amp pages | Sakshi

వామ్మో ఏపీ చీప్‌లిక్కరా?

Published on Thu, 11/05/2015 - 02:59

♦  చీప్‌లిక్కర్ ధరను 25 శాతం తగ్గించిన అక్కడి సర్కార్
♦ 180 ఎంఎల్ సీసా ధర తెలంగాణలో రూ. 60, ఏపీలో రూ.45
♦ 15 రోజుల్లో అక్కడి డిస్టిలరీల నుంచి మార్కెట్‌లోకి...
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చీప్‌లిక్కర్‌కు ఉన్న డిమాండ్‌ను ఏపీ సీఎం చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారా? ఏపీలో డిమాండ్ లేని చీప్‌లిక్కర్ ధరను తగ్గించి, ఉత్పత్తి పెంచి తెలంగాణకు అక్రమ మార్గాల ద్వారా పంపేందుకు గేట్లు తెరిచారా? అవుననే అంటున్నారు రాష్ర్ట ఆబ్కారీ శాఖ అధికారులు. తెలంగాణలో గుడుంబా నియంత్రణకు తీసుకుంటున్న చర్యల వల్ల చీప్‌లిక్కర్ డిమాండ్ బాగా పెరిగింది. రాష్ట్రంలోని ఐదు డిస్టిలరీలు నెలకు మూడున్నర లక్షల పెట్టెల (ఒక పెట్టెకు 180 ఎంఎల్ సీసాలు 48) చీప్‌లిక్కర్‌ను ఉత్పత్తి చేస్తున్నా గత నెలలో నాలుగు జిల్లాల్లో తీవ్ర కొరత ఏర్పడింది.

గుడుంబాపై యుద్ధం ఇలాగే కొనసాగితే తెలంగాణలో నెలకు 5 లక్షల పెట్టెలు అవసరమని ఆబ్కారీ శాఖ నిర్ధారించింది. ఈ పరిణామాలను ఏపీ సర్కార్ అనుకూలంగా మలుచుకుంటోంది. అక్టోబర్ 21న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏపీలో చీప్‌లిక్కర్‌పై వ్యాట్‌ను 50 శాతం (190 నుంచి 140 శాతానికి) మేర తగ్గించింది. ఈ ఉత్తర్వులు మరో 15 రోజుల్లో కార్యరూపం దాల్చనున్నాయి. తద్వారా ఏపీలో చీప్‌లిక్కర్ ధరలు ఏకంగా 25 శాతం తగ్గనున్నాయి. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణల్లో 180 ఎంఎల్ చీప్‌లిక్కర్ ధర రూ.60 ఉండగా, ఇకపై ఏపీలో రూ. 45కే లభించనుంది. అలాగే 90 ఎంఎల్, 60 ఎంఎల్ పరిమాణంలో పెట్‌బాటిల్స్‌లో ఉత్పత్తికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తద్వారా 90 ఎంఎల్ సీసా రూ. 25కు, 60 ఎంఎల్ సీసా రూ.15కే మందుబాబులకు లభించనుంది.

 పొంచివున్న అక్రమ ర వాణా ముప్పు
 ఏపీలోని 13 జిల్లాల్లో చీప్‌లిక్కర్ వినియోగం అతి తక్కువ. మొత్తం విక్రయాల్లో 15-20 శాతమే ఉంటుంది. అక్కడ మీడియం, ప్రీమియం లిక్కర్‌లకే అధిక డిమాండ్ ఉండగా, చీప్‌లిక్కర్‌ను 30 శాతం మేర ఉత్పత్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడంపై టీ సర్కార్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్కడున్న 8 డిస్టిలరీల్లో చీప్‌లిక్కర్ ఉత్పత్తికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ రెండు డిస్టిలరీల నుంచే చౌకమద్యం తయారవుతుండగా, వాటి సామర్థ్యం పెంచడంతో పాటు మిగతా డిస్టిలరీల్లోనూ చీప్‌లిక్కర్ ఉత్పత్తికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

తెలంగాణలో ఉన్న డిమాండ్‌ను ఆసరాగా తీసుకొని ఏపీ చీప్‌లిక్కర్‌ను తరలించే కుట్ర జరుగుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ ద్వారా రాష్ట్రంలోకి అక్రమ రవాణా చేస్తారని భావిస్తున్నారు. దీంతో ఈ మూడు జిల్లాల్లో నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని ఇటీవల ప్రభుత్వం ఆబ్కారీ శాఖను ఆదేశించింది. రెండ్రోజుల క్రితం కమిషనర్ చంద్రవదన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో సమావేశమై కార్యాచరణ రూపొందించారు. అనుభవమున్న సిబ్బందిని ఆ మూడు జిల్లాలకు పంపి అక్రమంగా వచ్చే చీప్‌లిక్కర్‌ను అడ్డుకోవాలని నిర్ణయించారు. తెలంగాణలో చీప్‌లిక్కర్ ఉత్పత్తి అవుతున్న 5 డిస్టిలరీల్లో సామర్థ్యం పెంచాలని నిర్ణయించారు.

Videos

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)