amp pages | Sakshi

సమస్యల జడివాన

Published on Sun, 07/24/2016 - 00:09

  • నేడు జిల్లాపరిషత్‌
  • సర్వసభ్య సమావేశం
  • జిల్లాలోని ప్రధాన
  • అంశాలపై చర్చ
  • ఖమ్మం జెడ్పీసెంటర్‌: అసలే ఇది వర్షాకాలపు సీజన్‌. పారిశుద్ధ్యం లోపిస్తే వ్యాధులు విజృంభిస్తాయి. కానీ, ఏజెన్సీలో.. పల్లెల్లో ఎక్కడ చూసినా అపారిశుద్ధ్యమే. రుణ మాఫీ కోసం రైతుల ఎదురుచూపులు. ఎంతోమంది పేదలను ఊరిస్తున్న డబుల్‌ బెడ్రూం పథకం ఇంకా టెండర్లకు నోచుకోలేదు. దళితులకు భూపంపిణీ అటకెక్కింది. నిధులు లేకపోవడంతో స్థానిక సంస్థలు నీరసిస్తున్నాయి. ఆదివారం జరగనున్న జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమవేశంలో ఈ సమస్యలన్నీ 
    జడివానలాగా కురుస్తాయేమో..!
    జిల్లాలోని ప్రధాన సమస్యలపై చర్చిం చేందుకు ఆదివారం ఉదయం 10 గంటలకు జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశం చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత అధ్యక్షతన జిల్లాపరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో జరగనుంది. ఎజెండాలో మాత్రం కేవలం నాలుగు అంశాలే (విద్య, వైద్య, వ్యవసాయం, హరితహారం) చేర్చారు. వీటితోపాటు ఇతరత్రా ముఖ్య సమస్యలను కూడా సమావేశం దృష్టికి తెచ్చేందుకు ప్రజాప్రతినిధులు సిద్ధమయ్యారు. రాజీవ్‌సాగర్, ఇం దిరా సాగర్‌ ప్రాజెక్టుల పేర్ల మార్పును కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు లేవనెత్తే అవకాశముంది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో జిల్లాపరిషత్‌.. స్థానిక సంస్థల ప్రతినిధుల భవితవ్యంపై కూడా సభ్యులు ప్రస్తావిస్తారని సమాచారం. జెడ్పీ పాలకవర్గ సమావేశ నేపథ్యంలో జిల్లాలోని కొన్ని ప్రధాన సమస్యల పరిశీలనే ఈ కథనం.
    వ్యాధులు, అపారిశుద్ధ్యం
    వర్షాకాలపు సీజన్‌తోనే వ్యాధులు కూడా వచ్చాయి. ఏజెన్సీలో అనేకమంది మంచం పటా ్టరు. ఈ పరిస్థితిని వైద్యారోగ్య శాఖ ముందుగానే ఊహించినప్పటికీ ముందస్తుగానీ, ఆ తరువాతగానీ నివారణ చర్యలు చేపట్టలేదు. వర్షాకాలపు సీజన్‌ వ్యాధులకు కారణమైన దోమల వృద్ధికి తగ్గట్టుగా అపారిశుద్ధ్యం నెలకొంది. పల్లెల్లోని రోడ్లన్నీ చిత్తడి చిత్తడిగా మారాయి. చెత్తాచెదారం పేరుకుపోయింది. తాగునీరు కలుషితమవుతోంది. గ్రామజ్యోతి పథకం కింద వేసిన ఏడు కమిటీలలో ఒకటైన శానిటేషన్‌ కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు.
    అందని రుణం.. అప్పుల ఊబి
    రుణ మాఫీ పథకం అమలులో వైఫల్యం కారణంగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మూడోవిడత రుణ మాఫీ నిధులు పూర్తిస్థాయిలో రాలేదు. ఇప్పటికే వచ్చిన రుణాన్ని బ్యాంకర్లు పాత అప్పు, వడ్డీ కింద జమ చేసుకున్నారు. దీంతో రైతులు పంట పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. తాళి బొట్టు తాకట్టుపెట్టి ఎరువులు, పురుగు మందులు కొంటున్నారు.
    విద్యారంగం.. గందరగోళం
    జిల్లాలో విద్యారంగం పరిస్థితి గందరగోళంగా మారింది. ఒకవైపు ఉపాధ్యాయుల కొరత, మరోవైపు విద్యావలంటీర్లను నియమించకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారు. అనేక పాఠశాలల్లో మరుగుదొడ్లు, ఇతరత్రా మౌలిక సదుపాయాలు లేవు. 37 ఎంఈఓఓ, మూడు డిప్యూటీ డీఈఓ పోస్టులు ఖాళీగా ఉండడంతో పాఠశాలలపై పర్యవేక్షణ లోపించింది. కొన్నిచోట్ల ఇంగ్లీష్‌ మీడియం బోధించేందుకు ఉపాధ్యాయులు లేరు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
    హరీ..తం
    హరితహారం కింద పెద్దఎత్తున మొక్కలు నాటుతున్నారు. వాటి రక్షణకు ట్రీ గార్డులు ఏర్పాటు చేయడం లేదు. పెరిగి పెద్దవయ్యేంత వరకు అవి ఉంటాయన్న నమ్మకం లేదు. పండ్ల మొక్కలు అడిగినా ఇవ్వడం లేదని కొన్నిచోట్ల విమర్శలు వస్తున్నాయి.
    రేష¯Œæకు రెక్కలు
    రేషన్‌ బియ్యానికి రెక్కలు వస్తున్నాయి. పక్క రాష్ట్రానికి అక్రమ రవాణా సాగుతోంది. రైస్‌ మిల్లర్లు రేషన్‌ బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి అధిక ధరకు అమ్ముతున్నారు. పౌర సరఫరాల శాఖకు ఇదంతా తెలిసినప్పటికీ ఏమాత్రం చలించడం లేదని, పైగా అక్రమార్కులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి. నీలి కిరోసిన్‌ను కూడా అక్రమార్కులు దొడ్డిదోవన తరలిస్తున్నారు.
    దళితులను వెక్కిరిస్తున్న భూపంపిణీ
    మూడెకరాల భూపంపిణీ పథకం.. దళితులను వెక్కిరిస్తోంది. ఈ పథకంపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. భూపంపిణీతో తమ బతుకులు బాగుపడతాయని ఆశపడిన నిరుపేద దళితులు.. ఇప్పుడు తీవ్ర నిరాశ నిస్పృహతో ఉన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు భూములు అమ్మేందుకు రైతులు ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు.
    ఊరిస్తున్న ‘డబుల్‌’
    డబుల్‌ బెడ్‌ రూం పథకం.. గూడు లేని అనేకమంది పేదలను ఇంకా ఊరిస్తూనే ఉంది. డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి జిల్లాలో ఇప్పటివరకు టెండర్లు కూడా పిలవలేదు. తొలి విడతలో 400 ఇళ్లు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో.. అవి తమ వరకు కచ్చితంగా రావని నిశ్చితాభిప్రాయానికి వచ్చిన పేదలు.. ‘మా బతుకులిలా గూడు లేకుండానే తెల్లారతాయేమో’నని నిట్టూరుస్తున్నారు.
    నిధుల్లేక నీరసం
    జిల్లాపరిషత్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తగినన్ని నిధులు మంజూరవడం లేదు. దీంతో, జిల్లా.. మండల పరిషత్‌లు నీరసిస్తున్నాయి.
    అసంపూర్తిగా సమావేశాలు
    మూడు నెలలకోసారి నిర్వహించే జిల్లాపరిషత్‌ సాధారణ సర్వసభ్య సమావేశం అసంపూర్తిగా ముగుస్తోంది. ఎజెండాలో నాలుగైదు అంశాలను పొందుపరుస్తున్నారు. శాసన సభ్యుల ప్రసంగంతో భోజనం వేళ అవుతోంది. ఆ తర్వాత చర్చ.. రెండు మూడు అంశాలకే పరిమితమవుతోంది. మొత్తంగా, ఈ సమావేశాలు మొక్కుబడిగా సాగుతున్నాయన్న అభిప్రాయం ఏర్పడుతోంది.
     
     

#

Tags

Videos

"కూటమి కట్టినా ఓటమి తప్పదు"

కూటమితో లాభం లేదు..

సీఎం జగన్ ఈరోజు షెడ్యూల్

బీసీ నేత ఆర్ కృష్ణయ్యపై పచ్చ రౌడీలు దాడి..

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"

రాజంపేట లో అశేష ప్రజా స్పందన

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు