amp pages | Sakshi

తేలని ‘స్థానిక’ పంచాయితీ !!

Published on Sun, 02/26/2017 - 23:27

– ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై టీడీపీ మళ్లగుల్లాలు
– కాపు అభ్యర్థి వైపు చంద్రబాబు మొగ్గు
– ఆస్థాయి వ్యక్తులు జిల్లాలో లేరని చంద్రబాబుకు నేతల వివరణ
– దీపక్‌రెడ్డికి ఇప్పించేందుకు ఓ వర్గం తీవ్ర ప్రయత్నం
– సమీకరణల్లో రెడ్లకు ఇవ్వడం కష్టమంటున్న చంద్రబాబు
– తీవ్రంగా పట్టుబడుతున్న జేసీ బ్రదర్స్‌
– అభ్యర్థిపై నేడు ప్రకటన


సాక్షిప్రతినిధి, అనంతపురం
‘స్థానిక’ సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. నామినేషన్ల దాఖలుకు మంగళవారం చివరి రోజు కావడం, ఇప్పటి వరకూ అభ్యర్థి ఎంపిక జరగకపోవడంతో చంద్రబాబు ప్రకటనపై ఆపార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థి ఎంపికపై ఇప్పటికే జిల్లా నేతల అభిప్రాయాలను చంద్రబాబు తీసుకున్నారు. అయితే సామాజిక సమీకరణలు బేరీజు వేసినప్పుడు జిల్లా నేతలు సూచించే పేర్లపై చంద్రబాబు విముఖత చూపినట్లు తెలుస్తోంది. సమీకరణల్లో భాగంగా ‘అనంత’లో బలిజలకు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తే, ఆ స్థాయి వ్యక్తులు జిల్లాలో లేరని జిల్లానేతలు స్పష్టం చేశారు.  అందువల్లే ఆదివారం జరగాల్సిన అభ్యర్థి ఎంపిక సోమవారానికి వాయిదా పడింది.

    రాష్ట్ర రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే రాయలసీమలో టీడీపీ  బలహీనంగా ఉంది. దీంతో  ‘గ్రేటర్‌ రాయలసీమ’ను యూనిట్‌గా తీసుకుని ఈ ప్రాంతంపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. దీంతోనే ‘గ్రేటర్‌’ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న సామాజిక వర్గాలను టీడీపీలోకి రప్పించే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ టిక్కెట్ల కేటాయింపులో కూడా సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేశారు. ఈ అంశమే అనంతపురం అభ్యర్థి ఎంపికపై చంద్రబాబును గందరగోళంలో పడేసింది.

స్థానిక సంస్థల కోటాలో అనంతపురంలో రెండు నియోజకవర్గాలుండగా, అందులో ఓ స్థానానికి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోస్థానంలో రాయదుర్గం నుంచి మెట్టుగోవిందరెడ్డి కొనసాగుతున్నారు. ఖాళీ అయ్యే ‘మెట్టు’ స్థానానికే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి తనకే టిక్కెట్టు ఇవ్వాలని గోవిందరెడ్డి చంద్రబాబును సంప్రదించారు. తనకు మద్దతు ఇవ్వాలని జిల్లా నేతలను కూడా ఆయన కోరారు. అయితే తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తన అల్లుడు దీపక్‌రెడ్డికి ఈసారి ఎమ్మెల్సీ టికెట్‌ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే దీపక్‌ రెడ్డి టిక్కెట్టు ఆశించగా, అతన్ని కాదని కాలవ శ్రీనివాసులకు పార్టీ టిక్కెట్టు ఇచ్చింది. దీంతో ఇపుడు దీపక్‌కు ఎమ్మెల్సీ టిక్కెట్టు ఇవ్వాలని ఓవర్గం నేతలు చంద్రబాబుపై వత్తిడి తెస్తున్నారు.

ఎంపికలో సామాజిక చిక్కులు
కడపలో సతీశ్‌రెడ్డి, ఒంగోలులో మాగుంట శ్రీనివాసరెడ్డి, నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్‌ జిల్లా నుంచి మారెడ్డి రవీంద్రనాథరెడ్డి(బీటెక్‌రవి)ని ఎంపిక చేశారు. నెల్లూరు, కర్నూలులో కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను ఎంపిక చేయాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. దీంతో ‘అనంత’లో దీపక్‌రెడ్డికి ఇవ్వడం కష్టమని, బలిజ సామాజికవర్గం నుంచి పేరు సూచించాలని పార్టీ నేతలతో బాబు చెప్పినట్లు తెలిసింది. ఈ సామాజికవర్గంలో లక్ష్మీపతి, ఆదెన్నలు టిక్కెట్టు ఆశిస్తున్నారు.

అయితే జిల్లాలో ఎమ్మెల్సీ స్థాయి నేతలు బలిజ సామాజికవర్గంలో లేరని జిల్లా నేతలు బాబుకు సూచించినట్లు తెలిసింది. ఈ క్రమంలో గడ్డం సుబ్రహ్మణ్యం పేరు తెరపైకి వచ్చింది. కమ్మ సామాజిక వర్గానికి కోటాకు మించి జిల్లాలో ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చామని, అదే సామాజిక వర్గానికి చెందిన కేశవ్‌ ఎమ్మెల్సీగా ఉన్నారని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. పైగా ధర్మవరం నియోజకవర్గానికి చెందిన సుబ్రహ్మణ్యం, తనకు వ్యతిరేకంగా పనిచేశారని, 2014 ఎన్నికల్లో కనీసం పార్టీకి ఓటు కూడా వేయలేదని సూరి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని సుబ్రహ్మణ్యం అభ్యర్థిత్వాన్ని తోసిపుచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో మైనార్టీ అభ్యర్థిని ఎంపిక చేయాలని పరిశీలించగా, అబ్దుల్‌ ఘనీకి బాలయ్య అడ్డుపడినట్లు తెలిసింది. తన నియోజకవర్గంలో మరో ‘పవర్‌సెంటర్‌’ అవసరం లేదని బాలయ్య చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అవసరమైతే పార్టీని వీడతానని ఘనీ గట్టిగానే తన వాదన చెప్పినట్లు సమాచారం. అయినప్పటికీ ఘనీ అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకోలేదు.

 ఈ క్రమంలో జేసీ బ్రదర్స్‌ మాత్రం దీపక్‌రెడ్డికి టిక్కెట్టు ఇప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ కూడా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి వరకూ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు జిల్లా నేతలతో రాత్రి వరకూ మాట్లాడినట్లు సమాచారం. ఎంపిక వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో సోమవారం నిర్ణయం తీసుకుంటానని వెల్లడించినట్లు ఆ పార్టీ నేతలు ‘సాక్షి’కి చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీ టిక్కెట్టు బలిజలకు ఇచ్చేందుకు జిల్లా నేతలు అడ్డుపడటంపై ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.

టిక్కెట్టు ఇవ్వాలనే ఆలోచన ఉన్నపుడు ‘స్థాయి’తో పనేంటని, టీడీపీలో పెత్తనం చెలాయిస్తున్న సామాజికవర్గంతో తాము అణగదొక్కబడ్డామని, ఇప్పటికైనా తమకు న్యాయం చేయకపోతే పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాల్సి వస్తుందని పలువురు నేతలు జిల్లా నేతలతో గట్టిగానే తమ వాదన చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు సోమవారం ఎవరి పేరును ప్రకటిస్తారనేది ఆపార్టీశ్రేణులతో పాటు జిల్లా వాసుల్లోనూ ఉత్కంఠను రేపుతోంది.

#

Tags

Videos

ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్

అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Photos

+5

తాగుడుకు బానిసైన హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)