amp pages | Sakshi

న్యాయం చేయండి.. సారో!

Published on Mon, 07/25/2016 - 21:17

జమ్మలమడుగు:
‘మా భూములు కొనుగోలు చేసే ముందు.. నష్టపోయిన రైతులకు సిమెంట్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇస్తామని దాల్మియా యాజమాన్యం చెప్పింది. ఫ్యాక్టరీ నిర్మాణం జరిగి ఉత్పత్తి కూడా అవుతోంది. యాజమాన్యం మాత్రం తమ వారికి ఉద్యోగాలు కాదు కదా, ఉపాధి అవకాశాలు కూడా చూపించడం లేదు’ అని మైలవరం మండలం నవాబుపేట గ్రామానికి చెందిన బాధితులు ఆర్డీవో కె.వినాయకం
ఎదుట వాపోయారు. సోమవారం ఆర్డీవో తన చాంబర్‌లో మీకోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో దాదాపు 30 మంది రైతులు కలిసి తమ ఆవేదనను వెలిబుచ్చారు. యాజమాన్యం రైతుల వద్ద నుంచి భూములు తీసుకుని పరిహారం ఇచ్చిందే తప్ప, తమకు ఎలాంటి ఉపాధి చూపెట్టడం లేదని వారు పేర్కొన్నారు. ఫ్యాక్టరీలో పని చేసేందుకు యాజమాన్యం ఇతర ప్రాంతాల నుంచి కార్మికులను
తెచ్చుకుంటుందని, తమ వారికి మాత్రం అన్యాయం చేస్తోందని అన్నారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ రైతుల వద్ద నుంచి యాజమాన్యం భూములు కొనుగోలు చేసి ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిందని తెలిపారు. అందరికీ ఉద్యోగావకాశాలు కల్పించాలంటే వారికి కూడా కష్టం అవుతుందని ఆయన పేర్కొన్నారు. భూములు కోల్పోయిన చాలా మందికి ఉద్యోగాలు గతంలో ఇస్తే వారు సక్రమంగా పని చేయడం లేదని, దీంతో తమ ఫ్యాక్టరీ ఉత్పత్తి కూడా తక్కువగా ఉందని, కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నామని యాజమాన్యం చెబుతోందన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లితే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. అలా కాకుండా యాజమాన్యంపై తిరుగుబాటు చేసి, పనులు చేయకుండా జీతాలు ఇవ్వాలంటే ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. అవకాశం ఏమైనా ఉంటే దాల్మియా యాజమాన్యంతో మాట్లాడి న్యాయం జరిగే విధంగా చేస్తామని ఆయన పేర్కొన్నారు.
నష్ట పరిహారం మంజూరులో అన్యాయం:
‘గ్రామ వీఆర్వో, కట్టుబడిఇంటింటికి వచ్చి మీకు మేలు జరుగుతుంది. సంతకాలు పెట్టండి. ఆర్డీవో, తహసీల్దార్‌.. మీతో మాట్లాడిన తర్వాతనే పరిహారం ఇస్తారని చెప్పడంతో సంతకాలు చేశాం. ప్రస్తుతం మాకు అన్యాయంజరిగింది’ అని జాతీయ రహదారికి భూములు, ఇళ్లు కోల్పోయిన వారు ఆర్డీవో ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణానికి సమీపంలో ఉన్న తమ భూములు, ఇళ్లు మంచి రేటు పలుకుతాయని.. అధికారులు మాత్రం తక్కువ రేటు పెట్టి తమ భూములకు నోటిఫికేషన్‌ ఇవ్వడం జరిగిందన్నారు. తమ భూములకు ఎంత నష్టపరిహారం ఇస్తారో అనే విషయాన్ని తమతో మాట్లాడకుండా అధికారులు నిర్ణయించడం ద్వారా తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రైతులతో ఆర్డీవో మాట్లాడుతూ రైతులకు సంబంధించిన భూములకు న్యాయపరంగా రావాల్సిన నష్టపరిహారం ఇచ్చామన్నారు. మూడేళ్లకు చెందిన రిజిస్ట్రేషన్‌ విలువల ఆధారంగానే ఇటీవల నష్టపరిహారం అంచనా వేసి ఇచ్చామన్నారు. రైతులకు సంబంధించిన ఐదు ఎకరాల భూమి ముద్దనూరు రహదారిలో జాతీయ రహదారికి కేటాయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం తాను ఏమి చేయలేనని, మరో వారం రోజుల్లో జమ్మలమడుగు, ముద్దనూరు, బొందల కుంటలో నష్టపోయిన రైతులతో మాట్లాడి, వారి చెప్పిన అభ్యంతరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మరింత నష్టపరిహారం పెంచేలా చేయటానికి ప్రయత్నం చేస్తానన్నారు. అంతేకాకుండా పునరావాసం కింద అదనంగా వచ్చేలా చేస్తానని వివరించారు.

Videos

Watch Live: కర్నూలులో సీఎం జగన్ ప్రచార సభ

అంతా మాయ..సేమ్ 2 సేమ్.. 2024 మోదీ ఎన్నికల స్పీచ్ పై డిబేట్

కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం

ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం

పచ్చ మద్యం స్వాధీనం..

బాబును నమ్మే ప్రసక్తే లేదు..

మహిళలపైనా పచ్చమూకల దాష్టీకం..

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ

విజయవాడలో సాక్షి ప్రజా ప్రస్థానం

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)