amp pages | Sakshi

పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు

Published on Tue, 12/06/2016 - 22:49

-  రైతులకు సకాలంలో ఈ పాసుపుస్తకాలు ఇవ్వాలి
 - రెవెన్యూ సిబ్బందితో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి 
 
దేవనకొండ:    రైతులు ఈ–పాసు పుస్తకాలకు  దరఖాస్తు చేసుకుంటే కారణాలు చెప్పకుండా ఎందుకు తిరస్కరిస్తున్నారు. ఇక నుంచి ఇలాంటివి మళ్లీ పునరావ​ృతమైనా,  పనితీరు మార్చుకోకపోయినా విధుల నుంచి తొలగిస్తామని రాష్ట్ర  ఉపముఖ్యమంత్రి  కేఈ కృష్ణమూర్తి రెవెన్యూ అధికారులను, సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం ఆయన పత్తికొండకు వెళ్తూ దేవనకొండలోని తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరా​‍్వత జేసీ హరికిరణ్, ఆర్డీఓ ఓబులేష్, రెవెన్యూశాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   మండలంలో 417 మంది ఈ–పాసు పుస్తకాలకు   దరఖాస్తులిసే‍​‍్త  ఎందుకు రిజెక్ట్‌ చేశారని సిబ్బందిని ప్రశ్నించారు. ఈ–పాసుపుస్తకాలను 30 రోజులు గడిచినా ఎందుకు ఇవ్వడం లేదో  తనకు  కారణాలు చెప్పాలన్నారు.ఇక నుంచి   రైతులు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. ప్రభుత్వ పథకాలు ప్రతి లబ్ధిదారుడికి అందేలా చూడాలన్నారు. రేషన్‌ పంపిణీలో  అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం శిథిలావస్థలో ఉన్న తహసీల్దార్‌ కార్యాలయానికి నూతన భవనాలను నిర్మించేందుకు నిధులు విడుదల చేయాలని ఆర్డీఓ ఓబులేష్‌ డిప్యూటీ సీఎంకు విన్నవించారు. తర్వాత గాలిమరల ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతులకు  ఉపముఖ్యమంత్రి   పరిహార చెక్కులను అందజేశారు.  సమావేశంలో తహసీల్దార్‌ తిరుమలవాణి, డిప్యూటీ తహసీల్దార్‌ రంగన్న, ఎంపీడీఓ ఉమామహేశ్వరమ్మ, ఆర్‌ఐ ఆదిమల్లన్నబాబు, ఆయా గ్రామాల వీఆర్వోలు పాల్గొన్నారు. 

Videos

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"

రాజంపేట లో అశేష ప్రజా స్పందన

కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు

గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు

సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు