amp pages | Sakshi

కొత్త ఎంఈవోలొచ్చారు..

Published on Thu, 02/09/2017 - 02:17

ఏలూరు సిటీ : జిల్లాలో మండల విద్యాశాఖ అధికారుల (ఎంఈవో) పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్‌ జరిగింది. జిల్లావ్యాప్తంగా అర్హులైన ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సీనియార్టీ ఆధారంగా మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈవో)గా నియామకాలు చేపట్టారు. స్థానిక సర్వశిక్ష అభియాన్‌ జిల్లా కార్యాలయంలోని సమావేశమందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి.మధుసూదనరావు బుధవారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకూ కౌన్సెలింగ్‌ నిర్వహించి ఆయా మండలాలకు సంబంధించి ఎంఈవో పోస్టులను భర్తీ చేశారు.
 
చింతమనేని పేరుతో భయపెట్టిన యూనియన్‌
దెందులూరు నియోజకవర్గంలోని ఎంఈవో పోస్టులకు సంబంధించి ఒక ఉపాధ్యాయ సంఘానికి చెందిన నాయకులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అనుమతి లేకుండా ఇక్కడకు వస్తే ఇబ్బందులు తప్పవంటూ ఎమ్మెల్యే తరఫున వకాల్తా పుచ్చుకుని ప్రధానోపాధ్యాయులను భయపెట్టారు. ఈ నియోజకవర్గంలో దెందులూరు ఎంఈవో పోస్టు భర్తీ చేయగా, పెదపాడు ఎంఈవో పోస్టు మాత్రం ఖాళీగా మిగిలిపోయింది. ఇలా ఎమ్మెల్యే పేరు చెప్పి ప్రధానోపాధ్యాయులను భయపెట్టేందుకు ప్రయత్నించటాన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తప్పుబట్టారు. జిల్లాలో 42 ఎంఈవో పోస్టులు భర్తీ కాగా మూడు పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. 
 
3 ఎంఈవో, ఒక డీఐ పోస్టు ఖాళీ
జిల్లాలో ఇన్‌ఛార్‌్జల పాలనలో కొనసాగుతున్న మండల విద్యాశాఖ అ«ధికారి పోస్టుల్లో రెగ్యులర్‌ నియామకాలు చేపట్టారు. జిల్లాలో 48 మండలాల విద్యాధికారి పోస్టులు, ఏలూరు, భీమవరంలో రెండు అర్భన్‌ పాఠశాలల ఉప తనిఖీ అధికారి (డీఐ) పోస్టులు ఉన్నాయి. తాళ్లపూడి, ఆచంట మండలాలకు ఎంఈవో పోస్టులు మంజూరు కాలేదు. ఇక మిగిలిన 46 పోస్టుల్లో ఒకచోట రెగ్యులర్‌ ఎంఈవో ఉండగా 45 పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్‌  చేపట్టారు. ఈ పోస్టులకు జిల్లావ్యాప్తంగా 204 మంది అర్హత కలిగిన ప్రధానోపాధ్యాయులను కౌన్సెలింగ్‌కు పిలిచారు. సీనియార్టీ జాబితా ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టులను భర్తీ చేశారు. వీరిలో 42 మంది ఆయా మండలాలను కోరుకోగా వారికి నియామక ఉత్తర్వులను డీఈవో అందజేశారు. పెదపాడు, కుక్కునూరు, వేలేరుపాడు మండల విద్యాశాఖ అధికారి పోస్టులు మాత్రం ఖాళీగానే మిగిలిపోయాయి. ఇక ఏలూరు అర్భన్‌ డీఐ పోస్టు భర్తీ చేయగా, భీమవరం డీఐ పోస్టు ఖాళీగా ఉంది. 
 
కొత్తగా నియమితులైన ఎంఈవోలు వీరే
జంగారెడ్డిగూడెం – బి.రాముడు
ఏలూరు రూరల్‌ – కె.అన్నమ్మ
కొయ్యలగూడెం – జె.సురేష్‌బాబు
తణుకు – జి.సత్యజ్యోతి
యలమంచిలి – సీహెచ్‌ అరుణకుమారి
పోడూరు – ఎం.చిట్టిరాజు
పెంటపాడు – ఎం.శ్రీనివాస్‌
జీలుగుమిల్లి – కె.శ్రీనివాసరావు
బుట్టాయగూడెం – టి.బాబూరావు
చింతలపూడి – గుగ్గులోతు రామారావు
కామవరపుకోట – డి.సుబ్బారావు
గోపాలపురం – గుగ్గులోతు శ్రీనివాసరావు
టి.నరసాపురం – టి.రామమూర్తి
లింగపాలెం – కె.రామారావు
తాడేపల్లిగూడెం – వి.హనుమ
భీమవరం – బి.ఐజాక్‌ ఇజ్రాయెల్‌ న్యూటన్‌
కొవ్వూరు – జె.కెంపురత్నం
ఉండ్రాజవరం – వైవీ మాణిక్యాలరావు
దెందులూరు – ఎస్‌.సత్యనారాయణ
నరసాపురం – పి.పుష్పరాజ్యం
నిడదవోలు – పీవీ పాపారావు
పెదవేగి – సీహెచ్‌ బుద్ధవ్యాస్‌
చాగల్లు – వి.ఖాదిర్‌బాబు
ఇరగవరం – ఎస్‌.శ్రీనివాసరావు
అత్తిలి – ఎస్‌.నరసింహమూర్తి
పెరవలి – వి.హైమావతి
గణపవరం – పి.శేషు
భీమడోలు – వి.జయలక్ష్మి
పాలకోడేరు – ఏఏవీబీ సత్యానంద్‌
పాలకొల్లు – యం.గంగరాజు
పెనుగొండ – యం.కృష్ణారావు
కాళ్ల – డి.సీతారామరావు
పెనుమంట్ర – డి.శారదజ్యోత్స్న
దేవరపల్లి – వీఎస్‌ఎన్‌ మూర్తి
ఉంగుటూరు – డి.సుభాకరరావు
నల్లజర్ల – వీఎస్‌ రత్నకుమార్‌
పోలవరం – పి.కృష్ణ
వీరవాసరం – బి.వినాయకుడు
ద్వారకాతిరుమల – ఎస్‌.ధర్మదాస్‌
నిడమర్రు – వి.నరసింహమూర్తి
ఆకివీడు – ఎ.రవీంద్ర
మొగల్తూరు – సీహెచ్‌ లక్ష్మణప్రభాకరరావు
 

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)