amp pages | Sakshi

యువకుడు గన్‌తో తిరుగుతున్నాడని చెప్పినా....

Published on Fri, 07/01/2016 - 08:39

  • నాలుగు రోజులపాటు ఏలూరులోనే కిరాయి హంతకులు
  •  ఓ యువకుడు గన్‌తో తిరుగుతున్నాడని ఉన్నతాధికారులకు సమాచారం అయినా పట్టించుకోని వైనం
  •  విజిబుల్ పోలీసింగ్ ఎక్కడ
  •  
    సాక్షి ప్రతినిధి, ఏలూరు/ఏలూరు సిటీ : పచ్చని ‘పశ్చిమ’ ప్రశాంతతకు మారుపేరుగా నిలిచేది. ఇది ఒకప్పటి మాట. ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా హత్యలు, దోపిడీలు, దొంగతనాలు పెద్దఎత్తున చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు నేరగాళ్లు తుపాకులు చేతబట్టి పేట్రేగిపోతున్నారు.ఎక్కడ.. ఎవరు హత్యలకు తెగబడతారో.. ఎప్పుడు తుపాకీ పేలుతుందోననే భయం జిల్లా ప్రజలను వెంటాడుతోంది.
     
    జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఏలూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఏప్రిల్ 4న న్యాయవాది పీడీఆర్ రాయల్ పట్టపగలే దారుణంగా హత్యకు గురయ్యాడు. 80 రోజుల అనంతరం అదే పోలీస్ స్టేషన్‌కు సమీపంలో తుపాకీ కాల్పుల ఘటన చోటుచేసుకోవటం చర్చనీయాంశమైంది. ఇదే ఏడాది ఫిబ్రవరిలో టూటౌన్ పరిధిలోని చేపల తూము సెంటర్‌లో చిన్నికృష్ణ అనే వ్యక్తిపై మిట్టమధ్యాహ్నం దుండగులు నడిరోడ్డుపై హత్యాయత్నం చేశారు.
     
    గడచిన 6 నెలల కాలంలో ఏలూరులో మూడు హత్యోదంతాలు చోటుచేసుకున్నాయి. ఉన్నతాధికారులతోపాటు, పోలీస్ బాస్‌లు సైతం నగరంలోనే ఉం టున్నా.. నేరస్తులు బెరుకు లేకుండా కార్యకలాపాలు సాగిస్తున్నారు.
     
    నిఘా వ్యవస్థ పనిచేస్తోందా!
    ఈ ఘటనలు చూస్తుంటే పోలీస్ నిఘా వ్యవస్థ పనిచేస్తోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పినకడిమికి చెం దిన తూరపాటి నాగరాజును మంగళవారం నడిరోడ్డుపై తుపాకీతో కాల్చి చంపేందుకు యత్నించిన ఘటన నిఘా వైఫల్యానికి అద్దం పడుతోంది. ఒక వ్యక్తి తుపాకీతో తిరుగుతున్నాడని.. కాల్పుల ఘటనకు మూడురోజుల ముందే స్థానికులు నిఘా అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.

    ఆర్‌ఆర్ పేటలోని ఓ లాడ్జిలో మకాం వేసి దుండగులు నిత్యం నాగరాజు కదలికలు గమనిస్తున్నా పోలీసులు పట్టుకోలేకపోయారు. రాజకీయ నాయకుల జోక్యం పెరిగిపోవటం వల్లే నేరస్తులకు పోలీసులంటే భయం లేకుండాపో తోందనే అభిప్రాయాన్ని పోలీస్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.  
     
     విజిబుల్ పోలీసింగ్ ఎక్కడ
     నియోజకవర్గానికి ఆరుగురు సిబ్బందితో పోలీస్ నిఘా బృందం పని చేస్తుంటుంది. నగరంలో ఎనిమిది మంది వరకూ నిఘా సిబ్బంది ఉన్నా రు. వరుస ఘటనలు జరుగుతున్నా అధికారులను అప్రమత్తం చేయటంలో ఆ వ్యవస్థ ఘోరంగా విఫలమవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో సుమారు 3.20 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఎక్కడా విజిబుల్ పోలీసింగ్ కానరావడం లేదు. రాత్రి వేళల్లోనూ గస్తీకి సిబ్బందిని కేటాయించడం కష్టంగా మారింది. ఒక బీట్ చూసే సిబ్బంది రెండు, మూడు బీట్లు కవర్ చేయాల్సిన పరిస్థితి ఉంది.
     
    నగరంలో వన్ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లకు ఒక సీఐ, టూ టౌన్‌కు ఒక సీఐ, ఐదుగురు ఎస్సైలు ఉన్నారు. వన్‌టౌన్ స్టేషన్‌లో 43మంది సిబ్బంది అవసరం కాగా, ప్రస్తుతం 40మంది పనిచేస్తున్నా రు. విధుల్లో 35మందే ఉంటున్నారు. టూటౌన్ స్టేషన్ పరిధిలో 70 సిబ్బంది అవసరం కాగా, 50మంది ఉన్నారు. వీరిలోనూ విధులు నిర్వర్తించేది 40 మందే. త్రీటౌన్ స్టేషన్‌లో 33 మంది సిబ్బందికి గానూ 31 మంది పనిచేస్తున్నారు.

    ఈ స్టేషన్ పరిధిలో కలెక్టరేట్, డీఐజీ బంగ్లా, న్యాయమూర్తుల భవనాలు, ఎస్పీ బంగ్లా ఉన్నాయి. వీటి బందోబస్తుకు 8మందికి పైగా సిబ్బందిని నియమిస్తున్నారు. మిగిలిన సిబ్బందితోనే నెట్టుకురావాల్సి ఉంది. ఒక్క ఏలూరులో కేవలం వందమంది సిబ్బందితోనే పోలీస్ వ్యవస్థ నడుస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటనలకు వస్తే పోలీస్ స్టేషన్లన్నీ ఖాళీ అవుతున్నాయి.
     

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)