amp pages | Sakshi

పోలీసుల అదుపులో సన!

Published on Mon, 11/09/2015 - 09:01

సాక్షి, హన్మకొండ/ఖమ్మం: మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతి కేసులో నాలుగో నిందితురాలిగా ఉన్న సిరిసిల్ల అనిల్ రెండో భార్య సనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సారిక మృతి కేసులో కీలక విషయాలను ఆమె నుంచి రాబట్టేందుకు పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. ఖమ్మం నగరంలో శనివారం రాత్రి సనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అధికారికంగా సోమవారం సన అరెస్టును పోలీసులు ప్రకటించే అవకాశం ఉంది.

వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో సంఘటన జరిగిన రోజు నుంచి సిరిసిల్ల అనిల్ రెండో భార్య సన పరారీలో ఉంది. సన ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఆమె ఉందనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అమె అక్కడి నుంచి పరారయ్యారని భావించి ఆచూకీ కోసం వెతుకుతున్నారు.

చివరికి ఈ నెల 7న ఖమ్మం నగరంలోని ఖిల్లాబజార్ ప్రాంతంలో సనను, ఆమె సోదరుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే, సనను అదుపులోకి తీసుకున్న విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) క్యాంపులో ఓ క్వార్టరు లో సన నుంచి వివరాలు రాబడుతున్నట్లు తెలిసింది.

కాగా, సనను అరెస్టు చేసిన విషయాన్ని ఖమ్మం జిల్లాలోని పోలీసులు ధ్రువీకరించడం లేదు.  ఖమ్మం రూరల్ మండలంలో తన బంధువుల ఇంట సనా ఆశ్రయం పొందుతున్నట్టు తెలుసుకున్న హన్మకొండ సుబేదారి పోలీసులు ఆమెను, ఆమెతో పాటు ఉన్న సోదరుణ్ని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌