amp pages | Sakshi

గ్రానైట్‌ వ్యాపారుల ఆందోళన

Published on Tue, 05/30/2017 - 23:21

కరీంనగర్‌సిటీ: వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ)కు వ్యతిరేకంగా గ్రానైట్‌ వ్యాపారులు ఆందోళనను ఉధృతం చేశారు. మూడు రోజులపాటు కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఎదుట రిలే దీక్షలు చేపట్టిన గ్రానైట్‌ మా ర్బుల్‌ వ్యాపారులు సోమవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నాకు దిగారు. జీఎస్‌టీ ద్వారా గ్రానైట్‌ పరిశ్రమలపై 28శాతం పన్ను విధించడాన్ని నిరసిస్తూ కరీం నగర్‌లోని పద్మనగర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 28శాతం పన్నును 5 శాతానికి తగ్గించి గ్రానైట్‌ పరిశ్రమను కాపాడాలని డిమాండ్‌ చేశారు. దాదాపు గంట సేపు ఆందోళన అనంతరం కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు వినతిపత్రం అందజేశారు. రెండు శాతంగా ఉన్న పన్నును 28 శాతానికి పెంచిందని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో గ్రానైట్‌ పరిశ్రమలపై భారం పడి మూతపడే ప్రమాదముందన్నారు.

పరిశ్రమనే నమ్ముకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవిస్తున్న వేలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదముందుని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమగా పేరుగాంచిన గ్రానైట్‌ ఇండస్ట్రీని కాపాడాలని కోరారు. లేనిపక్షంలో నిరవ«ధికంగా గ్రానైట్‌ సంస్థలను మూసేసి ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రానైట్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు శంకర్, ప్రధాన కార్యదర్శి గంగుల ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్

అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Photos

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)