amp pages | Sakshi

ట్రాఫిక్‌ చక్రబంధంలో గొల్లపూడి

Published on Sat, 08/27/2016 - 00:05

గొల్లపూడి (విజయవాడ రూరల్‌) : 
 గొల్లపూడి గ్రామంలో  ట్రాఫిక్‌ సమస్య రోజు రోజుకూ  జఠిలమవుతోంది. ఈ గ్రామం విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ              రహదారికి ఆనుకుని ఉండటంతో గ్రామస్తులకు ప్రాణసంకటంగా మారింది. ముఖ్యంగా మైలురాయి సెంటర్, వన్‌ సెంటర్, సారాకొట్టు సెంటర్‌లో ప్రజలు రోడ్డును క్రాస్‌చేసి ఆవలి వైపునకు  వెళ్లాలంటే   ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. మైలురాయి సెంటర్‌లో ఈ సమస్య అధికంగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్‌ వైపునుంచి వచ్చే వాహనాలు, బైపాస్‌రోడ్డులో విజయవాడ నుంచి వచ్చే వాహనాలు గొల్లపూడి మైలురాయి సెంటర్‌వద్ద క్రాస్‌ అవుతాయి.  అదే ప్రాంతంలో భవానీపురం నుంచి వచ్చే బస్సులు, ప్రభుత్వ వాహనాలు రోడ్డును క్రాస్‌ చేసుకుని వెళ్లాల్సి రావడంతో నిత్యం చిన్నచిన్న రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు ఏమాత్రం అజాగ్రత్తతో  ఉన్నా ప్రమాదం పొంచి ఉందన్నమాటే. పోలీసు అవుట్‌ పోస్టు ఉన్నప్పటికీ ట్రాఫిక్‌ పోలీసులు లారీలను బైపాస్‌             రోడ్డుకు పంపేందుకు సూచికలు చూపిస్తున్నారే తప్ప విజయవాడ వైపునుంచి (టీటీడీసీ)వైపు నుంచి వచ్చే వాహనాలకు ఎలాంటి సిగ్నల్స్‌  ఇవ్వడంలేదు. అదేవిధంగా వన్‌ సెంటర్‌లో క్లాస్‌ వన్‌ పీపుల్స్‌ ఉంటారు. ప్రతి కుటుంబానికి రెండు కార్లు, మూడు బైక్‌లు ఉంటాయి.  రోజూ ఉదయం సాయంత్రం ట్రాఫిక్‌ రద్దీ చెప్పనలవి కాదు. మొన్నటి వరకు రాష్ట్రనీటి పారుదలశాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆ సెంటర్‌కు దగ్గరలో ఉండటం వలన ట్రాఫిక్‌ పోలీసులు ఉండేవారు. ప్రస్తుతం ఆయన విజయవాడలో ఉండడంతో పోలీసులు కనిపించడం లేదు. సారాకొట్టు సెంటర్‌ మాస్‌ పీపుల్స్‌ సెంటర్‌. సాయంత్రం అయ్యిందంటే సెంటర్‌ కిటకిటలాడుతోంది. హోటల్స్, టిఫిన్స్‌ అమ్ముకొనేవారు అక్కడే  ఉండడంతో ఎలాంటి వాహనాలైనా అక్కడ ఆగాల్సిందే. ఇరుకైన సెంటర్‌ కావడం తో సహజంగా ఉండాల్సిన ట్రాఫిక్‌ కం టే ఎక్కువగా సమస్య ఉంటుంది. సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజాప్రతినిధులను గామస్తులు కోరుతున్నారు.
 

Videos

నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ

టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా

ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!

ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య

వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?