amp pages | Sakshi

అక్రమ డంప్‌కు అండ

Published on Tue, 03/14/2017 - 22:53

ఇసుక తీసుకెళ్తున్న కూలీలను అడ్డుకున్న పోలీసులు
ఆ ఇసుక ఇరిగేషన్‌ శాఖదట
‘ముఖ్య’ నేత రంగంలోకి దిగటంతో కూలీలకు గండి
కూలీల ఇసుక ట్రాక్టర్లపై కేసుల నమోదుకు రంగం సిద్ధం


సాక్షి, అమరావతి బ్యూరో/ తుళ్లూరు రూరల్‌ : కృష్ణానదిలోని ఇసుక చుట్టూ రాజకీయం నడుస్తోంది. అధికార పార్టీ నేతలు కొందరు సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి కృష్ణా నదిలో భారీగా డంప్‌ చేశారు. వారిపై కన్నెత్తి చూడని పోలీసులు.. ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో ఉచిత ఇసుకను తరలిస్తూ ఉపాధి పొందుతున్న కూలీలను సోమవారం అడ్డుకున్నారు. డంప్‌ చేసిన ఇసుక ఇరిగేషన్‌ శాఖదని ప్రకటించారు. ఇసుక తరలింపుపై ఇరిగేషన్‌ అధికారులు ఫిర్యాదు చేసినందున కూలీలను అడ్డుకున్నామని గుంటూరు రూరల్‌ ఎస్పీ నారాయణ నాయక్‌ తెలిపారు. డంప్‌ చేసిన ఇసుకను తరలించడానికి వీల్లేదని కూలీలను వెళ్లగొట్టిన పోలీసులు కొందరు కూలీలు సహా ట్రాక్టర్లపై కేసుల నమోదుకు రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది.

డ్రెడ్జర్లతో తవ్వకాలు...
రాజధాని ప్రాంతంలోని లింగాయపాలెం, రాయపూడి సమీపంలోని కృష్ణా నదిలో కొద్దిరోజుల కిందట గుర్తు తెలియని వ్యక్తులు డ్రెడ్జర్లతో భారీ ఎత్తున ఇసుకను తవ్వుతున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై ‘సాక్షి’ పలుమార్లు కథనాలు ప్రచురిం చింది. సుప్రీం కోర్టు హెచ్చరించినా అక్రమార్కులు భారీ యంత్రాలతో ఇసుకను తవ్వుతూనే ఉండటం గమనార్హం. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో 20 అడుగుల ఎత్తున ఇసుకను డంప్‌ చేశారు. ఈ విషయమై డ్రెడ్జర్లతో తవ్వుతున్న వారిని అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించినా, వారి నుంచి సమాధానం లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలతో కొద్దికాలంగా ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి.

ఇసుక ద్వారా ఉపాధి పొందుతున్న కూలీలు
రాజధాని కోసం భూములు త్యాగం చేసి పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్న కూలీలు ఇసుక ద్వారా ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం ఇసుక ఉచితమేనని ప్రకటించిన నేపథ్యంలో నదిలోని ఇసుకను తరలిస్తూ ఉపాధి పొందుతున్నారు. వారం రోజులుగా కొందరు కూలీలు ఇసుకను గృహావసరాల కోసం తీసుకెళ్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాఫియా నేతల అనుచరులు ఆ ప్రాంతానికి వచ్చి పలుమార్లు కూలీలను హెచ్చరిం చారు. అయితే కూలీలు ప్రభుత్వం ఇసుకను ఉచితమని చెప్పిందనే విషయాన్ని గుర్తు చేశారు. భారీగా డంప్‌ చేసిన ఇసుక ఎవరిదని పలుమార్లు అడిగినా వారి నుంచి సరైన సమాధానం లేదు. భారీ యంత్రాలతో ఇసుకను డంప్‌ చేయటానికి ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించినా నోరెత్తలేదు. పోలీసులు కూడా వచ్చి కూలీలను ఆరా తీశారు. ఇసుక ఉచితమే కదా? అని చెప్పటంతో పోలీసులు అడ్డుచెప్పలేదు.

‘ముఖ్య’ నేత ఆదేశాల మేరకు
టీడీపీకి చెందిన ఓ ‘ముఖ్య’ నేత ఆదేశాల మేరకు సోమవారం పోలీసులు రంగంలోకి దిగినట్లు కూలీలు చెబుతున్నారు. బలవంతంగా తమను తోసివేసినట్లు కూలీలు కన్నీరుపెట్టుకున్నారు. ఉపాధి లేక తీవ్ర ఇబ్బం దులు పడుతున్న సమయంలో ఇసుకను తరలించి ఉపశమనం పొందుతుంటే పోలీసులు అడ్డుకోవడం న్యాయమేనా? అని ప్రశ్నించారు. అత్యున్నత న్యాయస్థానం నదుల్లో ఉన్న ఇసుకను యంత్రాలతో తవ్వకూడదని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జాతీయ ఎస్సీ కమిషన్‌ కూడా ఇసుక అక్రమతవ్వకాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా అధికార పార్టీ నేతలు పోలీసుల అండదండలతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డులేకుండా చేసుకుం టున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భారీ ఇసుక డంప్‌ వెనుక అధికార పార్టీ నేతలు
కృష్ణా నది ఒడ్డున భారీగా డంప్‌ చేసిన ఇసుక వెనుక ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే, తుళ్లూరు మండల పరిధిలోని ఇద్దరు టీడీపీ నాయకులు ఉన్నారని విశ్వసనీయ సమాచారం. 10 ఎకరాల విస్తీర్ణంలో డంప్‌ చేసిన ఇసుకలో సగభాగం ఓ ప్రైవేటు కాంట్రాక్టర్‌కు రూ.15 కోట్లకు విక్రయించినట్లు తెలిసింది. మరో సగ భాగం ఇసుకను రూ.25 కోట్లకు విక్రయించేందుకు రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కూలీలు ఇసుకను తీసుకెళ్తే తమ పరిస్థితేమిటని ఇసుక కాంట్రక్టర్లు అధికార పార్టీ ‘ముఖ్య’ నేత వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు అధికారి ఒకరు వెల్లడించారు.

అధికారుల వత్తాసూ వారికే ...
నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా కుటుంబ సభ్యులు, నేను ఇసుక పని చేసుకుంటూనే జీవనం సాగించాం. రెండేళ్లుగా పరిస్థితి తారుమారైంది. రాజధాని ప్రకటనతో రాజకీయ రాబందులు మా నోటి దగ్గర కూడు లాగేసుకుంటున్నాయి. ఆఖరికి న్యాయం చేయాల్సిన అధికారులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారు. బడుగు వర్గాల్లో పుట్టడమే పాపమా?
– జొన్నకూటి రాజేష్, కూలీ

మాట్లాడే హక్కు లేదా?
ఈ రెండేళ్లలో పనులు లేక పస్తులు ఉంటున్నాం. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలతో ఇసుక ద్వారా ఉపాధి కలిగింది. అయితే పోలీసులు మా కడుపు కొడుతున్నారు. ట్రిబ్యునల్‌ ఎక్కడైనా ఇసుక తవ్వుకోవచ్చని, యంత్రాలు వాడొద్దని సూచించింది. అయితే జిల్లా స్థాయి పోలీసు అధికారి ఇసుక తవ్వకూడదు, అరెస్టు చేస్తాం అంటే ఎలా? మాకు మాట్లాడే హక్కు లేదా?
– యడ్ల రాఘవులు, కూలీ

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌