amp pages | Sakshi

మాధురి.. ఉద్యమ దీప్తి

Published on Sat, 07/16/2016 - 18:36

అందరిలానే ఆమె ఈ భూమిపైకి వచ్చింది. ఎదుగుతుండగా ప్రకృతి సిద్ధంగా వచ్చిన లోపాలను గుర్తించింది. తాను  ప్రత్యేకంగా ఉన్నానని గమనించింది. ఆ మేరకు తన పేరును రాజశేఖర్‌గౌడ్‌కు బదులుగా మాధురిగా మార్చుకుంది.
ప్యాంటూ, షర్ట్‌ బదులుగా లంగా, ఓణి, గాగ్రాచోలీ, పంజాబీ డ్రెస్‌లు వేయడం ప్రారంభించింది. మొదట్లో ఆమె వ్యవహార  శైలిని కుటుంబసభ్యులతో పాటు ఉపాధ్యాయులు, పలువురు విద్యార్థులు వ్యతిరేకించారు. ఆమె నుంచి ఎవరికీ  ఇబ్బంది లేకపోవడంతో  చదువుకోవడానికి ప్రోత్సహించారు. డిగ్రీ పరీక్షలు రాసేందుకు నిరాకరించగా పోరాడి  సాధించుకుంది. ఇప్పుడు పీజీ అడ్మిషన్‌నూ నిరాకరిస్తున్నారు. ఆమెతో ఉన్న సమాజం మారి ప్రోత్సహిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. హిజ్రాలకు విద్య, ఉద్యోగ అవకాశం కోసం మాధురి ఉద్యమం  ప్రారంభిస్తోంది.



కర్నూలు : మిడుతూరు మండలం వీపనగండ్ల గ్రామానికి చెందిన కె. మాధురి(రాజశేఖర్‌గౌడ్‌) తల్లిదండ్రులతో పాటు  అక్క, అన్న ఉన్నారు. ఆమె 7వ తరగతి వరకు స్వగ్రామంలోనే చదువుకుంది. 8 నుంచి 10వ తరగతి వరకు  మిడుతూరులోని గాం«ధీ మెమోరియల్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అభ్యసించింది. ఆ తర్వాత ఇంటర్‌ మీడియట్,  డిగ్రీలను నందికొట్కూరులోని సాయిరామ్‌ డిగ్రీ కళాశాలలో పూర్తి చేసింది. అయితే బాల్యం నుంచే మగపిల్లలకన్నా  ఆమె ఆడపిల్లలతోనే ఎక్కువగా ఆడుకునేది. టీనేజి వయస్సు వచ్చాక అమ్మాయి లక్షణాలు కనిపించాయి. అప్పటి  నుంచి ఆమె స్త్రీలు ధరించే వస్త్రాలు ధరించడం మొదలుపెట్టింది. ఈ దశలో మొదట్లో పాఠశాల ఉపాధ్యాయులు  వ్యతిరేకించినా తర్వాత ఆమె నుంచి ఎవ్వరికీ ఇబ్బంది లేకపోవడంతో అనుశాలు కల్పించేందుకు జీవోలు జారీ  మతించారు. పదో తరగతి చదువుతుండగానే ఆమె ముంబయి వెళ్లి లింగమార్పిడి ఆపరేషన్‌ చేయించుకుంది. ఇది  తెలిసి ఆమె తండ్రి రెండేళ్ల వరకు మాట్లాడటం మానేశారు. ఆ తర్వాత అర్థం చేసుకుని ఆమె అభివృద్ధికి ప్రోత్సాహం  అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రుల వద్దే స్వగ్రామంలో నివసిస్తోంది.

డిగ్రీ పరీక్షలు రాసేందుకు నిరాకరణ
డిగ్రీలో చేరేందుకు కళాశాల యాజమాన్యం అనుమతించలేదు. దీంతో ఆమె రాయలసీమ యూనివర్సిటీ  అధికారులతో పాటు లోక్‌అదాలత్‌ కోర్టును ఆశ్రయించింది. 8–2–2011 తేదిన జారీ చేసిన జీవో ఎంఎస్‌ నెం. 653 ప్రకారం  ఆమెకు విద్యాభ్యాసం చేసేందుకు అనుమతివ్వాలని కోర్టు మందలించింది. దీంతో మాధురి డిగ్రీ పరీక్షలు  రాయగలిగింది.

పీజీ అడ్మిషన్‌ కోసం ఉద్యమం
డిగ్రీ పూర్తి చేసుకున్న మాధురి ఆపై పీజీ చేయాలని కలలు కంది. 2015, 2016లలో వరుసగా రెండుసార్లు పీజీ సెట్‌  పరీక్ష రాసి మంచి ర్యాంకును తెచ్చుకుంది. అయితే ఆమెను అడ్మిషన్‌ సమయంలోనే యూనివర్సిటీ అధికారులు  నిరాకరించారు. మేల్‌గా సీటిస్తాము గానీ ట్రాన్స్‌జెండర్‌(హిజ్రా)కు ఇవ్వలేమని తెగేసి చెప్పారు. దీంతో తనకు ఉన్నత  విద్యాభ్యాసం చదువుకునేందుకు అనుమతివ్వాలని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితోపాటు స్థానిక ఎమ్మెల్యే  ఐజయ్య, జెడ్పీ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌గౌడ్, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ను కలిసి విన్నవించినా ఫలితం  లేకపోయింది. ఎవరి వద్దకు వెళ్లినా ప్రయత్నం చేస్తామని చెప్పడమే గానీ ఆమె పోరాటానికి ఫలితం దక్కడం లేదు.  ప్రభుత్వం జీవో చేస్తే తప్ప తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ఇందుకోసం తాను ఉద్యమం చేయడానికి  సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. తనకు సీటు రాకపోయినా తనలాంటి వారికోసమైనా పోరాటం చేస్తానని ఆమె  చెబుతోంది.

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కావాలన్నదే లక్ష్యం
'సబ్‌ ఇన్‌స్పెక్టర్‌  కావాలన్నదే నా లక్ష్యం. ఇందుకు ప్రతిరోజూ గ్రామంలో రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాను. నాపై ఎవరూ  వివక్ష చూపడం లేదు. నన్ను ప్రోత్సహిస్తున్నారు. అలాగే ప్రభుత్వమూ స్పందించాలి. నాకు ఓటుహక్కుతో పాటు  ఆధార్‌కార్డు ఉంది. ఓటు వేసే హక్కు ఉన్నప్పుడు విద్య, ఉద్యోగ అవకాశాలు ఎందుకు కల్పించరు. కేంద్ర ప్రభుత్వంతో  పాటు తమిళనాడు ప్రభుత్వమూ మాలాంటిæ వారికి విద్య, ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. అలాగే రాష్ట్ర  ప్రభుత్వమూ సహకరించి ఆదుకోవాలి' అని చెబుతోంది మాధురి.
 

Videos

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)