amp pages | Sakshi

ప్రియురాలిపై వేట కొడవలితో దాడి

Published on Tue, 01/03/2017 - 01:29

  • తెగిపోయిన ఎడమ అరచెయ్యి
  • గుత్తి : అనంతపురం జిల్లా గుత్తిలో ప్రియురాలిపై ప్రియుడు వేటకొడవలితో విచక్షణారహితంగా దాడిచేశాడు. ఆమె ఎడమ అరచెయ్యి తెగిపడింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు రోడ్డులోని బ్రిడ్జి సమీపంలో నివాసముంటున్న శివకు వైఎస్సార్‌జిల్లా లక్కిరెడ్డిపల్లెకు చెందిన మహిళతో మూడేళ్ల క్రితం వివాహమైంది. మనస్పర్ధలు రావడంతో ఏడాది కిందట విడిపోయారు. అనంతరం మంచాలు అల్లేందుకు బత్తలపల్లికి వెళ్లిన శివకు అక్కడ లక్ష్మి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోఒకరికొకరు దగ్గరయ్యారు. తొమ్మిది నెలల కిందట ఆమెను శివ గుత్తికి తీసుకొచ్చి సహజీవనం చేస్తున్నాడు. కొద్ది రోజులుగా ఆమె ఇతరులతో ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుతుండటం, కొందరితో సన్నిహితంగా మెలుగుతుండటంతో సహించలేకపోయాడు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించినా ఆమెలో ఎటువంటి మార్పూ కనిపించలేదు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఒక అపరిచిత వ్యక్తితో ఇంటి వద్ద మాట్లాడుతున్న సమయంలో శివ గమనించాడు. కోపంతో ఇంటిలోని వేట కొడవలి తీసుకుని ఆమెపై విచక్షణా రహితంగా దాడిచేశాడు. లక్ష్మి ఎడమ అరచెయ్యి తెగిపడింది. తలకు బలమైన గాయమై మెదడు బయటకు వచ్చింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను స్థానికులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూల్‌కు రెఫర్‌ చేశారు. ప్రియురాలిపై దాడి చేసిన అనంతరం ప్రియుడు శివ పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మధుసూదన్‌ గౌడ్‌ చెప్పారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌