amp pages | Sakshi

కట్టలు తెగిన అవినీతి

Published on Fri, 06/10/2016 - 01:18

బంధుప్రీతితో నాణ్యత గాలికి..
నిర్మాణంలోనే పగుళ్లు
►  ఇష్టారాజ్యంగా   మిషన్‌కాకతీయ పనులు
 

 
వేమనపల్లి : అతను మంచిర్యాల డివిజనల్ క్వాలిటీ కంట్రోల్ డీఈ. ఇటీవలే కాళేశ్వరం ప్రాజె క్టుకు బదిలీపై వెళ్లారు. ముల్కలపేట ఊరచెరువు నిర్మాణ పనుల కాంట్రాక్టర్‌కు సమీప బంధువు. ఈ చెరువుకు ఈ అధికారే బినామీ కాంట్రాక్టర్. అధికారుల అండదండలు, బంధుప్రీతితో చెరువు నిర్మాణ పనుల నాణ్యతను గాలికొదిశాడు. దీంతో లక్షలు వెచ్చించినా ఊరచెరువు ఆయకట్టుకు నీరందే పరిస్థితి కనిపించడం లేదు.


మిషన్ కాకతీయ పథకం కింద ప్రభుత్వం మండలానికి మొదటి విడతగా 18 చెరువుల మరమ్మతుకు నిధులు కేటాయించింది. ఇందులో ముల్కలపేట ఊరచెరువుకు రూ.27.70లక్షలు మంజూరయ్యాయి. ఈ పనులను క్యూసీ డీఈ భద్రయ్య అన్నకొడుకు (సమీప బంధువు) వరంగల్‌కు చెందిన ఓ బడా కాంట్రాక్టర్ బండారు రవికుమార్ ఈ టెండర్లో దక్కించుకున్నాడు. దీంతో వీరి బంధుత్వం నాసిరకం పనులకు అవకాశంగా మారింది. పనులను పర్యవేక్షించాల్సిన సదరు క్యూసీ డీఈ నిబంధనలు తుంగలో తొక్కాడు. ఈ మరమ్మతు పనులను స్వయంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించినా నాణ్యత ఏమాత్రం కానరావటం లేదు.

చెరువుపై నాణ్యమైన మొరం పోసి రోలింగ్ చేయాల్సి ఉండగా ఇష్టారాజ్యంగా పనులు చేశారు. దీంతో మట్టికట్ట అమాంతం కుంగిపోయి కట్ట పొడవునా పగుళ్లు తేలింది. ఇక మత్తడి నిర్మాణంలో నాణ్యతాలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మత్తడితోపాటు, కింద నిర్మించిన అప్రాన్ పొడవునా పగుళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మత్తడి అబాడ్‌మెంట్(సైడ్‌వాల్) వద్ద మట్టి నింపకపోవటంతో కుంగిపోయింది. గతేడాది కురిసిన స్వల్ప వర్షాలకే అబాడ్‌మెంట్ వద్ద గండిపడింది. విషయం బయటికి పొక్కకముందే ఆగమేఘాల మీద గండి పూడ్చివేశారు. ఇక చెరువులో కొంతమేరకు పూడిక తీ యగా పిచ్చిమొక్కలు అలాగే దర్శనమిస్తున్నా యి.

నిబంధనల ప్రకారం శిఖం ఆక్రమణలకు గురైతే రెవెన్యూ, సర్వే అధికారులు కొలతలు చేసి తొలగించాలి. కానీ శిఖం ఆక్రమణలు తొల గించలేదు. పనులు నాసిరకంగా ఉన్నా ఇప్పటికి రూ.17 లక్షల బిల్లులు చెల్లించారు. మండలంలో మిగతా 16 చెరువుల పనులు పూర్తరుునా వారికి మాత్రం బిల్లులు చెల్లించడంలో లేనిపోని ఆంక్షలు పెడుతున్నారు. బిల్లుల కోసం భారీ మొత్తంలో పర్సెంటేజీలు వసూలు చేస్తున్నట్లు కాంట్రాక్టర్‌లే ఆరోపిస్తున్నారు. ఈ చెరువు కింద ముల్కలపేట గ్రామానికి చెందిన సుమారు 160 ఎకరాల ఆయకట్టు ఉంది. నాసిరకం పనులతో పంటలు పండే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఈఈ  ఆదేశించినా..
గత నెల 22న ఊరచెరువు నిర్మాణ పనులను మిషన్‌కాకతీయ ఈఈ వెంకటేశ్వర్లు పరిశీలించారు. నాసిరకం పనులను చూసి అవాక్కయ్యా రు. పగుళ్లు తేలిన మత్తడి, అప్రాన్ వద్ద మళ్లీ మరమ్మతు చేపట్టాలని ఆదేశించారు. మట్టి కట్ట కుంగి పగుళ్లు తేలడంపై అధికారులను మందలించారు. మరమ్మతులు చేస్తేనే బిల్లులు చెల్లించాలని డీఈ, ఏఈలను ఆదేశించారు. ఇవేమీ పట్టించుకోకుండా అధికారుల అండదండలతో మత్తడి, అప్రాన్ వద్ద సిమెంట్ పూతలు పెట్టి చేతులు దులుపుకున్నారు. మిగతా మట్టికట్ట పగుళ్లు, శిఖంలో పిచ్చిమొక్కలు, శిఖం ఆక్రమణ అలాగే ఉంది. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురిస్తే చెరువులో నీళ్లు నిలవటం గగనమే అని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. మళ్లీ మరమ్మతు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.


 నాణ్యతలోపం వాస్తవమే..  - త్రినాథ్‌రావు, ఏఈ
ముల్కలపేట ఊర చెరువు పనుల్లో నాణ్యత లోపించిన మాట వాస్తవమే. మత్తడి, అప్రాన్ పగుళ్లు తేలారుు. నేను ఏఈగా మండలానికి రాకముందే అప్పటి ఏఈ వినోద్ బిల్లు పెట్టారు. సుమారు రూ.17లక్షలు ముట్టారుు. ఇంకా రూ.10లక్షల బిల్లు మరమ్మతు పూర్తి చేస్తేనే చెల్లిస్తాం.
 
 పంటలు పండేదెలా..

నాకు ఊర చెరువు కింద  ఎకరం పొలం ఉంది. పంట సాగు చేసినంక నీళ్లు ఆగకపోతే ఏం చేసుడు. మంత్రులు అచ్చి పనులు షురూ చేసిండ్లు. కాంట్రాక్టర్ అల్లాటప్ప పని చేసి బిల్లులు తీసుకున్నడు. ఇగ చెరువును చూసినోళ్లు లేరు.   - కొంపురి రమేశ్

 గండి పడ్డది..
పోరుునేడు వానలకు మత్తడి వద్ద కట్టకెళ్లి మట్టి కుంగి గండి పడ్డది. తొందరగనే గండిని పూడ్చిండ్లు. కానీ అక్కడ మళ్లీ కుంగింది.  27 లచ్చలు పెట్టి ఆదరబాదర పని చేయించ్చి ఎళ్లి పోరుుండు. చెరువు పనులు మంచిగ చేత్తనేగదా నీళ్లు ఆగి పంటలు పండేది.- పోచాగౌడ్

Videos

బాహుబలి పట్టాభిషేకం సీన్ తలపించిన సీఎం జగన్ సభ

చంద్రబాబు పై గాడిద సామెత

"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

రైతులను ఉద్దేశించి సీఎం జగన్ అద్భుత ప్రసంగం

సీఎం జగన్ మాస్ స్పీచ్ దద్దరిల్లిన కళ్యాణ దుర్గం

జనాన్ని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనైనా సీఎం జగన్

కళ్యాణదుర్గం బహిరంగ సభలో సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ముఖ్యాంశాలు

ఆ గ్యాంగ్ ను ఏకిపారేసిన వల్లభనేని వంశీ

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)