amp pages | Sakshi

పోస్టులున్నా స్పందన సున్న

Published on Thu, 07/28/2016 - 19:32

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : ప్రస్తుతం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉంది. ఏ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించినా ఒక్కో పోస్టుకు సుమారు 50 నుంచి 100 మంది దరఖాస్తు చేసుకునే పరిస్థితి నెలకొంది. అటెండర్‌ పోస్టులకు కూడా ఉన్నత విద్యావంతులు పోటీ పడుతున్నారు. అలాంటిది ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తే అభ్యర్థుల నుంచి స్పందన కరువైంది. గత నెలలో ఆర్టీసీలో బ్యాక్‌లాగ్‌ డ్రైవర్‌ పోస్టులకు ఆర్టీసీ అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం జిల్లాలోని రీజియన్‌ పరిధిలో 32 పోస్టులు ఎస్టీ పురుష అభ్యర్థులకు, 35 పోస్టులు ఎస్టీ మహిళా అభ్యర్థులకు, 86 ఉద్యోగాలు ఎస్సీ మహిళలకూ కేటాయించారు. మొత్తంగా 155 డ్రైవర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈ నెల 25తో దరఖాస్తులు సమర్పించడానికి గడువు ముగిసింది. కాగా ఈ ఉద్యోగాల కోసం జిల్లాలోని వివిధ డిపోల నుంచి అభ్యర్థులు సుమారు 150 దరఖాస్తులు కొనుగోలు చేశారు. దరఖాస్తులు సమర్పించే గడువు ముగిసిన తరువాత పరిశీలిస్తే కేవలం 55 మాత్రమే అందాయి. అవి కూడా కేవలం ఎస్టీ పురుష అభ్యర్థుల నుంచే కావడం గమనార్హం. పోస్టులకు కనీసం 1ః2 నిష్పత్తిలో కూడా దరఖాస్తులు రాకపోవడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదిలా ఉండగా పశ్చిమ రీజియన్‌ పరిధిలో కేవలం బ్యాక్‌లాగ్‌లో మహిళా డ్రైవర్‌ పోస్టులు 121 ఖాళీలు ఉండగా జిల్లాలో హెవీ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్న ఒక్క మహిళ కూడా లేకపోవడం విశేషం. 
అనాసక్తికి కారణాలివేనా 
ఆర్టీసీలో డ్రైవర్‌ ఉద్యోగాల్లో చేరటానికి అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపకపోవడానికి కారణాలనేకం ఉన్నట్టు ప్రస్తుతం సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లు విశ్లేషిస్తున్నారు. సంస్థలో చిన్న తప్పిదాలకు కూడా యాజమాన్యం పెద్దపెద్ద క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుండటంతో ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న డ్రైవర్లు కూడా విసుగెత్తిపోతున్నారని తెలుపుతున్నారు. గతంలో కంటే ఇప్పుడు రోడ్లపై వాహనాల రద్దీ పెరగడం ద్విచక్రవాహనాలతో పాటు చిన్నకార్లు, ప్రైవేట్‌ ట్రావెల్స్‌ వంటి వాహనాల తాకిడి రోడ్డుపై ఎక్కువగా ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడడం కూడా ఈ ఉద్యోగాల పట్ల అనాసక్తి కలిగిస్తోందని చెబుతున్నారు. దీనికి తోడు సంస్థలో పనిచేసి పదవీ విరమణ చేస్తే పెన్షన్‌ సౌకర్యం లేకపోవడం, డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకోవడానికి ఇష్టపడే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోందని చెబుతున్నారు.
ముందుచూపు లేకపోవడం వల్లే..
ఆర్టీసీలో పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా డ్రైవర్లను నియమించుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ సంస్థ యాజమాన్యం ముందు చూపుతో వ్యవహరించని కారణంగానే ఈ పరిస్థితి తలెత్తుతోంది. రోస్టర్‌ పద్ధతి ప్రకారం మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తే మహిళా డ్రైవర్లు సంస్థకు అవసరమని తెలిసినా ఇప్పటివరకు సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వలేదు. –ఆర్‌వీవీఎస్‌డీ ప్రసాద్, ఆర్టీసీ నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్, రాష్ట్ర చైర్మన్‌
నిబంధనలు సడలించడం కుదరదు
డ్రైవర్‌ ఉద్యోగాల భర్తీలో నిబంధనలు సడలించి ఇతరులకు అవకాశాలు ఇవ్వవచ్చు కదా అని కొందరు అడుగుతున్నారు. కానీ రాజ్యాంగం దేశంలోని ప్రతి శాఖలో మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని సూచిస్తోంది. దీనికారణంగా ఆయా వర్గాలకు కేటాయించిన ఉద్యోగాల్లో ఇతరులను నియమించేలా నిబంధనలు సడలించడం సాధ్యం కాదు. – ఎస్‌.ధనుంజయరావు, రీజినల్‌ మేనేజర్, ఆర్టీసీ పశ్చిమ రీజియన్‌
 
 
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌