amp pages | Sakshi

అడ్డొస్తున్నాడని అంతమొందించారు

Published on Sun, 08/14/2016 - 16:23

  •  ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన భార్య
  • పోలీసుల విచారణలో అంగీకరించిన నిందితురాలు
  • విషయం తెలిసి ప్రియుడ్ని చెట్టుకు కట్టేసిన తండావాసులు
  • ఆపై పోలీసులకు పట్టిచ్చిన వైనం
  • భర్త ఉండగానే ఆమె మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. శాశ్వతంగా అతని అడ్డు తొలగించుకుంటే తమకు ప్రశ్నించే వారే ఉండరనుకున్న ఆమె ప్రియుడితో కలసి పథకం రచించింది. వారిద్దరూ కలసి మరో ఇద్దరి సహకారంతో అమాయకుడ్ని చంపేశారు. ఆ తరువాత పోలీసుల కళ్లుగప్పి పరారైనా.. చివరకు పోలీసులకు ఆమె దొరికిపోయింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు ప్రియుడ్ని తండావాసులు చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు. కర్ణాటకకు చెందిన ఎస్‌ఐ వజ్రముని కథనం ప్రకారం...


    జరిగిందేమిటంటే...
    పుట్టపర్తి మండలం పెడపల్లి పెద్దతండాకు చెందిన కె.యుగంధర్‌(28), మంజుల దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలసి నాలుగేళ్ల కిందట బెంగళూరుకు వలస వెళ్లారు. అక్కడ అదే తండాకు చెందిన ఆంజనేయులు నాయక్‌తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం యుగంధర్‌కు తెలిసి భార్యను మందలించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించిన అతను ఇక ఆమెను ఏమీ అనలేకపోయాడు. దీన్ని అలుసుగా తీసుకున్న ఆమె భర్త అడ్డు తొలగించుకుంటే శాశ్వతంగా తాము మరింత స్వేచ్ఛగా ఉండొచ్చని భావించారు. ఇదే విషయం ఆమె ప్రియుడితో చెప్పింది. తమ పథకాన్ని మరో ఇద్దరికి తెలిపి వారి సహకారంతో రెండ్రోజుల కి ందట యుగంధర్‌ను ఇనుప రాడ్లతో కొట్టి చంపేశారు. ఆ తరువాత మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టేసి ఇంటి సమీపంలోని ముళ్లపొదల్లో పడేశారు. హతుడి భార్య మంజులను శనివారం ఉదయం అరెస్టు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా, ఆంజనేయులు నాయక్‌ సహా మరో ఇద్దరితో కలసి హత్య చేసినట్లు అంగీకరించింది.  


    పోలీసుల సమాచారంతో...
    విచారణలో భాగంగా ఆంజనేయులు నాయక్‌ ఆచూకీ తెలుసుకునే క్రమంలో పోలీసులు పెడబల్లి తండా వాసులకు ఫోన్‌ చేసి ఆంజనేయులు నాయక్‌ చేసిన ఘనకార్యం గురించి వివరించారు. ఈ విషయం క్షణాల్లో తండా యావత్తూ తెలిసిపోవడంతో ఊరంతా ఒక్కటై నిందితుడు ఆంజనేయులు నాయక్‌ పరారు కాకుండా, అతన్ని పట్టుకుని చెట్టుకు కట్టేశారు. ఆ తరువాత కర్ణాటక పోలీసులు రాగానే వారికి పట్టిచ్చారు. వందలాది మంది గ్రామస్తులు చుట్టుముట్టడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కనిపించింది.

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?