amp pages | Sakshi

ప్రత్యేక హోదా కోసం రేపు ప్రజాబంద్‌

Published on Sun, 07/31/2016 - 21:43

కాకినాడ సిటీ:
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంలో కేంద్రం, రాష్ట్రంలోని పాలక పార్టీలు బీజేపి, టీడీపిలు అవలంబిస్తున్న ధోరణిని నిరసిస్తూ మంగళవారం ప్రజాబంద్‌కు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. స్థానిక సుందరయ్యభవన్‌లో ఆదివారం సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషబాబ్జి సంయుక్తంగా ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.  2వ తేదీన జరిగే రాష్ట్ర బంద్‌కు జిల్లాలో ఉన్న అన్ని వాణిజ్య, వ్యాపార వర్గాలు, విద్యాసంస్థలు, ఆర్టీసీ, కార్మిక, కర్షకులు, ప్రజలు, ప్రజాసంఘాలు సహకరించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.  విభజన సమయంలోనూ, తరువాత ఇచ్చిన హామీలను పక్కనపెట్టి పాలకపార్టీలు రాష్ట్ర ప్రజలను దగా చేశారని విమర్శించారు. గతంలో నేరుగా కేబినేట్‌ తీర్మానంతో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించారని, ఎక్కడా చట్టం చేయలేదని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేసరికి కుంటిసాకులు చెబుతున్నారన్నారు. ఆవిషయం విభజన చట్టంలో పొందుపరచ లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ తెలుగుదేశం, బీజేపీ దొంగనాటకాలు ఆడుతున్నాయన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా ఉద్యమానికి కలిసిరావాలని, అన్ని పక్షాలను కలుపుకుని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళి కేంద్రంపై తీవ్ర వత్తిడి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం కాకినాడ నగర కార్యదర్శి పలివెల వీరబాబు, సీపీఐ కాకినాడ నగర, రూరల్‌ కార్యదర్శులు తోకల ప్రసాద్, నక్కా కిషోర్‌ పాల్గొన్నారు. 
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)