amp pages | Sakshi

సోమవారం నుంచి కానిస్టేబుల్‌ ఎంపిక పరీక్షలు

Published on Sun, 12/04/2016 - 21:46

* ఉదయం ఆరు గంటలకే ప్రారంభం
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల హాజరుకానున్న అభ్యర్థులు
 
పట్నంబజారు: కానిస్టేబుల్‌ ఎంపికకు సంబంధించి సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. గుంటూరులోని పోలీసు పెరేడ్‌ గ్రౌండ్స్‌లో అభ్యర్థులకు ఉదయం ఆరు గంటలకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే జిల్లా పోలీసు అధికారులు ఏర్పాట్లను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య, దానికి అణుగుణంగా పరీక్షల నిర్వహణ ఇప్పటికే కసరత్తు చేశారు. గత నెల 6వతేదీన కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించగా మొత్తం 41,910 మందికిగాను 36,832 మంది హాజరయ్యారు. వారిలో సుమారు 11వేల మందికిపైగా దేహదారుఢ్య, లాంగ్, హైజంప్, 100, 1600 మీటర్ల పరుగు పరీక్షలకు అర్హత సంపాదించారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి అభ్యర్థులు హాజరుకానున్నట్లు అధికారులు వెల్లడించారు. నిత్యం వెయ్యి మంది వరకు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రెండు రోజుల కిందటే రూరల్‌ జిల్లా ఎస్పీ కె.నారాయణ్‌నాయక్‌ పోలీసు పెరేడ్‌ గ్రౌండ్స్‌లోని ఏర్పాట్లు పరిశీలించి, అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థులకు అందుబాటులో గ్లూకోజ్, మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయటంతో పాటుగా, త్వరితగతిన పరీక్షలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఆదివారం పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లును పరిశీలించారు. పలువురు ఉన్నతాధికారులు పరీక్షలకు పర్యవేక్షణాధికారులుగా వ్యవహరించనున్నారు.
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)