amp pages | Sakshi

‘సాక్షి’ఎరీనావన్‌కు విశేష స్పందన

Published on Sun, 02/19/2017 - 21:44

 – ప్రశాంతంగా ముగిసిన మొదటి రౌండు పరీక్షలు
– చెస్, పెయింటింగ్, సింగింగ్‌తో సహా ఆరు విభాగాల్లో పోటీలు
– అద్భుతాలు ఆవిష్కరించిన చిన్నారులు
– రెండు, మూడు రోజుల్లో ఫలితాలు
 
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : సాక్షి ఎరీనావన్‌ స్కూల్‌ ఫెస్ట్‌కు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. లక్ష్మీపురం సమీపంలోని రిడ్జ్‌ పాఠశాలలో నిర్వహించిన వివిధ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చెస్, హ్యాండ్‌ రైటింగ్, పెయింటింగ్, పోస్టర్‌ మేకింగ్, సింగింగ్, ఇన్‌స్ట్రూమెంట్స్‌ తదితర విభాగాల్లో పోటీలు జరిగాయి. మొదటి రౌండు పోటీలకు రిడ్జ్, సెయింట్‌ జోసెఫ్‌, భాష్యం తదితర పాఠశాలల నుంచి 126 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా 90 మంది హాజరయ్యారు. వీటి ఫలితాలను రెండు, మూడు రోజుల్లో విద్యార్థులకు తెలియజేస్తామని సాక్షి యూనిట్‌ మేనేజర్‌ కిరణ్‌ తెలిపారు. 
 
మెదడుకు పదను పెట్టించిన చెస్‌...
  చెస్‌  పిల్లల మెదడుకు పదును పెట్టించింది. మొత్తం 30 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా 28 మంది చెస్‌ ఆడారు. వీరికోసం 14 టేబుళ్లలో మొదటి రౌండు చెస్‌ను నిర్వహించారు. 
 
అందమైన చేతిరాత మా సొంతం...
 ఉత్తమ మార్కులు రావాలంటే కష్టపడి చదవడంతోపాటు మంచిచేతిరాత ఉండాలి. అప్పుడే మార్కులు సొంతమవుతాయి. హ్యాండ్‌రైటింగ్‌ విభాగంలో 29 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా 17 మంది హాజరై అందమైన చేతిరాతను ప్రదర్శించారు. 
 
పెయింటింగ్, పోస్టర్‌ మేకింగ్‌...
బొమ్మను గిస్తే నీలా ఉంటుంది..అంటూ ఓ కవి అన్న మాటలను సాక్షి ఎరీనావన్‌ స్కూల్‌ ఫెస్ట్‌లో విద్యార్థులు నిజం చేశారు. అందమైన బొమ్మలను గీసి పెయింటింగ్‌ వేసి తమలో దాగి ఉన్న నైపుణ్యాన్ని బయటపెట్టారు. పెయింటింగ్, పోస్టర్‌ మేకింగ్‌ విభాగాల్లో 49 మందికి 29 మంది హాజరై తమలోని చిత్రకళను ప్రదర్శించారు. 
 
నేను పాడితే లోకం ఆడదా....
సింగింగ్, ఇన్‌సూ​‍్ర్టమెంట్స్‌ విభాగాల్లో 27 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా 16 మంది విద్యార్థులు పోటీలకు హాజరయ్యారు. నేను పాడితే లోకం ఆడదా అన్న రీతిలో  12 మంది చిన్నారులు పాటలు పాడగా, నలుగురు గీటారు, వయోలిన్, హార్మోని వాయించారు. 
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌