amp pages | Sakshi

నా బిడ్డను బతికించండి

Published on Fri, 05/20/2016 - 18:05

చంద్రబాబు దర్శనం కోసం ఆర్నెల్లుగా పడిగాపులు
హామీ ఇచ్చి ముఖం చాటేసిన చినబాబు
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్త ఆవేదన

 
విజయవాడ (గాంధీనగర్): అతను తెలుగుదేశం పార్టీలో క్రియాశీల కార్యకర్త. అతని పెద్ద కుమారుడు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు. కొడుకు ఆలనాపాలనా చూసే భార్య ఏడాది క్రితం మరణించింది. దీంతో తనను ఆదుకోవాలంటూ పార్టీపెద్దల్ని ఆశ్రయించగా మొదట్లో సాయం చేస్తామన్న పెద్దలు తరువాత ముఖం చాటేశారు. సాయం కోసం ఆర్నెల్లుగా సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకునే నాథుడే లేడు. ముఖ్యమంత్రిని కలసి గోడు చెప్పుకొందామంటే అధికారులు అనుమతించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన పి.వెంకటరమణకు ఇద్డరు కుమారులు. పెద్ద కుమారుడు చైతన్య (6) మూడేళ్లుగా పీడియాట్రిక్ న్యూరో డిజార్డర్ వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్య పరీక్షలు చేయిస్తే మెదడులో సమస్య ఉందని వైద్యులు నిర్థారించారు. ఆరేళ్ల వయసు వచ్చినా వ్యాధికారణంగా చైతన్య నిలబడలేడు.. కూర్చోలేడు. వేరొకరి సాయం కావాల్సిందే.

రెండేళ్లపాటు అతడి బాగోగులు చూసిన తల్లి లక్ష్మి గత ఏడాది అనారోగ్యంతో కన్నుమూసింది. పిల్లలిద్దరి భారం వెంకటరమణపై పడింది. అయినవారి ఆదరణ కరువైంది. దీంతో ఉన్న 1.30 ఎకరం భూమిని విక్రయించగా వచ్చిన డబ్బుతో చైతన్యకు వైద్యం చేయించాలనుకున్నాడు. ఆ డబ్బు వైద్యపరీక్షలు, మందులకే సరిపోయింది. హైదరాబాద్‌లోని లోటస్ హాస్పిటల్‌లో చేర్పించగా మెరుగైన వైద్యం కోసం చెన్నై వెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు.

చెన్నైలోని కంచి కామకోటి చిల్డ్రన్స్ ట్రస్ట్ హాస్పిటల్‌లో పరీక్షలు చేయించగా వైద్యానికి రూ. 6 లక్షల ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో ప్రభుత్వ సాయం కోసం ఆర్నెల్లుగా తన బిడ్డను తీసుకుని క్యాంప్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అక్కడి అధికారులు సీఎంకు తన గో డు చెప్పుకొనేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో రోడ్డున పడ్డాడు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలవాలని ప్రాధేయపడినా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

టీడీపీ క్రియాశీల కార్యకర్తని : వెంకటరమణ  
నాకు ఎన్టీఆర్ అంటే అభిమానం. తెలుగుదేశం పార్టీలో క్రియాశీల సభ్యత్వం ఉంది. పార్టీకోసం పదేళ్లు పనిచేశాను. వైఎస్సార్ కడప జిల్లాలో పార్టీ నిర్వహించిన ప్రతి రక్తదాన శిబిరంలోనూ రక్తం ఇచ్చాను. కార్యకర్త కుటుంబానికి ఆపద వస్తే పట్టించుకునేవారే కరువయ్యారు.. మార్చిలో మా జిల్లాలో జరిగిన కార్యకర్తల సమావేశంలో లోకేశ్‌ను కలిశాను. సమస్య వివరించి, రిపోర్టులు చూపించాను.

తప్పక ఆదుకుంటానని హామీ ఇచ్చారు.. నేటి వరకు పట్టించుకోలేదు. కనీసం జిల్లా పార్టీ నాయకులు కూడా పట్టించుకోవడం లేదు.  భార్య చనిపోయింది. ఉన్న కాస్త పొలం వైద్యఖర్చుల కోసం అమ్మేశాను. పని చేసుకుందామంటే పిల్లోడి బాగోగులు చూసేవారు లేరు. ప్రభుత్వ సాయం అందేలా లేదు. అధికారులు అది గో ఇదిగో అంటున్నారు.. ఇక నాకు చావే శరణ్యం..  ప్రభుత్వ పెద్దలు కరుణించి ఆదుకోవాలి.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)