amp pages | Sakshi

ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నిర్మాణం దారుణం

Published on Fri, 11/04/2016 - 22:47

 భీమవరం అర్బన్‌ : ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్కు నిర్మాణం చేపట్టడం హేయమైన చర్యని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని అన్నారు. భీమవరం మండలంలోని తుందుర్రులో ఫుడ్‌పార్కు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడి జైలుపాలై ఇటీవల విడుదలైన పోరాట కమిటీ నాయకులు ఆరేటి వాసు, ఆరేటి సత్యవతి, సముద్రాల వెంకటేశ్వర్లు, కోయ మహేష్, బెల్లపు వెంకట సుబ్రహ్మణ్యంలను శుక్రవారం వైఎస్సార్‌ సీపీ నాయకుల బృందం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ సుమారు మూడు మండలాల ప్రజలు వ్యతిరేకిస్తున్నా మొండిగా ఫుడ్‌పార్కు నిర్మాణ చేపట్టడం దారుణమన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఫుడ్‌పార్క్‌ నిర్మాణం వద్దంటూ పోరాడుతుంటే వారికి నాయకత్వం వహించిన పోరాట కమిటీ నాయకులపై అన్యాయంగా, అక్రమంగా కేసులు బనాయించి అమాయకులను జైళ్లకు పంపడంపై రాష్ట్రం మొత్తం నివ్వెరపోయిందన్నారు. దీంతో పోరాట కమిటీ నాయకులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుగా నిలిచిందని గుర్తుచేశారు. 
ఎప్పటికప్పుడు వైఎస్‌ జగన్‌ ఆరా
ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు తుందుర్రు ఫ్యాక్టరీ, బాధిత గ్రామాల గురించి ఆరా తీస్తున్నారని, ఇప్పుడు కూడా జైలు నుంచి విడుదలైన వారిని పార్టీ తరఫున బృందం వెళ్లి పరామర్శించి రావాలని చెప్పారన్నారు. దీంతో తాము వచ్చినట్టు చెప్పారు. మీకు ఏ ఇబ్బందైనా తలెత్తితే  నరసాపురం, భీమవరం నియోజకవర్గ సమన్వయకర్తలు ముదునూరి ప్రసాదరాజు, గ్రంధి శ్రీనివాస్‌లు అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు. 
ఉద్యమంపై వెనుకడుగు వేయం : పోరాట కన్వీనర్‌ ఆరేటి వాసు
ఉద్యమంపై వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని పోరాట కమిటీ కన్వీనర్‌ ఆరేటి వాసు స్పష్టం చేశారు. మా ఉద్యమానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు ఇచ్చి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చారన్నారు. మాపై జగనన్న ఎప్పటికప్పుడు ఆరా తీసి క్షేమ సమాచారాన్ని తెలుసుకుని మా వెన్నెంటే ఉంటున్న వైఎస్సార్‌ సీపీ నాయకులకు కృతజ్ఞతలు చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు, భీమవరం, నరసాపురం, తణుకు నియోజకవర్గాల సమన్వయకర్తలు గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వంక రవీంద్ర, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.కాశీరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పేరిచర్ల నరసింహరాజు, నాయకులు కాండ్రేకుల నరసింహరావు,  జడ్డు తాతయ్య, జవ్వాది సత్యనారాయణ, కొట్టు త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. 
 
 
 

Videos

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"

రాజంపేట లో అశేష ప్రజా స్పందన

కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు

గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు

సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

Photos

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)