amp pages | Sakshi

పత్తిలో గుడ్డిపూలు నివారించుకోండి

Published on Sun, 09/11/2016 - 22:55

అనంతపురం అగ్రికల్చర్‌ : పత్తిలో గుడ్డిపూలు గుర్తించి నివారించుకుంటే మంచిదని, ఈ ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా రెండు మూడు దశల్లో 28,885 హెక్టార్ల విస్తీర్ణంలో పత్తిపంట సాగు చేశారని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.జాన్‌సుధీర్‌ తెలిపారు. పంట ప్రస్తుతం 30 నుంచి 60 రోజుల వయస్సులో ఉందని, ఈ దశలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ప్రమాదకరమైన గులాబీ రంగు పురుగుతోపాటు మిగతా చీడపీడలు, తెగుళ్లు వ్యాపించకుండా నివారించుకోవచ్చన్నారు.

గుడ్డిపూలు గుర్తించడం ఇలా: గతేడాది పత్తిపంటకు నవంబర్‌లో గులాబీరంగు పురుగు గుర్తించడంతో అప్పటికే పంట బాగా దెబ్బతినడంతో రైతులకు ఎక్కువగా నష్టం జరిగింది. దీంతో ఈ ఏడాది శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ ముందస్తు చర్యలు చేపట్టి రైతులను అప్రమత్తం చేశారు. ఇటీవల శాస్త్రవేత్తల క్షేత్రస్థాయి పంట పొలాల పరిశీలనలో గుత్తి, తాడిపత్రి, ఉరవకొండ, రాయదుర్గం డివిజన్ల పరిధిలో గులాబీరంగు పురుగు ఉనికికి గుర్తించారన్నారు. పంట పొలాల్లో గుడ్డి పూలు ఉన్నట్లు కనిపించాయి. గుడ్డి పూలను రైతులు గుర్తించేలా అవగాహన ఉంటే తొలిదశలోనే పంట దెబ్బతినకుండా నివారించుకోవచ్చు. గొంగలి పురుగు గుడ్డు నుంచి బయటకు వచ్చి పూత, కాయ లోపలి భాగాల్లోకి చొచ్చుకెళ్లి నష్టాన్ని కలిగిస్తుంది.

నివారణ చర్యలు:
ఎకరా పొలంలో నాలుగు నుంచి ఎనిమిది చొప్పున లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. వరుసగా మూడు రోజుల పాటు ఒక్కో బుట్టలో ఎనిమిది పురుగులు కనిపించినా, పది పువ్వులో ఒక గుడ్డిపువ్వు ఉన్నట్లు గుర్తించినా, ఇరవై కాయలను కోస్తే అందులో రెండు గొంగలి పురుగులు కనిపించినా గులాబీరంగు పురుగు ఆశించినట్లు తెలుసుకోవాలి. అలాగే కాయ పైభాగంలో పురుగు బయటకు వచ్చే గుండ్రటి చిన్న రంధ్రం కనిపించినా, కాయ తొనల మధ్య గోడలపై గుండ్రంటి రంఘం ఉన్నా, గుత్తి పత్తి, రంగు మారిన పత్తి కనిపించినా పురుగు ఉధృతి ఉన్నట్లే లెక్క. గుడ్డిపూలు, రంగుమారినవి, రంధ్రాలున్న కాయలను ఏరివేసి నాశనం చేయాలి. పూత సమయంలో ఎకరానికి 60 వేల చొప్పున ట్రైకోగామా పరాన్నజీవులను వదలడం వల్ల పురుగు గ్రుడ్లను సమూలంగా నివారించుకోవచ్చు. ఉధృతిని బట్టి శాస్త్రవేత్తలు, అధికారుల సిఫారసు మేరకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. 

Videos

ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య

వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?