amp pages | Sakshi

రాగద్వేషాలకు అతీతం ఆయన విమర్శ

Published on Sun, 07/31/2016 - 21:51

  • ఘనంగా కోడూరి శ్రీరామమూర్తి పుస్తకద్వయ ఆవిష్కరణ
  • రాజమహేంద్రవరం కల్చరల్‌ :
    సంయమనంతో కూడిన విమర్శకుడు కోడూరి శ్రీరామమూర్తి అని, ఆయన విమర్శ రాగద్వేషాలకు అతీతమని గుంటూరుకు చెందిన అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కళాగౌతమి ఆధ్వర్యంలో ఆదివారం ఆనంరోటరీహాల్లో ప్రముఖ విమర్శకుడు, కథారచయిత కోడూరి శ్రీరామమూర్తి రచించిన ‘సాహిత్యానుభూతి’,‘మహాత్ముడు–పర్యావరణము’గ్రంథాలను లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుభాషలో మనోవైజ్ఞానిక అంశాలకు సంబంధించిన రచనలు తక్కువేనన్నారు. తెలుగుకథకు కొత్త అందాలను పొదిగిన ఉత్తమ కథకుడు, విమర్శకుడు కోడూరి శ్రీరామమూర్తి, ఆయన రచనలన్నింటిలో సామాజిక విలువలు పుష్కలంగా కనిపిస్తాయన్నారు. కవి, గాయకుడు ఎర్రాప్రగడ రామకృష్ణ మాట్లాడుతూ పనసపండు పక్వానికి వచ్చిన సంగతి దాని సువాసనలే చెబుతాయని, మంచి రచనకు కొలమానం ప్రముఖుల అభిప్రాయాలేనని అన్నారు. జ్ఞానపీఠఅవార్డు గ్రహీత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి, శాసనమండలి ఉపసభాపతి మండలిబుద్ధప్రసాద్‌లు కోడూరి రచనలపై వెలువరించిన అభిప్రాయాలను ఎర్రాప్రగడ చదివి వినిపించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యుడు ఎండ్లూరి సుధాకర్, రొటేరియన్‌ పట్టపగలు వెంకటరావు, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్‌ ఎస్‌పీ గంగిరెడ్డి, కళాగౌతమి వ్యవస్థాపకుడు డాక్టర్‌ బి.వి.ఎస్‌.మూర్తి, పర్యావరణవేత్త తల్లావఝుల పతంజలి శాస్త్రి, కథారచయిత వల్లూరి శివప్రసాద్, గాంధేయవాది పొన్నాడ హనుమంతరావు 
    తదితరులు పాల్గొన్నారు.
     

Videos

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)