amp pages | Sakshi

నారాయణ స్కూల్‌ విద్యార్థి ఆత్మహత్య

Published on Sat, 08/06/2016 - 07:52

హిందూపురం అర్బన్‌ : నారాయణ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదివే అఖిలేష్‌ ప్రసన్న (14) శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు. స్థానిక ఎస్‌బీఐ బ్యాంకు సమీపంలోని రైల్వేస్టేషన్‌ రోడ్డులో నివాసమున్న రంగనాయకులు పెద్ద కుమారుడు అఖిలేష్‌ ప్రసన్న గురువారం రాత్రి తన చిన్న తమ్ముడితో దివాన్‌పై పడుకునే విషయంలో గొడవపడ్డారు. తండ్రి ఇద్దరినీ మందలించాడు. దీంతో మనోవేదనకు గురైన ప్రసన్న నేరుగా వంటింట్లో వెళ్లి కూర్చుండిపోయాడు.


శుక్రవారం ఉదయం వెళ్లి చూడగా వంటింట్లో పైకప్పు కొక్కికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా విద్యార్థి తల్లి కూడా 2011లో ఇదే వంటింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య  చేసుకుంది. అలాగే ఇతని నాన్నమ్మ కూడా ఆత్మహత్య చేసుకునే తనువు చాలించారు. వన్‌టౌన్‌ ఎస్‌ఐ వెంకటేశులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Videos

సింహాచలం ఆలయంలో భక్తుల రద్దీ

కిక్కిరిసిన కర్నూల్

"కూటమి కట్టినా ఓటమి తప్పదు"

కూటమితో లాభం లేదు..

సీఎం జగన్ ఈరోజు షెడ్యూల్

బీసీ నేత ఆర్ కృష్ణయ్యపై పచ్చ రౌడీలు దాడి..

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు