పరీక్షలకు శిక్షణ, పాఠశాల్లో ఈ–ల్యాబ్‌ల ద్వారా విద్యాప్రమాణాలు పెంచుతున్నామన్నారు. స్మార్ట్‌ సిటీ కాన్సెప్ట్‌లో ఉండే పాన్‌సిటీ (సేవలు), డెవలప్‌మెంట్‌(ప్రాంతాల వారీ అభివద్ధి) అనే రెండు భాగాలను అమలు చేస్తున్నట్లు తెలిపారుు. వ్యక్తిగత మరుగుదొడ్లు ఇంకా కొందరికి లేవని, వారిని కూడా ప్రోత్సహించి నిర్మించుకునేలా చేస్తామన్నారు. సెప్టెంబర్‌లో జరిగే బ్రిక్స్‌ సదస్సు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే సీఐఐ సదస్సుల వల్ల అంతర్జాతీయంగా విశాఖ ఖ్యాతిని విస్తరించే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. జీవీఎంసీలో చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టు భర్తీ కోసం చీఫ్‌ సెక్రటరిని కోరామని త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. కబేలా వల్ల ఎవరికి ఎలాంటి అభ్యంతరాలున్నా తమ వద్దకు వచ్చి తెలియజేయవచ్చన్నారు. నగరంలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, భద్రత ప్రమాణాల పెంపు అవసరమని వాటిపైనా చర్యలు తీసుకుంటాని తెలిపారు. ఆక్రమణలు తొలగిస్తామన్నారు. అంతకుముందుగా ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి ఎస్‌ దుర్గారావుల ఆధ్వర్యంలో ప్రెస్‌ క్లబ్‌ సభ్యులు కమిషనర్‌ను సన్మానించారు. 
 

 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)