amp pages | Sakshi

దుకాణం నడుపుకోవాలంటే రూ.50 వేలు ఇవ్వాలి

Published on Thu, 08/25/2016 - 22:12

 
నరసరావుపేట టౌన్‌ (గుంటూరు): ‘‘రూ.50 వేలు ఇస్తేనే దుకాణం పెట్టుకో.. లేకుంటే ఆ స్థలంలో పార్టీ కార్యాలయం పెడతాను. అప్పుడు నువ్వు చేయగలిగిందేమీ లేదు.. ఏ అధికారి కూడా నా వైపు కన్నెత్తి చూడలేడు. నాకు అధికారపార్టీ అండ ఉంది. ఎన్నికల్లో చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. ఆ లోటు పూడ్చుకోవాలిగా..’’ అధికార పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్‌ భర్త ఓ దివ్యాంగురాలిని వేధిస్తున్న తీరిది..
నరసరావు పేట పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాల వెనుకభాగంలో భగీరథ గంగాభవాని అమ్మవారి ఆలయం ఉంది. ఆలయంలో దూపదీపనైవేద్యాలు చేసుకుంటూ దివ్యాంగురాలైన నంద్యాల నాగసుబ్బమ్మ కుటుంబం ఆలయం పక్కన నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. ఆలయం ద్వారా వస్తున్న ఆదాయంతో ఇల్లు గడవక పోవడంతో ఇంటి పక్కన సులభ్‌æ కాంప్లెక్స్, ఈ రెండింటి మధ్య టైలరింగ్‌ దుకాణం ఏర్పాటుచేసుకొని నాగసుబ్బమ్మ కుటుంబాన్ని సాకుతోంది. ఆ వార్డు మహిళా కౌన్సిలర్‌ భర్త కె సంజీవరావు ఆమె వద్దకు వెళ్ళి అక్కడ దుకాణం నిర్వహించుకోవాలంటే తనకు రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. తాను అడిగినంత ఇవ్వకుంటే ఆ స్థలం ఖాళీ చేయించి అక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాటుచేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమె వినకపోవడంతో బుధవారం మున్సిపల్‌ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఆక్రమణ పేరుతో తొలగించే దుకాణాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేశాడు. బాధితురాలు అ«ధికారుల చర్యను వ్యతిరేకిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో వచ్చిన సిబ్బంది వెను తిరిగారు. అయితే కౌన్సిలర్, ఆమె భర్త మాత్రం ఎలాగైనా నాగసుబ్బమ్మ  ఉంటున్న స్థలాన్ని కబ్జా చేయాలని మరింత పట్టుదలగా తమ∙ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు. మున్సిపల్‌ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి రాత్రికి రాత్రే ఇంటిని, దుకాణాన్ని నేలమట్టం చేయాలని కుట్ర పన్నుతున్నట్లు తెలిసింది. 
పదహారేళ్లుగా పన్నులు చెల్లిస్తున్నా..
– నంద్యాల నాగసుబ్బమ్మ, బాధితురాలు
ఆలయాన్ని నమ్ముకొని మూడు తరాల నుంచి మా కుటుంబం జీవిస్తోంది. భక్తుల ద్వారా వచ్చే కానుకలు ఆలయ నిర్వహణకే సరిపోకపోవడంతో టైలరింగ్‌ వత్తితో జీవనం కొనసాగిస్తున్నా. గత కొన్నిరోజులుగా కౌన్సిలర్‌ భర్త సంజీవరావు తనకు రూ.50వేలు ఇస్తేనే దుకాణం నిర్వహించుకోవాలని, లేకుంటే అక్కడ టీడీపీ కార్యాలయం ఏర్పాటుచేస్తానని బెదిరిస్తున్నాడు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇంటి, కరెంటు పన్నులు చెల్లిస్తున్నా. కేవలం కౌన్సిలర్‌ ఒత్తిడితో స్థలం ఖాళీ చేయాలని అధికారులు మమ్మల్ని బెదిరిస్తున్నారు. విషయాన్ని వికలాంగుల సంఘం రాష్ట్ర ప్రతినిధుల దష్టికి తీసుకువెళ్ళా. వారి ఆధ్వర్యంలో న్యాయపోరాటానికి సిద్ధమౌతున్నా. 
 
చర్యలు తీసుకోవాలి: ఎంఐఎం పార్టీ నేతల డిమాండ్‌ 
దివ్యాంగురాలి స్థలంపై కన్నేసిన కౌన్సిలర్, ఆమె భర్త, వారికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు షేక్‌ కరీముల్లా, ఉపాధ్యక్షుడు మస్తాన్‌ వలి, పట్టణాధ్యక్షుడు మౌలాలి డిమాండ్‌ చేశారు. నాగసుబ్బమ్మను గురువారం వారు పరామర్శించి విలేకర్లతో మాట్లాడారు. ౖటైలరింగ్‌ దుకాణం నడుపుకుంటూ పొట్ట పోసుకుంటున్న దివ్యాంగురాలి  పొట్ట కొట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. ఆ ప్రాంతంలో ఎన్నో ఆక్రమణలున్నా  వాటి జోలికి వెళ్ళకుండా కేవలం నాగసుబ్బమ్మ స్థలాన్ని కాజేయాలన్న దురుద్దేశ్యంతో కౌన్సిలర్‌ భర్త చేస్తున్న ప్రయత్నాలకు అధికారులు సహకరించడం సరికాదన్నారు. ఎవ్వరికీ అభ్యంతరం లేని ప్రదేశంలో ఆమె దుకాణం పెట్టుకొని జీవిస్తుందన్నారు. అధికార పార్టీ నేతలు, అధికారులు పద్ధతి మార్చుకోకుంటే నాగసుబ్బమ్మ చేసే న్యాయపోరాటానికి తమ పార్టీ మద్దతుగా నిలుస్తుందన్నారు. 
 

 

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)