amp pages | Sakshi

చివరికి ఇలా.. తేల్చేశారు!

Published on Tue, 05/31/2016 - 10:22

నీరుగారిన లావణ్య మృతి కేసు
అది రోడ్డు ప్రమాదమేనని సీపీ స్పష్టీకరణ
ఆయన చెప్పిన వివరాల్లోనే ఎన్నో కొత్త ప్రశ్నలు
లాడ్జిలో సీసీ కెమెరా ఫుటేజ్ మాయం
ఎలుకలు కొరికేశాయని నిర్వాహకుల సమాధానం
ఆలయం వెలుపలి ఫుటేజ్ చూపనే లేదు
రికార్డులకెక్కని క్షతగాత్రురాలి స్టేటమెంట్
లాడ్జి బాయ్ చెప్పిందే ప్రామాణికం
సాధారణ ప్రమాదమే అయితే నిందితుల అరెస్టుకు వారమెందుకు?

 

మందు కొట్టింది నిజం.. అదే మత్తులో ఫోనులో మాట్లాడుతూ కారు నడిపిందీ నిజం.. వెనుక నుంచి మాటిమాటికీ హారన్ కొడుతూ కారును ముందుకూ.. వెనక్కూ నడుపుతూ బైక్‌పై ఉన్న వారిని ఇబ్బంది పెట్టడం కూడా నిజమే..  కానీ.. కావాలని బైకును గుద్ది హత్య చేశారనడం మాత్రం అవాస్తవమట!.. అది కేవలం మద్యం మత్తులో ఉండగా జరిగిన ప్రమాదమేనట!!  సంచలనం సృష్టించిన లావణ్య మృతి కేసును పోలీస్ బాస్‌లు ఇలా తేల్చేశారు.


ఆలయం వెలుపల వీడియో ఫుటేజ్‌లు చూడలేదు.. ప్రత్యక్ష సాక్షి, క్షతగాత్రురాలు చెప్పిన విషయాలకూ విలువివ్వలేదు.. లాడ్జి బాయ్ చెప్పినదాన్ని మాత్రం విశ్వసించారు. మొత్తానికి వేధింపులు, కారుతో కావాలని ఢీకొట్టడం.. అన్నవి ఉత్తుత్తి ఆరోపణలేనని తేల్చేశారు.

 దర్యాప్తులో తేలిన విషయాలంటూ పోలీసు అధికారులు చెప్పిన వివరాల్లోనే.. ఎన్నో కొత్త ప్రశ్నలు తొంగిచూశాయి. వాటికి మాత్రం సమాధానం లేదు.

 

విశాఖపట్నం: డబ్బు, రాజకీయం, అధికారం.. మరోసారి కలిసిపోయాయి. నిర్భయ స్థాయి కేసును కేవలం ప్రమాదం కేసుగా మార్చేశాయి. ఈ నెల 22న వడ్లపూడికి చెందిన మాటూరి లావణ్య కారు ఢీకొట్టడంతో మరణించిన కేసును మద్యం మత్తులో అనుకోకుండా జరిగిన ప్రమాద కేసుగా  పోలీసులు తేల్చారు. ఆమెను కొందరు పోకిరీలు  వేధించి, వెంబడించి, ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టి హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు నెత్తీనోరూ కొట్టుకున్నా.. అబ్బే.. అలాంటిదేమీ జరగలేదని పోలీసులు తమ విచారణలో తేల్చేశారు. అనకాపల్లి నూకాంబిక ఆలయం లోపలి సీసీ కెమెరా దృశ్యాలను చూపించి.. ఆలయం వెలుపల ఎలాంటి వేధింపులు జరగలేదంటున్నారు. ఎస్‌ఆర్ రెసిడెన్సీ లాడ్జి రూమ్ బాయ్ మాటల ఆధారంగా నిందితులు ఆరోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ హోటల్‌లోనే ఉన్నట్లు నిర్ధారణకు వచ్చేశారు. సంఘటన రోడ్డు ప్రమాదమేనని అంటున్నప్పుడు, నిందితులెవరో తెలిసినప్పుడు అరెస్ట్ చేయడానికి వారం రోజులు ఎందుకు పట్టిందనే ప్రశ్నకు అధికారుల వద్ద సరైన సమాధానం లేదు. ప్రత్యక్ష సాక్షి, ప్రమాదంలో గాయపడిన దివ్య చెప్పిన మాటలు ఇప్పుడు ఏమయ్యాయంటే జవాబు లేదు. ఇలా ఈ కేసులో అనేక ప్రశ్నలు, అనుమానాలను నివృత్తి చేయకుండానే మద్యం మత్తులో జరిగిన రోడ్డు ప్రమాదంగా పోలీసులు నిర్ధారించారు.

 
దివ్య వాంగ్మూలం ఏమైంది?

నూకాంబిక ఆలయం బయటే తమకు వేధింపులు మొదలయ్యాయని, తమను వెంబడించి వేధించారని, కావాలనే కారుతో ఢీకొట్టారని మృతురాలు లావణ్య ఆడపడుచు దివ్య ఆ రోజు మీడియాకు వెల్లడించింది. ప్రమాదంలో గాయపడిన ఆమె ప్రత్యక్ష సాక్షి కావడంతో ఆమె మాటలకు ప్రాధాన్యత ఉంది. కానీ ఇప్పుడు అవేవీ పోలీసు రికార్డుల్లో లేవు. తమ విచారణలో ఆమె అలా ఏమీ చెప్పలేదని పోలీసు అధికారులు అంటున్నారు. ఆమెను నయానో భయానో ప్రభావితం చేయడం వల్లే పోలీసులకు నిజాలు వెల్లడించేందుకు వెనకడుగు వేస్తుండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 
దేవాలయం వెలుపల ఫుటేజీ ఏదీ?

నూకాంబిక ఆలయంలో మొత్తం 22 సీసీ కెమెరాలున్నాయి. ఆలయం లోపల 7 సీసీ కెమెరాలుండగా మిగతా వాటిని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. అయితే ఆలయం లోపలి కెమెరాల్లోని ఫుటేజీనే పోలీసులు బయటపెట్టారు. వాటి ప్రకారం.. లావణ్య మధ్యాహ్నం 2.59 గంటలకు ఆలయంలోకి ప్రవేశించింది. ఆమె క్యూ లైన్లో ఉన్నట్లు కామ్-6లో, ప్రసాదం తీసుకుంటున్నట్లు కాామ్-3లో, అమ్మవారిని దర్శించుకున్నట్లు కామ్-1లో రికార్డయ్యింది. ఆలయం అవుట్ గేటు నుంచి బయటకు వస్తున్నట్లు కామ్-4 చూపిస్తోంది. అప్పటికి సమయం 3.31 గంటలు. తర్వాత లావణ్య, మరో ఇద్దరు ద్విచక్ర వాహనంపై వడ్లపూడికి బయలుదేరారు. సాలపువానిపాలెం వద్ద హేమకుమార్ కారు ఢీకొట్టడంతో లావణ్య చనిపోయింది. ఈ దృశ్యాల్లో ఎక్కడా నిందితులు కనిపించలేదు. కానీ బాధితులు సంఘటన జరిగిన రోజు చెప్పిన దాని ప్రకారం లావణ్యను నిందితులు ఆలయం వెలుపల వేధించారు. దీన్ని నిర్థారించాలంటే ఆలయం వెలుపల ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించాల్సి ఉంది. కానీ వాటిలో ఎక్కడా లావణ్య కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా గత మూడేళ్లలో ఆలయ పరిసరాల్లో ఈవ్ టీజింగ్ కేసు నమోదు కాలేదని  స్థానిక పోలీస్ స్టేషన్ రికార్డులు, రూరల్ ఎస్పీ వివరాలను ఉటంకిస్తూ ఆలయంలో ఎలాంటి వేధింపులు జరగలేదని నిర్ధారించామని సీపీ చెప్పారు.

 
లాడ్జిలో ఫుటేజ్‌లను ఎలుకలు కొరికేశాయట!

ఆరోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నిందితులు తమ స్నేహితులతో కలిసి అనకాపల్లి ఎస్‌ఆర్ రెసిడెన్సీ రూము నెం.315లో ఉన్నారని పోలీసులు నిర్ధారించారు. అక్కడి రూమ్ బాయ్ ఇచ్చిన వాంగ్మూలాన్ని దీనికి ప్రామాణికంగా తీసుకున్నారు. కాగా బర్మా కాలనీకి చెందిన రాజు అనే వ్యక్తి పేరు మీద 315 రూమ్‌ను తీసుకున్నారని సమాచారం. కానీ పోలీసులు చెప్పిన ఎమిమిది మందిలో రాజు అనే పేరుతో ఎవరూ లేరు. లాడ్జిలో సీసీ కెమెరా ఫుటేజీని తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే సీసీ కెమెరాల వైర్లను ఎలుకలు కొరికేశాయని, అందువల్ల అవి 15 రోజులుగా పని చేయడం లేదని నిర్వాహకులు చెప్పారట. అసలు సీసీ కెమెరాల వైర్లను ఎలుకలు నిజంగా కొరికేశాయా?.. ఎలుకల బెడద అంతలా ఉంటే రెసిడెన్సీని ఎలా నడుపుతున్నారు??.. 15 రోజుల నుంచి కెమెరాలు పనిచేయకపోతే ఎందుకు బాగు చేయించలేదు???.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయలేదు. అన్నింటికీ మించి బ్యాక్ ఇన్‌స్ట్రుమెంట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. దాన్ని స్వాధీనం చేసుకుని సాంకేతికంగా విశ్లేషించి ఉంటే మరిన్ని వివరాలు తెలిసేవి. కనీసం సీసీ కెమెరాలు ఎప్పటినుంచి పనిచేయడం లేదో తెలిసేది.

 
మీడియాను ఆధారాలు అడుగుతున్న సీపీ

ఇన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు లేకుండానే దర్యాప్తు ముగించడం ఆందోళనకు గురి చేస్తోంది. అదీ కాక లావణ్య కేసులో నిందితులను పట్టుకోవడానికి వారం రోజుల సమయం తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. రాజకీయ జోక్యం ఉన్నట్లు, సెటిల్‌మెంట్ జరిగినట్లు ఆధారాలుంటే ఇవ్వమని మీడియాను సీపీ స్వయంగా అడగడం హాస్యాస్పదంగా ఉంది. ఆధారాలు సేకరించి నేరస్తులను పట్టుకోవాల్సిన ఉన్నతాధికారి ఈ విధంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది.

 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)