amp pages | Sakshi

ఉత్తమ విద్య అందించడమే లక్ష్యం

Published on Sat, 08/06/2016 - 23:59

–రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి
జడ్చర్ల : రాష్ట్రంలో ఉత్తమ విద్యను అందించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శనివారం బాదేపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో జరిగిన నియోజకవర్గ స్థాయి విద్యా సమీక్ష సమావేశంలో మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం విద్యావిధానంలో సమూల మార్పులు చేస్తుందని, కేజీ నుంచి పీజీ వరకు అమలు చేసే ఉచిత విద్య విధానంపై చర్చిస్తుందన్నారు. నేటి పరిస్థితులకు అనుగునంగా, ఉపాధి కల్పించే విధంగా వృత్తి విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కొన్ని విద్యాసంస్థలు దుర్వినియోగం చేసి అవకతవకలకు పాల్పడ్డాయని గుర్తు చేశారు. అలాంటి విద్యాసంస్థలపై చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అదనపు గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు,తాగునీరు, తదితర సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సీఎస్‌ఆర్‌ ఫండ్‌ ద్వారా 50 పాఠశాలల్లో డిజిటల్‌ తరగతి గదుల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తామన్నారు. కంప్యూటర్‌ వలంటీర్లను నియమించేందుకు కృషి చేస్తామన్నారు. వైద్య శాఖ ఆద్వర్యంలో ఆర్‌బీఎస్‌కే కింద విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కళాశాల, జెడ్పీహెచ్‌ఎస్‌ స్థాయిలో బాలికలకు శానిటరీ న్యాప్‌కిన్స్‌ అందజేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు.
 
 
అభివృద్ధికి రూ. 2కోట్లు కేటాయింపు
జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.2కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు. ఇటీవల జిల్లాలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆధ్వర్యంలో తాము సమీక్షించిన సందర్భంగా ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే రూ.కోటి కేటాయిస్తే ఇందుకు ప్రభుత్వం రూ. 3కోట్లు కేటాయించడంతో పాటు మరో కోటి నిధులను కంట్రిబ్యూషన్‌ కింద జమచేస్తుందని తెలిపారు. మొత్తం రూ. 5కోట్లతో నియోజకవర్గంలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన చేస్తుందన్నారు. అందులో భాగంగా తాము రూ. 2కోట్లు కేటాయిస్తామని తెలిపారు. సమావేశంలో ఆర్‌వీఎం పీఓ గోవిందరాజులు, డిప్యూటీ ఈఓ పాపయ్య, జెడ్పీటీసీ జయప్రద, ఎంపీపీ లక్ష్మి, ఆర్‌వీఎం డీఈఈ మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)