amp pages | Sakshi

ప్రధాని పర్యటనకు భారీ బందోబస్తు

Published on Fri, 08/05/2016 - 19:50

ఈ నెల 7న రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాష్ట్ర పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. గజ్వేల్ బహిరంగ సభకు దాదాపు నాలుగు వేల మంది పోలీసు సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టారు. గజ్వేల్‌లో ప్రధాని పర్యటనను పర్యవేక్షించడానికి స్వయంగా ఒక అదనపు డీజీ ర్యాంకు కలిగిన అధికారితో పాటు ఇద్దరు ఐజీలను, ఒక డీఐజీ, నలుగురు ఎస్పీలకు బాధ్యతలు అప్పగించారు.

 

అదే రోజు సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే బీజేపీ బహిరంగ సభకు 15వందల పోలీసు మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసి... పర్యవేక్షణ బాధ్యతను నగర కమిషనర్లకు అప్పగించారు. అదే విధంగా ఢిల్లీ నుంచి కూడా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రధాని పాల్గొనే కార్యక్రమాల బందోబస్తును ప్రతీ నిముషాన్ని ఎస్పీజీ స్వయంగా పర్యవేక్షించనుంది. అలాగే ప్రధాని కాన్వాయితో పాటు సభ ప్రాంగణాన్ని ఎస్పీజీ ఇప్పటికే తమ ఆదీనంలోకి తీసుకుంది. ఈ నెల 7న ప్రధాని ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి నేరుగా... గజ్వేల్ వెళ్లేందుకు నాలుగు ప్రత్యేక హెలికాప్టర్లను ఎస్పీజీ సిద్ధం చేసింది.

 

వీటిలో ఒక దానిలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు సీఎం కేసీఆర్, ఇద్దరు ప్రత్యేక భద్రతా సిబ్బంది ప్రయాణించనున్నారు. మరో హెలికాప్టర్‌లో డీజీపీ అనురాగ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తదితరులు వెళ్లనున్నారు. మూడవ హెలికాప్టర్‌లో పూర్తిగా ప్రధాని భద్రతా సిబ్బంది వెళ్లనున్నారు. మరో హెలికాప్టర్‌ను రిజర్వులో ఉంచనున్నారు. ప్రధాని కాన్వాయ్ కోసం ఢిల్లీ నుంచి రెండు ప్రత్యేక వాహనాలు తెప్పించారు. అలాగే కాన్వాయ్‌కు సంబంధించి పోలీసు శాఖ శుక్రవారం నుంచే రిహార్సల్స్ ప్రారంభించారు.

Videos

నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్

సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..

బూతు అస్త్రం ప్రయోగిస్తున్న బాబు

టీడీపీ నేతకు బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్

నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు

ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఉదాహరణలతో వివరించిన సీఎం జగన్

ఆంధ్రా అతలాకుతలం..

విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం..

ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు

అకాల వర్షం..అపార నష్టం

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?