amp pages | Sakshi

భారీగా పైరసీ సీడీల పట్టివేత

Published on Mon, 12/19/2016 - 22:24

 
 గుంటూరు (పట్నంబజారు) : నిబంధనలకు విరుద్ధంగా నూతన , నీలిచిత్రాలు విక్రయిస్తున్న సీడీ షాపులపై ఏక కాలంలో దాడులు చేసి గుంటూరు అర్బన్‌ పోలీసులు భారీగా సీడీలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 6 టీంలు అర్బన్‌ ఎస్పీ సర్వశ్రేష్ఠత్రిపాఠి పర్యవేక్షణలో సోమవారం రాత్రి దాడులు చేశారు. స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ శ్రీనివాసులరెడ్డి నేతృత్వంలో షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. వివరాలను ఎస్పీ సర్వశ్రేష్ఠత్రిపాఠి మీడియాకు  వెల్లడించారు. పాతగుంటూరు, పట్టాభిపురం, అరండల్‌పేట, కొత్తపేట పోలీసుస్టేషన్‌ల పరిధిలో క్విక్‌ రియాక్షన్‌ టీంతో కలిసి దాడులు చేసినట్లు తెలిపారు. కొత్తపేట పోలీసుస్టేషన్‌ పరిధిలోని నెహ్రునగర్‌లో సీడీల తయారీ కేంద్రాన్ని గుర్తించటం జరిగిందన్నారు. వాటిలో 8 క్యాబినెట్‌లు ఒక్కొక క్యాబినెట్‌ 10 డీవీడీ ట్రేలను కలిగి ఉన్నాయని, 2000 సీడీ కవర్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అరండల్‌పేట పోలీసుస్టేషన్‌ పరిధిలోని  డాల్ఫిన్‌ మ్యూజికల్‌ షాపులో 600 సినిమాలు కలిగి ఉన్న హార్డ్‌ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కొత్తపేట పోలీసుస్టేషన్‌ పరిధిలో 400 కొత్త చిత్రాల సీడీలు, 3 కంప్యూటర్లు, పాతగుంటూరు పోలీసుస్టేషన్‌ పరిధిలో సీతానగర్‌లో 1వలైనులో ఉన్న బాబు వీడియో షాపు నందు ములుపూరి మోహన్‌బాబు అనే నిర్వాహకుడి నుంచి 123 అశ్లీల, 76 కొత్త చిత్రాల సీడీలు స్వాధీనం చేసుకున్నారు. పట్టాభిపురం పోలీసుస్టేషన్‌ పరిధిలోని తుళ్లూరి శ్రీధర్‌ నుంచి 33 కొత్త సినిమాలు, 82 అశ్లీల చిత్రాల సీడీలను పట్టుకున్నారు. పట్టాభిపురం పోలీసుస్టేషన్‌ పరిధిలో కూడా 76 నూతన, 123 అశ్లీల చిత్రాలను స్వాధీనం చే సుకున్నట్లు వివరించారు. వీరిపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. వీరికి మాస్టర్‌ కాపీ ఎక్కడ నుంచి వచ్చింది, ఎవరు సాయం అందిస్తున్నారనే కోణాల్లో విచారిస్తున్నామన్నారు. ధృవ, మన్నెంపులితో అనేక కొత్త సినిమాల సీడీలను 524, అశ్లీల చిత్రాల సీడీలను 254 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.  
 
 
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌