amp pages | Sakshi

తూకం.. మోసం !

Published on Thu, 12/15/2016 - 21:58

 
- యథావిధిగా ప్రజాపంపిణీలో అక్రమాలు
- ఈ-పాస్‌ మిషన్‌లను ఎలక్ట్రానిక్‌ కాటాలతో అనుసంధానం చేసినా దగానే
- కాసుల పంట పండించుకుంటున్న డీలర్లు
- నష్టపోతున్న కార్డుదారులు
 
 
 
కర్నూలు (అగ్రికల్చర్‌):
నిత్యావసర సరుకుల పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నా కొందరు డీలర్లు మాత్రం తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. అధికారులు ఎప్పుడుకప్పుడు అక్రమాల గుట్టురట్టు చేస్తున్నా వారి పంథా మారడం లేదు. నిన్నటి వరకు ఈ–పాస్‌ మిషన్‌లతో ప్రజా పంపిణీలో అక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయని, కోట్లాది రూపాయల సరుకులు ఆదా అవుతున్నాయని పాలకులు చెబుతూ వచ్చారు. అయితే కర్నూలులో సహా వివిధ జిల్లాలో డీలర్లు ఈ–పాస్‌ మిషన్‌లను ౖ»ñ పాస్‌ చేసి పేదల బియ్యాన్ని స్వాహా చేసిన కుంభకోణం బయట పడటంతో పాలకులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఈ–పాస్‌ మిషన్‌లతో ఎలక్రా​‍్టనిక్‌  కాటాలను అనుసంధానం చేయడంతో తూకాల్లో దగా చేసే అవకాశమే లేదని, కచ్చితమైన తూకాల్లో సరుకులు ఇస్తున్నామని ఇంతవరకు అధికారులు భావిస్తూ వచ్చారు. ఈ–పాస్‌ మిషన్‌లతో కాటాలకు లింకప్‌ చేసినా డీలర్లు తమ చేతివాటంతో బియ్యాన్ని కాజేస్తున్నారు. జిల్లాలో 3422 మంది డీలర్లు ఉండగా 50శాతం పైగా డీలర్లు మోసానికి పాల్పడుతున్నట్లు స్పష్టం అవుతోంది. 
 
డబ్బాతో తూకం..
అనేక మంది డీలర్లు డబ్బాలతో బియ్యం తూకం వేస్తున్నారు. డబ్బాతో బియ్యం వేస్తున్నపుడు డబ్బా ఎంత బరువు ఉందో ముందే చెక్‌ చేసుకొని ఆ బరువుకు తగ్గట్టుగా స్కేల్‌లో మార్పులు చేసుకోవాలి. కాని లాభార్జనకు అలవాటు పడిన డీలర్లు డబ్బా బరువును బియ్యంలో చూపుతూ ఆరకిలోకు పైగా బియ్యాన్ని ఒక కార్డుపై కొల్లగొడుతున్నారు. ఒక్కో డీలరుకు 1000కి పైగా కార్డులు ఉంటాయి. ఇన్ని కార్డుల మీద తూకంలో దగా చేస్తూ బియ్యాన్ని ఏ స్థాయిలో బొక్కేస్తున్నారు..
 
తనిఖీలు నామమాత్రం
ఈ–పాస్‌ మిషన్‌లు వచ్చినా ప్రజా పంపిణీలో అక్రమాలు యథావిధిగా జరుగుతున్నా అధికారులు అరకొర దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు కూడా దృష్టి సారించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అర్బన్‌ ప్రాంతాల్లో ఏఎస్‌ఓలు, ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్లు, గ్రామీణ ప్రాంతాల్లో తహసీల్లార్లు, సీఎస్‌డీటీలు, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్లు విధిగా దుకాణాలను తనిఖీ చేసి తూకాలను పరిశీలించాలి. ఈ స్థాయిలో తనిఖీలు లేకపోవడంతో అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల కర్నూలు నగరపాలక సంస్థలో తూనికలు, కొలతల శాఖ , పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఇందులో డీలర్లు 20 కిలోల బియ్యం తూకంలో కిలో నుంచి 2 కిలోల వరకు బియ్యం కాజేస్తున్నట్లు వెలుగు చూసింది. కర్నూలులో ఆరు చౌక దుకాణాల్లో  తూకాల్లో దగా నిర్ధారణ కావడంతో సంబంధిత డీలర్లపై కేసులు కూడా నమోదు చేశారు. జిల్లా అంతటా ఇలాగే జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 10.76 లక్షల కార్డులు ఉన్నాయి. ఒకవైపు డబ్బాను ఉపయోగిస్తూ అరకిలోకు పైగా స్వాహా చేస్తుండగా, మరోవైపు చేతివాటంతో 1.50 కిలోలు కాజేస్తున్నట్లు సమాచారం..
సాంతికేతకు అందని దగా
ఎలక్ట్రానిక్‌ కాటాలను ఈ–పాస్‌ మిషన్‌లతో అనుసంధానం చేసినా తూకాల్లో డీలర్లు దగా చేస్తున్నా టెక్నాలజీ గుర్తించడం లేదు. టెక్నాలజీ అక్రమాలను పట్టలేదని డీలర్లు గుర్తించడంతో అక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ–పాస్‌ మిషన్‌లను బైపాస్‌ చేసి 60శాతం కార్డు దారులకు బియ్యం పంపిణీ చేస్తే సర్వర్‌ ద్వారా 90శాతం పైగా కార్డులకు బియ్యం పంపిణీ చేసి కాసుల పంట పండించుకున్న డీలర్లు, తూకాల్లోను అక్రమాలకు పాల్పడుతుండటం గమానార్హం. ఎక్కడ ఎలాంటి అక్రమం జరిగినా కనిపెట్టవచ్చని ప్రకటించిన పాలకులు ఈ–పాస్‌ మిషన్‌లను బైపాస్‌ చేసినా, తూకాల్లో దగా చేస్తున్నా టెక్నాలజీ గుర్తించలేకపోవడంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయడం ఎలా అనేది ప్రశ్నార్థకమైంది.   
 

Videos

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"

రాజంపేట లో అశేష ప్రజా స్పందన

కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు

గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు

సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు