amp pages | Sakshi

సురభి .. మాయాజాలం

Published on Thu, 08/04/2016 - 01:55

కెమెరా జిమ్మిక్కులు లేవు.. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌లూ లేవు.. అయినా వాటిని తలదన్నేలా మాయలు, మంత్రాలు చేశారు. రెప్ప వేసి తెరిచేలోగా ఎన్నో అద్భుతాలు సృష్టించారు. స్పెషల్‌ ఎఫెక్ట్స్‌తో రంగ స్థలంపై మంటలు పుట్టించడం, వర్షం కురిపించడం, వస్తువులను అదశ్యం చేయడం.. ఔరా అనిపించాయి. సురభి నాటకాల ప్రదర్శనలో భాగంగా మాయాబజార్‌ ప్రదర్శన సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తింది.
 
విశాఖ–కల్చరల్‌: కళాభారతి ఆడిటోరియంలో బుధవారం సురభి నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభ మయ్యాయి. రంగసాయి నాటక సంఘం నేతత్వంలో మూడు రోజులపాటు జరిగే సురభి నాటకాల ప్రదర్శనలో భాగంగా తొలిరోజు మాయాబజార్‌ నాటకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 131 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీవేంకటేశ్వర నాట్యమండలి(సురభి–హైదరాబాద్‌) కళాకారులు ప్రదర్శించిన మాయాబజార్‌ నాటకం ఆద్యంతం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. 
 
అబ్బురపరిచిన సెట్టింగ్‌లు
ఈ నాటకంలో ఘటోత్కచుడు గుహ సెట్టింగ్‌ ఆకట్టుకుంది. అభిమన్యుడు, ఘటోత్కచుడు మాయా యుద్ధంలో ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్ర ప్రభావంతో మంటలు, నీరు స్టేజ్‌పై ఆకస్మాత్తుగా రావడం ప్రేక్షకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఒకే వేదికపై శశిరేఖ–అభిమన్యుడు వేర్వేరు దశ్యాలలో విరహ గీతాలాపన మైమరిపించింది. శ్రీకృష్ణుడు, బలరాముడు, శశిరేఖ, అభిమన్యుడు, నారదుడు తదితర పాత్రల్లో ఆయా కళాకారులు చక్కటి ఆహార్యంతో తమ హావభావాలను ప్రదర్శిస్తూ పద్యాలు పాడుతూ రక్తికట్టించారు. ప్రతి కళాకారుడు మనస్సుకు హత్తుకుపోయే విధంగా ప్రదర్శించి ఆయా పాత్రల్లో లీనమైపోయారు. మల్లాది వేంకటకృష్ణ శర్మ దర్శకత్వంలో ఎ.మనోహార్, ఆర్‌.నాగేశ్వరరావు(బాబ్జీ)ల నిర్వహణలో అద్భుత దృశ్యాలు సష్టించారు. వెంకటేశ్వరరావు సారథ్యంలో 65 మంది కళాకారులు ఈ నాటకానికి జీవం పోశారు. తొలుత ఈ నాటక ప్రదర్శనను ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు, విజయ నిర్మాణ్‌ కంపెనీ అధినేత ఎస్‌.విజయకుమార్, టి.సరస్వతీదేవి, ఆదాయ పన్నుల శాఖ అధికారి హర్షవర్థన్, సురభి రథసారథి బాబ్జీ, రంగసాయి నాటక సంఘం అధ్యక్షుడు బాదంగీర్‌ సాయి తదితరులు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. 

Videos

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

Photos

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)