amp pages | Sakshi

ముంద‌స్తు నీళ్లు ఇస్తేనే మేలు

Published on Sat, 05/13/2017 - 23:53

అమలాపురం : ముందస్తు ఖరీఫ్‌ సాగు చేపట్టాలన్న డెల్టా రైతుల ఆశలు  ఆవిరవుతున్నాయి. సుదీర్ఘకాలంగా తాము చేస్తున్న పోరాటానికి స్పందించి ఈ ఏడాది ఖరీఫ్‌ సాగుకు 15 రోజుల ముందే సాగునీరు విడుదలకు ఇరిగేషన్‌ అధికారులు అంగీకరించారు. తాజాగా ముందుస్తుగా కాలువలకు సాగునీరందించేందుకు ఇరిగేషన్‌ ఎడ్వజరీ బోర్డు (ఐఏబీ) సమావేశ తీర్మానం ఉంటేకాని నీరు విడుదల చేయలేరని ఇరిగేషన్‌ అధికారులే చెబుతుంటుంటే ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. డెల్టాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సాగుకు జూన్‌ ఒకటికి పంట కాలువల ద్వారా సాగునీరు విడుదల చేస్తామని అధికారులు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్‌ 15 తరువాత సాగునీరు ఇవ్వడం వల్ల అక్టోబరులో పంట దెబ్బతింటుందని, రబీ సాగు చివరి కాలంలో నీరందకపోవడం, మూడో పంట అపరాల సాగు లేక పోవడం వంటి విపత్కర పరిస్థితులకు కారణమవుతోందని రైతులు ఆందోళన. సాగునీరు ఆలస్యమైనందున గతేడాది కోనసీమలో సుమారు 40 వేల ఎకరాల్లో సాగు చేయని సంగతి తెలిసిందే. ఇందుకు రైతులు చెప్పిన కారణం జూన్‌ 15 తరువాత నీరు ఇవ్వడం వల్ల సాగు చేయడం లేదనే. రైతులు డిమాండ్‌ను ‘సాక్షి’ పలు సందర్భాలలో వెలుగులోకి తీసుకురావడంతో స్పందించి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సిఫార్సు మేరకు అధికారులు జూన్‌ ఒకటి నుంచి కాలువలకు నీరివ్వాలని నిర్ణయించారు. అధికారులు నిర్ణయంతో ముందస్తు సాగుకు అటు రైతులు, ఇటు వ్యవసాయశాఖాధికారులు సైతం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. తీరా చూస్తే ఇరిగేషన్‌ ఎడ్వజరీ బోర్డు (ఐఏబీ) సమావేశంలో ముందస్తు సాగునీరు విడుదలకు తీర్మానం చేయలేదని, అప్పటి సమావేశంలో జూన్‌ 15 నాటికే నీరు ఇవ్వాలని తీర్మానించినట్టు అధికారులు చెబుతున్నారు. దీనితో ముందస్తు సాగునీరు విడుదలపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, గోదావరి ప్రాజెక్టు కమిటీ ప్రతినిధులు ఐఏబీలో తీసుకున్న నిర్ణయాన్ని కాదని, ముందస్తు సాగునీరు విడుదల చేయాలంటే సాధ్యం కాదని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక ఇరిగేషన్‌ అధికారి ‘సాక్షి’తో అన్నారు. అలా చేయాలంటే మరోసారి ఐఏబీ సమావేశం ఏర్పాటు చేయాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ దీమాతోనే ఈ ఏడాది ఆధునికీకరణ పనులు ఆలస్యంగా ఆరంభించారు. ఎప్పటిలానే ఈ సారి కూడా సాగునీరు ఆలస్యంగా విడుదలైతే ఖరీఫ్‌ దూరంగా ఉండాలని రైతులు అభిప్రాయపడుతున్నారు. 

#

Tags

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌