amp pages | Sakshi

కన్నతల్లిని వదిలించుకున్నారు!

Published on Sun, 08/21/2016 - 21:22

  • వృద్ధురాలిని బస్టాండ్‌లో వదిలేసిన బిడ్డలు 
  • ఊరికి వెళ్లొద్దామంటూ తీసుకొచ్చిన తనయలు
  • తిప్పాపూర్‌లో భిక్షాటన చేస్తున్న వృద్ధురాలు
  • తన గ్రామానికి పంపించండంటూ ఆవేదన 
  • వేములవాడ రూరల్‌ : కట్టుకున్న భర్త, కన్నకొడుకు కన్నుమూశారు. కోడలు, మనుమలు కాదుపొమ్మన్నారు. చివరకు కడుపున పుట్టిన బిడ్డలు సైతం కనికరించలేదు. తల్లికి తెలియకుండా ఊరికి వెళ్లొద్దామంటూ ఆటోలో ఊరుగాని ఊరు తీసుకొచ్చి వదిలేసిపోయారు. పది రోజులుగా కడుపుకు తిండిలేక, కంటికి కునుకు లేక ఆ అవ్వ బక్కచిక్కిపోతోంది. తనను బిడ్డల దగ్గరికి చేర్చాలంటూ కనిపించిన వారందరినీ ప్రాధేయపడుతోంది. అందరూ ఉండి అనాథగా మారిన వృద్ధురాలు ప్రస్తుతం వేములవాడలోని తిప్పాపురం బస్టాండ్‌లో బిక్కుబిక్కుమంటోంది. వృద్ధురాలు తెలిపిన వివరాల ప్రకారం ఆమె దీనగాథ ఇదీ... 
    ఆటోలో తీసుకొచ్చి వదిలేశారు... 
    ఆదిలాబాద్‌ జిల్లా చెన్నూరుకు చెందిన గడారి సాయమ్మ భర్త ఎల్లయ్య పదేళ్ల కిందట మృతి చెందాడు. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు సంతానం. కొడుకుతోపాటు ఒక కూతురు గత కొంతకాలం క్రితం చనిపోయారు. కోడలు, నలుగురు మనుమలు కరీంనగర్‌ జిల్లా జగిత్యాలలో ఉంటున్నారు. ఒక కూతురుకు వివాహమై వెళ్లిపోగా, మరో కూతురు వికలాంగురాలు. కొంతకాలం నుంచి సాయమ్మ వికలాంగురాలైన కూతురుతో కలిసి చెన్నూరులో నివాసం ఉంటోంది. వీరిద్దరు ప్రభుత్వం ఇచ్చే ఆసరా పింఛన్‌పైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ క్రమంలో సాయమ్మను సాకడం భారంగా భావించిన కుమార్తెలు ఆమెను వదిలించుకోవాలనుకున్నారు. పథకం ప్రకారం ఊరికి వెళ్లొద్దామంటూ పది రోజుల క్రితం ఆమెను ఆటోలో తీసుకొచ్చి వేములవాడ బస్టాండ్‌ వద్ద వదిలేశారు. ఏమీ తెలియని ఆ తల్లి ఇక్కడికి ఎందుకు వచ్చినం బిడ్డ అంటూ అమాయకంగా తన కూతుళ్లను అడిగింది. ఇక్కడ కొంత పని ఉందని, తాము ఆ పని చేసుకొని వస్తామని చెప్పి వారిద్దరు వచ్చిన ఆటోలో వెళ్లిపోయారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బిడ్డల కోసం ఎదురుచూసిన సాయమ్మ వారు రాకపోవడంతో తన బిడ్డల జాడ చెప్పాలంటూ అక్కడున్న వారిని అమాయకంగా అడగటం మెుదలుపెట్టింది. ఇలా ఒకటి, రెండు రోజులు అయినప్పటికీ ఆ బిడ్డలు రాలేదు. అప్పుడు ఆర్థమైంది.. బిడ్డలు తనను వదలించుకోవడానికే ఈ ప్రాంతానికి తీసుకొచ్చారని! ఎలాగైనా తనను బిడ్డల దగ్గరికి పంపించమంటూ ఆ వృద్ధురాలు గత పది రోజులుగా కనిపించిన వారందరినీ వేడుకుంటోంది. 
    దినదిన గండంగా... 
    పది రోజులుగా బస్టాండ్‌ ప్రాంతంలో ఉంటున్న సాయమ్మ పరిస్థితి దయనీయంగా మారింది. తినడానికి తిండి లేదు.. ఉందామంటే చోటు లేదు.. ఒంటిపై సరైన బట్టలు కూడా లేవు. స్థానిక ఆటోడ్రైవర్లు, ప్రయాణికులు, ఆలయానికి వచ్చే భక్తులు దయతల్చి ఇచ్చింది తింటూ ఆర్ధాకలితో అలమటిస్తోంది. రాత్రివేళ ఆటోస్టాండ్‌ వద్దనున్న షెడ్‌లో పడుకుంటోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్టాండ్, మూలవాగు పక్కన ఉంటోంది. సాయమ్మకు కాళ్లు పనిచేయవు. నేలపై పాకుతూ కొద్దిదూరం కూడా కదల్లేకపోతోంది. భిక్షాటన చేయగా రూ.200 వచ్చాయని, ఈ డబ్బులు తీసుకొని తనను చెన్నూరులో వదలిపెట్టండని ఆటోవాలాలను వేడుకుంటోంది. విషయం తెలుసుకున్న సాక్షి విలేకరి సాయమ్మ గురించి వేములవాడ టౌన్‌సీఐ శ్రీనివాస్‌కు సమాచారం అందించగా, ఆమెను చెన్నూరుకు పంపించడానికి చర్యలు తీసుకుంటానని అన్నారు. కారణాలేవైనా... మలిసంధ్యలో ఉన్న ఇలాంటి అమాయక వృద్ధులను వారి కుటుంబసభ్యులే ఆ రాజన్న చెంతకు చేర్చడం, వారు ఇక్కడ భిక్షాటన చేస్తూ జీవించడం, ఆపై అనాథలుగా మరణించడం.. మానవతావాదులను కలిచివేస్తోంది. 
     
     

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)